Today Rasi Phalalu: ఈ రాశివారికి శత్రువులే మిత్రులుగా మారి సహాయం చేస్తారు!
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 20.07.2025 ఆదివారానికి సంబంధించినవి.
- FB
- TW
- Linkdin
Follow Us

మేష రాశి ఫలాలు
పాత విషయాలు గుర్తు చేసుకుంటారు. ఇంటి విషయాల్లో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.
వృషభ రాశి ఫలాలు
బంధువులతో అకారణంగా మాట పట్టింపులు ఉంటాయి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు చికాకు తెప్పిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
మిథున రాశి ఫలాలు
బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
సింహ రాశి ఫలాలు
ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికమవుతుంది.
కన్య రాశి ఫలాలు
ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల తలనొప్పి తప్పదు. వ్యాపారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల చదువు విషయాలపై దృష్టి సారించడం మంచిది.
తుల రాశి ఫలాలు
సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. సోదరుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి ఫలాలు
భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ధనుస్సు రాశి ఫలాలు
స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి సమస్యలు తప్పవు.
మకర రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
కుంభ రాశి ఫలాలు
భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సహకాలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీన రాశి ఫలాలు
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థులకు అంతగా కలిసిరాదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపార భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.