Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి జీవిత భాగస్వామితో తిప్పలు తప్పవు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 14.01.2025 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృషభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. బంధువులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.
మిథున రాశి ఫలాలు
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. మిత్రులతో ఆర్థిక విషయంలో విబేధాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.
కర్కాటక రాశి ఫలాలు
భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఇంట్లో కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి.
సింహ రాశి ఫలాలు
సోదరులతో ఇంటి వాతావరణం సందడిగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
కన్య రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించటం మంచిది. చిన్ననాటి మిత్రుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో తిప్పలు తప్పవు.
తుల రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు స్థిరంగా రాణించవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృథా ఖర్చులు అధికమవుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘ కాలిక వివాదాల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు రాశి ఫలాలు
కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగులు విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మకర రాశి ఫలాలు
ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలిసివస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతిలో డబ్బు ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభ రాశి ఫలాలు
నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం దక్కదు. ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు.
మీన రాశి ఫలాలు
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.

