Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధన లాభం.. అన్నింట్లో అనుకూల ఫలితాలు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 11.01.2025 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.
వృషభ రాశి ఫలాలు
వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. ఆప్తుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మిథున రాశి ఫలాలు
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటక రాశి ఫలాలు
బందువులతో వివాదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో గంధరగోళ పరిస్థితులుంటాయి.
సింహ రాశి ఫలాలు
స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఇంటా బయటా సమస్యలు కొంత బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
కన్య రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.
తుల రాశి ఫలాలు
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత చికాకు తెప్పిస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి.
ధనుస్సు రాశి ఫలాలు
వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. బంధువుల నుంచి డబ్బుకు సంబంధించిన ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు.. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు.
మకర రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో సమస్యలు తొలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సన్నిహితుల నుంచి అత్యంత కీలక సమాచారం అందుతుంది.
కుంభ రాశి ఫలాలు
ఉద్యోగులు నూతనోత్సాహంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
మీన రాశి ఫలాలు
వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.

