MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన, వస్తు లాభం కలుగుతుంది!

నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన, వస్తు లాభం కలుగుతుంది!

Today Rasi Phalalu:ఈ రాశి ఫలాలు 20.10.2025 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Oct 20 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : Getty

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణయత్నాలు కలిసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

నూతన వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం అందిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు కలిసివస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో వివాదాలు వస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆకస్మికంగా డబ్బు ఖర్చు అవుతుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పనులు చకచకా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పాతమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విభేదాలు చికాకు కలిగిస్తాయి. కుటుంబంలో కొందరి మాటలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం దైవ చింతన కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
ఈ 5 రాశుల వారితో శత్రుత్వం అస్సలు మంచిదికాదు.. వీరితో పెట్టుకుంటే ఇక అంతే సంగతులు!
Recommended image2
కేతు సంచారం.. ఈ 4 రాశులవారు కష్టాల నుంచి బయటపడ్డట్లే- ఇక అన్నీ మంచి రోజులే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved