- Home
- Astrology
- Shukra Gochar: సంక్రాంతికి ముందే శుక్రుడి మార్పు.. ఈ రాశులవారు కోరుకున్నదల్లా జరుగుతుంది
Shukra Gochar: సంక్రాంతికి ముందే శుక్రుడి మార్పు.. ఈ రాశులవారు కోరుకున్నదల్లా జరుగుతుంది
Shukra Gochar: సంపదను ఆకర్షించే శుక్రుడు మకర సంక్రాంతికి ముందు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి. కెరీర్ లో మంచి ఎదుగుదల ఉంటుంది. కోరికలన్నీ నెరవేరతాయి. మరి,ఆ రాశులేంటో చూద్దాం..

మేష రాశి..
శుక్రుడు మేష రాశి పదో ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మేష రాశివారు ఊహించని ఆర్థిక లాభాలు పొందవచ్చు. దీనితో, మీరు వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించుకోవచ్చు. సమాజంలో గౌరవం పెరగొచ్చు.దీనితో, సమాజంలో అందరి దృష్టి మీపై ఉండొచ్చు. దీనితో పాటు.. మీ కెరీర్ లో కూడా చాలా ప్రయోజాలను పొందచ్చు. మీరు మీ కార్యాలయంలో మీ సహోద్యోగుల నుండి పూర్తి సపోర్టు లభిస్తుంది. దీనితో పాటు, మీరు మీ లైఫ్ స్టైల్ లో మార్పులు చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. ఈ కాలంలో కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మకర రాశి...
శుక్రుడు మకర రాశిలో మొదటి ఇంట్లో అంటే లగ్న స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సంచారం మీ కోరికలన్నీ నెరవేరతాయి. మీరు మీ సహోద్యోగుల నుంచి మంచి సపోర్టు పొందుతారు. వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. కెరీర్ పరంగా మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెంచుకోవడానికి కొత్త మార్గాలు మీకు ఎదురౌతాయి. ఈ సమయంలో మీరు మునుపటి కంటే ఎక్కువగా పొదుపు చేస్తారు.
కర్కాటక రాశి...
కర్కాటక రాశి వారికి శుక్రుడు 7వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ శుక్ర సంచారం కారణంగా ఈ రాశివారు కొత్త ప్రదేశాలకు ప్రయణాలు చేసే అవకాశం ఉంది. మీరు చూడాలి అనుకున్న చాలా ప్లేసులకు వెళ్లి వస్తారు. సుఖాలు, విలాసాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ లో మంచి గ్రోత్ ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి.
వృషభ రాశి...
వృషభ రాశి వారికి శుక్రుడు మీ 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీకు గొప్ప అదృష్టం లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతి రంగంలోనూ అపారమైన విజయాన్ని సాధించగలరు. ఈ కాలంలో మీకు విదేశాలకు వెళ్లడానికి అనేక అవకాశాలు లభిస్తాయి. దీనితో పాటు, ప్రేమలో ఉన్నవారు లేదా వివాహం గురించి ఆలోచిస్తున్న వారు కూడా అందులో విజయం సాధిస్తారు. మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులలో, మీరు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. దానధర్మాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనితో పాటు, మీరు తోబుట్టువులతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు.
కన్య రాశి...
శుక్రుడు మీ రాశి నుండి ఐదవ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశివారికి వ్యాపారంలో లాభాలు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా, ఈ సంచార సమయంలో, మీరు ఎక్కువ డబ్బును కూడబెట్టుకోవచ్చు . మంచి అవకాశాలను పొందవచ్చు. పెట్టుబడి సంబంధిత పనులలో ఉన్నవారు మంచి లాభాలను పొందవచ్చు. మీ ప్రియమైన వారితో సంబంధాలు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. మీ ఆరోగ్యం గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. మీ శక్తి , రోగనిరోధక శక్తి గతంలో కంటే చాలా మెరుగ్గా ఉంటాయి.

