Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి జీవితాంతం కష్టాలు తప్పవు.. పాపం!
సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టినవారికి కష్టాలు ఎక్కువ. చిన్న వయసులోనే బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రతికూల ఫలితాలు, సవాళ్లు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మరి ఏ తేదీల్లో పుట్టినవారిని దురదృష్టం ఇలా వెంటాడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Birth Dates Numerology
సంఖ్యా శాస్త్రం ప్రకారం జన్మ తేదీ, నక్షత్రం, లగ్నం, గ్రహ స్థితులు.. మనుషుల జీవితాలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా కొన్ని నిర్దిష్ట తేదీల్లో పుట్టినవారికి జీవితాంతం కష్టాలు తప్పవు. చిన్ననాటి నుంచే బాధ్యతలు, ఆటుపోట్లు, భావోద్వేగ ఒత్తిడులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఆ తేదీలేంటో తెలుసుకుందామా…
8, 13, 18, 22, 26, 31 తేదీల్లో పుట్టినవారు..
ఏ నెలలో అయినా 8, 13, 18, 22, 26, 31 తేదీల్లో పుట్టినవారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని కర్మకారకుడు కావడంతో ఈ తేదీల్లో పుట్టినవారు గత జన్మ కర్మఫలాలను ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది. వీరి జీవితంలో విజయాలు ఆలస్యంగా వస్తాయి. ఎంత కష్టపడ్డా ఫలితం రావడానికి సమయం పడుతుంది. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు వీరి జీవితంలో సాధారణంగా కనిపిస్తాయి.
8, 26 తేదీల్లో పుట్టినవారు
ముఖ్యంగా 8, 26 తేదీల్లో పుట్టినవారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఉద్యోగాల్లో మార్పులు, వ్యాపారాల్లో నష్టాలు, నమ్మిన వారే మోసం చేయడం వంటి అనుభవాలు వీరిని మానసికంగా బలహీనులను చేస్తాయి. అయితే ఎంత కష్టం వచ్చినా తట్టుకునే శక్తి వీరిలో ఉంటుంది. వీరికి ఎదురైనా కష్టాలే వీరిని లోపలి నుంచి బలంగా తీర్చిదిద్దుతాయి.
13, 31 తేదీల్లో పుట్టినవారు..
ఏ నెలలో అయినా 13, 31 తేదీల్లో పుట్టినవారికి జీవితం ఒక పరీక్షలా ఉంటుంది. ఒక సమస్య తీరింది అనుకుంటే మరో సమస్య ఎదురవుతుంది. కుటుంబంలో శాంతి లోపించడం, దాంపత్య జీవితంలో అపార్థాలు, ఉద్యోగంలో సరైన గుర్తింపు లేకపోవడం వంటి సమస్యలు తరచూ ఎదురవుతాయి. వీరిపై రాహు-కేతు ప్రభావం ఎక్కువ. అందుకే వీరి జీవితంలో అనిశ్చితి ఎక్కువగా ఉంటుంది.
18, 22 తేదీల్లో పుట్టినవారు..
ఏ నెలలో అయినా 18, 22 తేదీల్లో పుట్టినవారు భావోద్వేగ పరంగా చాలా సున్నితమైన వారు. ఇతరుల కోసం ఎక్కువగా త్యాగాలు చేస్తారు. కానీ ప్రతిఫలం మాత్రం ఆశించిన విధంగా లభించదు. ప్రేమలో మోసం, స్నేహాల్లో దూరం, కుటుంబ సభ్యులే అర్థం చేసుకోకపోవడం వీరి జీవితంలో సాధారణం.
కష్టాలు శాశ్వతం కాదు..
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టినవారికి కష్టాలు శాశ్వతం కాదు. వీరికి జీవితం కఠినంగా కనిపించినా, అదే వారికి ప్రత్యేకమైన అనుభవ జ్ఞానాన్ని ఇస్తుంది. శని ప్రభావం ఉన్నవారు నిజాయితీగా, క్రమశిక్షణతో జీవిస్తే చివరికి గౌరవం, స్థిరత్వం తప్పకుండా లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శనివారం శని దేవునికి దీపం వెలిగించడం, నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానం చేయడం, హనుమాన్ చాలీసా లేదా శని స్తోత్రం పఠించడం వంటి చర్యలు మానసిక బలాన్ని ఇస్తాయని పండితులు సూచిస్తున్నారు.

