Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. అప్పుల నుంచి విముక్తి!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 21.07.2025 సోమవారానికి సంబంధించినవి.
- FB
- TW
- Linkdin
Follow Us

మేష రాశి ఫలాలు
ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి ఫలాలు
ముఖ్యమైన పనుల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలకు సంబంధించి ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
మిథున రాశి ఫలాలు
ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
సింహ రాశి ఫలాలు
ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కన్య రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాల్లో నిరాశ తప్పదు.
తుల రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. పిల్లలకు చదువు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.
వృశ్చిక రాశి ఫలాలు
ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నల్లో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూలం.
ధనుస్సు రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
మకర రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాల్లో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది.
కుంభ రాశి ఫలాలు
ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాహనయోగం ఉంది. సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. అప్పులు తీర్చగలుగుతారు.
మీన రాశి ఫలాలు
బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన రుణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటి వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.