MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Baba Vanga Prediction: 2026 అంత భయంకరంగా ఉంటుందా? భయపెడుతున్న బాబా వంగా జోస్యం

Baba Vanga Prediction: 2026 అంత భయంకరంగా ఉంటుందా? భయపెడుతున్న బాబా వంగా జోస్యం

Baba Vanga Prediction: బాబా వంగా 2026 కోసం షాకింగ్ జోస్యం చెప్పారు. ఈ సంవత్సరం ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) మానవులను మించి అభివృద్ధి చెందుతుందని, ఊహించలేని ప్రమాదాన్ని తెస్తుందని ఆమె హెచ్చరిస్తున్నారు. 

2 Min read
ramya Sridhar
Published : Dec 10 2025, 05:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Baba Vanga
Image Credit : Getty

Baba Vanga

బాబా వంగా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 2026 సంవత్సరం సమీపిస్తున్న కొద్దీ, బాబా వంగా అంచనాలను అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, ప్రకృతి వైపరీత్యాల గురించి ఆమె అంచనాలతో పాటు, మానవులు సృష్టించిన యంత్రాలు మానవులనే నాశనం చేస్తాయని ఆమె చెప్పిన మాటలు అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

23
ఎవరీ బాబా వంగా
Image Credit : Getty

ఎవరీ బాబా వంగా

2026 సంవత్సరం దగ్గరపడుతున్న కొద్దీ, బాబా వంగా చెప్పిన ప్రవచనాలు మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమౌతున్నాయి. బల్గేరియాకు చెందిన ఈ అంధ జోతిష్కురాలు 1911లో జన్మించి 1996లో మరణించారు. ఆమె జీవిత కాలంలో చెప్పిన అనేక అంచనాలు ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, అంటువ్యాధులు తర్వాత నిజమయ్యాయి. కరోనా మహమ్మారి, గల్ఫ్ యుద్ధం, భూకంపాలు వంటి అనేక సంఘటనలు ఆమె మాటలకు దగ్గరగానే జరిగాయి. ఇప్పుడు 2026 గురించి ఆమె చెప్పిన విషయాలు ప్రపంచాన్నే ఆలోచనలో పడేస్తున్నాయి.

Related Articles

Related image1
Zodiac signs: ఈ రాశుల అమ్మాయిలకు అసలు కోపమే రాదు.. ఓర్పులో సీతా దేవి తో సమానం
Related image2
Leo Horoscope 2026: కొత్త సంవత్సరంలో సింహ రాశి జాతకం, కనక వర్షం కురవనుందా?
33
AI ( ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) గురించి భారీ హెచ్చరికలు...
Image Credit : Getty

AI ( ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) గురించి భారీ హెచ్చరికలు...

బాబా వంగా ప్రకారం, 2026 నాటికి కృత్రిమ మేథస్సు మానవ బుద్ధిని దాటిపోతుంది. మనిషి చేసే చాలా పనులను యంత్రాలు స్వయంగా చేయగలుగుతాయి. దీని వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు.

ఆమె అంచనా ప్రకారం....

యంత్రాలు మానవులను ఆజ్ఞాపించినట్లుగా విననని, భవిష్యత్తులో మానవ ప్రభావానికి వ్యతిరేకంగా పని చేస్తాయని, మానవ నియంత్రణను తిరస్కరించే పరిస్థితి రావచ్చని హెచ్చరించింది. ఏఐ వేగంగా ఎదుగుతున్న తీరు చూస్తే, ఇది చాలా మందికి నిజం అయ్యే అవకాశం ఉందని అనిపిస్తోంది.

అనుకోని ప్రమాదాలు...

బాబా వంగా ప్రకారం, 2026లో ప్రకృతి పరంగా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. చాలా ప్రకృతి వైపరీత్యాలు అధికమయ్యే అవకాశం కూడా ఉంది. ద్వీప దేశాల్లో భారీ భూకంపాలు, అగ్నిపర్వాతల విస్ఫోటం, తీవ్రమైన పర్యావరణ మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల చాలా ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

గతంలో నిజమైన బాబా వంగా జోస్యం....

12 సంవత్సరాల వయసులో కంటి చూపు కోల్పోయిన తర్వాత ఆమె అంతర దృష్టి తో అనేక అంచనాలు చెప్పడం ప్రారంభించింది. ఆమె ముందుగా చెప్పిన కొన్ని నిజమైన సంఘటనలు...

కరోనా వైరస్ మహమ్మారి

1990ల గల్ఫ్ యుద్ధం

అనేక భూకంపాలు

యూరప్‌లో అంతర్గత రాజకీయ కల్లోలం

అలాగే 2028లో మరో కొత్త వైరస్ ప్రపంచానికి పెద్ద ప్రమాదమని ఆమె హెచ్చరించింది.

సారాంశం

బాబా వంగా చెప్పిన ప్రతి అంచనా నిజమైందని చెప్పలేం. కానీ ఆమె ముందుగా చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయని చూస్తే, ప్రజలు 2026 ప్రవచనాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. AI ఎదుగుతున్న వేగం, ప్రకృతి మార్పులు, అంతరిక్ష పరిశోధన ఇవి ఆమె మాటలను కొంతవరకు నిజంగానే అనిపించేలా చేస్తున్నాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac sign: క‌ర్కాట‌క రాశిలోకి కేతువు.. 2026లో ఈ 3 రాశుల‌ వారి జీవితంలో ఊహించ‌ని మ‌లుపులు
Recommended image2
మిథున రాశివారికి కొత్త సంవత్సరంలో ఎలా ఉండనుందో తెలుసా?
Recommended image3
Hanuman Zodiac signs: హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే
Related Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అమ్మాయిలకు అసలు కోపమే రాదు.. ఓర్పులో సీతా దేవి తో సమానం
Recommended image2
Leo Horoscope 2026: కొత్త సంవత్సరంలో సింహ రాశి జాతకం, కనక వర్షం కురవనుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved