ఈ 5 రాశుల వారితో శత్రుత్వం అస్సలు మంచిదికాదు.. వీరితో పెట్టుకుంటే ఇక అంతే సంగతులు!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ఏ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు. ముఖ్యంగా వీరి కోపం చాలా భయంకరంగా ఉంటుంది. వీరితో శత్రుత్వం అస్సలు మంచిదికాదు. వీరితో పెట్టుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మరి ఆ రాశులేంటో చూద్దామా..

ఏ రాశుల వారితో శత్రుత్వం పెట్టుకోవద్దు?
ప్రతి వ్యక్తి స్వభావం అతని రాశి మీద ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కొన్ని రాశులవారు సహనానికి మారుపేరు అయితే.. మరికొన్ని రాశులవారు కోపానికి మారుపేరుగా ఉంటారు. వీరికి కోపం వస్తే తట్టుకోవడం కష్టం. అలాగే వీరితో శత్రుత్వం ఎదుటివారికి అస్సలు మంచిదికాదు. ఎదుటివారు ఎంత బలవంతులైనా సరే.. వీరు టైం చూసి దెబ్బకొడతారు. వీరి కోపానికి సన్నిహితులు సైతం కంగారుపడతారు. మరి ఏ రాశివారికి ఇలాంటి స్వభావం ఉంటుందో ఇక్కడ చూద్దాం.
మేష రాశి
మేషరాశి వారు ఏ విషయంలోనైనా చాలా త్వరగా స్పందిస్తారు. వీరు అంత ప్రమాదకరం కాదు. కానీ వీరికి ఎవరైనా కోపం తెప్పించినా లేదా అవమానించినా.. వెంటనే ప్రతీకారం తీర్చుకుంటారు. పగ తీర్చుకోవడానికి వేచి చూడరు. అందుకే వీరికి కోపం తెప్పించే విషయాలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి
వృషభ రాశి వారు చాలా మొండివారు. వారి కోపాన్ని ఎప్పుడూ రెచ్చగొట్టకూడదు. ఒకసారి కోపం వస్తే, దాన్ని సులభంగా మర్చిపోరు. తమ శత్రుత్వాన్ని బహిరంగంగా ఒప్పుకోకపోయినా.. సైలెంట్ గా పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తారు. సమయం వచ్చినప్పుడు భయంకరంగా మారుతారు. వీరితో అస్సలు పెట్టుకోకూడదు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కోపం వస్తే తుఫాను సృష్టించగలరు. వీరు శత్రువులపైన నేరుగా దాడి చేయరు. కానీ విషపూరిత మాటలు, పుకార్లు వ్యాప్తి చేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తారు. వీరితో ఎందుకురా పెట్టుకున్నామని అనుకునే విధంగా టార్చర్ చేస్తారు. ఈ రాశివారితో గొడవ అస్సలు మంచిదికాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారి కోపం చాలా అస్థిరంగా, భయంకరంగా ఉంటుంది. వీరు స్వభావరీత్యా సూటిగా ఉంటారు. వీరు తమ శత్రువులను అంత సులభంగా వదిలిపెట్టరు. శత్రువు సిద్ధంగా లేనప్పుడు సమయం చూసి దెబ్బ కొడుతారు. వీరు కొట్టే దెబ్బ ఎదుటివ్యక్తి జీవితంపై తీవ్ర ప్రభావం చూపించే విధంగా ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. దానివల్ల తొందరగా నొచ్చుకుంటారు. వీరు ఒకసారి బాధపడితే, చాలాకాలం పాటు ద్వేషాన్ని మనసులో అలాగే పెట్టుకుంటారు. తమ పగను ఎప్పటికీ మర్చిపోరు. ఏ చిన్న విషయం వీరిని ఇబ్బంది పెట్టినా.. దాన్ని గుర్తుపెట్టుకొని మరీ.. ప్రతీకారం తీర్చుకుంటారు.