Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 10.04.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. మిత్రులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.
వృషభ రాశి ఫలాలు
భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ వర్గాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మిథున రాశి ఫలాలు
నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అండదండలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి ఫలాలు
బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. సంతాన ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలలో మరింత ఓర్పుతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ యత్నాలు అంతగా కలిసిరావు.
సింహ రాశి ఫలాలు
ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
కన్య రాశి ఫలాలు
కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యలు తొలగుతాయి.
తుల రాశి ఫలాలు
నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. బంధు మిత్రులతో అనుకోని విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
వృశ్చిక రాశి ఫలాలు
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆర్థికంగా అనుకూలం.
ధనుస్సు రాశి ఫలాలు
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.
మకర రాశి ఫలాలు
చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఉన్నతాధికారులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.
కుంభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు అనుకూలం. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో శుభకార్యాలకు హాజరవుతారు. ప్రయాణాలలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.
మీన రాశి ఫలాలు
మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత అధికమవుతుంది. వృత్తి, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి.

