MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • Today Rasi Phalalu: నేడు ఈ రాశివారికి జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు తప్పవు!

Today Rasi Phalalu: నేడు ఈ రాశివారికి జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు తప్పవు!

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 20.12.2025 శనివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Dec 20 2025, 05:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
నేటి రాశి ఫలాలు
Image Credit : AI

నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

వ్యాపారాలు లాభాలబాట పడతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉన్న సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది.

313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు లాభాలబాట పడతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి.

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. రుణ భారం అధికమవుతుంది. వృత్తి, వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగాలలో అదనపు భాధ్యతలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు మిత్రుల నుంచి పెట్టుబడులకు డబ్బు సహాయం అందుతుంది.

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలు కలిసివస్తాయి. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకరమవుతాయి. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి.

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

వ్యాపార భాగస్వాములతో వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వల్ల సకాలంలో పనులు పూర్తి కావు. వృత్తి, ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుంచి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో చాలకాలంగా పూర్తి కానీ పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. శ్రమతో కానీ పనులు పూర్తికావు. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు. బంధువర్గం నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాలో పుట్టినవారు సూపర్ ఫాస్ట్.. వీరిని పట్టుకోవడం చాలా కష్టం!
Recommended image2
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి జీవితాంతం కష్టాలు తప్పవు.. పాపం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved