- Home
- Astrology
- Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు అందంలో అప్సరసలు.. వీరిని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవుతారు!
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు అందంలో అప్సరసలు.. వీరిని చూస్తే ఎవ్వరైనా ఫిదా అవుతారు!
మన సంస్కృతిలో అందం అనేది ముఖానికి మాత్రమే పరిమితం కాదు. అది వ్యక్తి నడకలో, మాటల్లో, చూపులో ప్రతిబింబించే ఒక అంతర్గత కాంతి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు ఈ అంతర్గత కాంతిని కలిగి ఉంటారు. మరి ఆ నక్షత్రాలేంటో చూద్దామా..

Birth Stars Astrology
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రం.. వ్యక్తి స్వభావం, ఆలోచనలు, ఆకర్షణ, వ్యక్తిత్వం మీద ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు సహజమైన అందం, ఆకర్షణ కలిగి ఉంటారు. వీరి అందం ముఖ ఆకృతిలోనే కాకుండా వారి మాటల్లో, నడకలో, ప్రవర్తనలో కూడా వ్యక్తమవుతుంది. మరి ఆ నక్షత్రాలేంటో తెలుసుకోండి.
రోహిణి నక్షత్రం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోహిణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు అందానికి ప్రతీక. చంద్రుడికి అత్యంత ప్రియమైన నక్షత్రం కావడం వల్ల, వీరిలో ముఖంలో సహజమైన కాంతి, ఆకర్షణ ఉంటాయి. వీరి కళ్లలో మెరుపు, మాటల్లో మాధుర్యం ఉంటాయి. ఈ నక్షత్రాల్లో పుట్టిన అమ్మాయిలు మాట్లాడితే ఎదుటివారికి తెలియకుండానే ఆకర్షితులవుతారు. ఈ లక్షణాల వల్లే వీరిని అప్సరసలతో పోలుస్తారు.
మృగశిర నక్షత్రం
మృగశిర నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు కూడా అందంగా ఉంటారు. వీరిలో ఎప్పుడూ ఒక నవ్వు, చలాకీతనం కనిపిస్తుంది. ముఖం సాధారణంగా అందంగా ఉండడమే కాకుండా, వారి హావభావాలు మరింత ఆకట్టుకునే విధంగా ఉంటాయి. వీరు నడిచే తీరు, మాట్లాడే శైలి ఎంతో సున్నితంగా ఉంటుంది. అప్సరసల వర్ణనల్లో చెప్పే లావణ్యం, చురుకుదనం వీరిలో స్పష్టంగా కనిపిస్తాయి.
ఉత్తర ఫల్గుణి నక్షత్రం
ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. వీరి ముఖంలో ఒక రకమైన ప్రశాంతత, గంభీరత రెండూ ఉంటాయి. సాధారణంగా వీరు పెద్దగా అలంకారాలు లేకున్నా కూడా ఆకర్షణీయంగా కనిపిస్తారు. వీరి చూపులో ఆత్మవిశ్వాసం, నడకలో స్థిరత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు వీరిని చూస్తే ఒక రకమైన దైవిక భావన కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
హస్త నక్షత్రం
హస్త నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు చక్కటి ముఖ కాంతితో పాటు కళాత్మకతను కలిగి ఉంటారు. వీరి చేతుల కదలికలు, హావభావాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీరు నవ్వితే ముఖం మొత్తం వెలిగిపోతుంది. హస్త నక్షత్రం ప్రభావంతో వీరు ఇతరుల మనసులను సులభంగా గెలుచుకునే శక్తి కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన అమ్మాయిల అందం ఇతరులపై ఓ మంత్రంలా పనిచేస్తుందని జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్నాయి.
చిత్త నక్షత్రం
చిత్త నక్షత్రంలో పుట్టిన అమ్మాయిలు చిత్రంలా ఉంటారు. వీరి ముఖంలో ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఫ్యాషన్, అలంకరణ, నడక అన్నిటిలోనూ వీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరి అందం వెంటనే ఇతరుల చూపును ఆకర్షించడమే కాకుండా, చాలాసేపు వారి మనసులో నిలిచిపోతుంది.

