MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పవు!

Today Rasi Phalalu: ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పవు!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 20.06.2025 శుక్రవారానికి సంబంధించినవి.

3 Min read
Author : Kavitha G
Published : Jun 20 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

మేష రాశివారిని అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ రాశివారు వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఒత్తిడికి లోనవుతారు. నిరుద్యోగులకు శ్రమ తప్పా ఫలితం కనిపించదు. కుటుంబ వాతావరణం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు దక్కవు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

వృషభ రాశివారు చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇవి భవిష్యత్తులో మీకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత పెట్టుబడుల ద్వారా ఆదాయం వస్తుంది. ఉద్యోగులు జీతం విషయంలో శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది.

Related Articles

Related image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు రాత్రికి రాత్రే ధనవంతులవుతారు!
Related image2
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ!
312
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

మిథున రాశివారు ఉద్యోగంలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఈ రాశివారు స్నేహితుల సాయంతో కొన్ని అప్పుల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. అయితే అందిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఉత్తమం.

412
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశి వారిని వృత్తి, వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దానివల్ల ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఈ రాశి వారికి ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. తోటివారితో సఖ్యతగా మెలగడం మంచిది. పిల్లల చదువు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త లేకపోతే ఇబ్బందులు తప్పవు.  

512
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సింహ రాశివారు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కాబట్టి వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగటం వల్ల తగినంత విశ్రాంతి లభించదు. ప్రశాంతత కరవవుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

612
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

కన్య రాశి వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఈ రాశివారికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలకాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కలిసివస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చు. 

712
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

తుల రాశివారిని అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. మరీ ముఖ్యంగా కంటి సంబంధిత సమస్య వల్ల డాక్టర్ ను సంప్రదించాల్సి వస్తుంది. ఈ రాశివారు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఇంట్లో కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మెలగడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగం విషయంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.

812
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశివారికి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయ మార్గలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. 

912
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ధనుస్సు రాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు తెప్పిస్తాయి. ఈ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఏ పనిచేసినా పెద్దగా ఫలితం కనిపించదు. నిరుద్యోగులకు కొన్ని అవకాశాలు దక్కుతాయి. అయితే లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ధనుస్సు రాశివారు వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

1012
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

మకర రాశివారికి నేడు (శుక్రవారం) బాగా కలిసివస్తుంది. ముఖ్యమైన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి. డబ్బు వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు కలిసివస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. 

1112
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

కుంభ రాశివారికి కూడా శుక్రవారం మంచి ఫలితాలు ఉన్నాయి. నిరుద్యోగుల కలలు సాకరమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. స్వల్ప లాభాలు వస్తాయి. వ్యాపారాలు జోరందుకుంటాయి. ఈ రాశివారు ఉత్సాహంగా పని చేసి అన్నింట్లో లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

1212
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

మీన రాశివారు ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులుతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగులకు తోటివారితో మాటపట్టింపులు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు, నిరుద్యోగులకు  పెద్దగా కలిసిరాకపోవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు 2 రాశులవారికి ఆకస్మిక ధనలాభం.. చేపట్టిన పనుల్లో విజయం!
Recommended image2
Mercury Magic: బుధుడి మాజాకాలంతో సెప్టెంబర్ లో ధనవంతులయ్యే రాశులు ఇవే..!
Recommended image3
September Horoscope: 12 రాశుల మాస ఫలాలు.. సెప్టెంబర్ లో ఈ రాశులదే హవా! మీది ఏ రాశి?
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు రాత్రికి రాత్రే ధనవంతులవుతారు!
Recommended image2
Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టినవారు రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved