MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac Signs: ఈ 5 రాశులవారు ఈ రంగు డ్రెస్సులు వేసుకోవడం అస్సలు మంచిదికాదు.. ఎందుకో తెలుసా?

Zodiac Signs: ఈ 5 రాశులవారు ఈ రంగు డ్రెస్సులు వేసుకోవడం అస్సలు మంచిదికాదు.. ఎందుకో తెలుసా?

రంగు రంగుల దుస్తులు మన అందాన్ని పెంచడమే కాదు.. మన మనసు, భావోద్వేగాలు, అదృష్టంపై కూడా ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా కొన్ని రాశులవారు కొన్ని ప్రత్యేక రంగులను అస్సలు వేసుకోకూడదట. ఏ రాశులవారు ఏ రంగులకు దూరంగా ఉండాలో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Apr 27 2026, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రాశుల ప్రకారం ధరించకూడని రంగులు
Image Credit : Getty

రాశుల ప్రకారం ధరించకూడని రంగులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం ధరించే రంగులు కూడా మన జీవితంపై సున్నితమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి రాశికి ఒక అధిపతి గ్రహం ఉంటుంది. ఆ గ్రహానికి అనుకూలమైన రంగులు ఉన్నట్లే, కొన్ని రంగులు ప్రతికూలంగా పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కొన్ని రాశులవారు కొన్ని రంగుల దుస్తులకు దూరంగా ఉండటం మంచిదని పండితులు చెబుతున్నారు. మరి ఏ రాశులవారు, ఏ రంగు దుస్తులు వేసుకోకూడదో ఇక్కడ చూద్దాం.

26
మేష రాశి
Image Credit : Getty images

మేష రాశి

మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రాశివారు సహజంగా ఉత్సాహంగా, ఆవేశపూరితంగా ఉంటారు. వీరికి ఎక్కువగా నలుపు రంగు దుస్తులు ధరించడం మానసికంగా ఒత్తిడిని పెంచవచ్చని పండితులు చెబుతున్నారు. నలుపు శని గ్రహానికి సంబంధించింది కాబట్టి, ఇది మేష రాశివారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశముందట. అందువల్ల వీరు ఎరుపు, ముదురు గులాబీ వంటి ఉత్సాహాన్ని పెంచే రంగులను ఎంచుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

Related Articles

Related image1
Weekly Horoscope: ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసా..?
Related image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు కెరీర్‌లో టాప్.. వీళ్లను ఎవరూ ఆపలేరు!
36
వృషభ రాశి
Image Credit : Getty

వృషభ రాశి

వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వీరికి తెలుపు, లేత పచ్చ వంటి సాఫ్ట్ రంగులు అనుకూలంగా ఉంటాయి. కానీ ఎక్కువగా ముదురు ఎరుపు లేదా గాఢమైన నారింజ రంగులు ధరించడం వల్ల వీరి మానసిక సమతుల్యత కొంతవరకు దెబ్బతినే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రంగులు కుజుడి ప్రభావాన్ని పెంచి, సాధారణంగా శాంతంగా ఉండే వృషభ రాశివారిని అసహనంగా మార్చే అవకాశం ఉందట.

46
మిథున రాశి
Image Credit : Pixabay

మిథున రాశి

మిథున రాశికి అధిపతి బుధుడు. వీరు తెలివిగా, చురుకుగా ఉంటారు. అయితే వీరికి గాఢమైన నలుపు లేదా బూడిద రంగులు ఎక్కువగా ధరించడం వల్ల ఆలోచనా విధానంలో గందరగోళం పెరిగే అవకాశముందని పండితులు చెబుతున్నారు. బుధుడు ప్రకాశవంతమైన రంగులను ఇష్టపడే గ్రహం కాబట్టి.. లేత పసుపు, ఆకుపచ్చ వంటి రంగులు వీరి మానసిక స్పష్టతను పెంచుతాయని సూచిస్తున్నారు.

56
కర్కాటక రాశి
Image Credit : Getty

కర్కాటక రాశి

కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. వీరు భావోద్వేగాలకు లోనయ్యే స్వభావం కలవారు. వీరికి గాఢమైన ఎరుపు లేదా నలుపు రంగులు ఎక్కువగా ధరించడం భావోద్వేగ ఒత్తిడిని పెంచవచ్చని పండితులు హెచ్చరిస్తున్నారు. చంద్రుడికి సంబంధించిన తెలుపు, క్రీమ్, లేత నీలం వంటి రంగులు వీరికి శాంతి, సౌఖ్యాన్ని ఇస్తాయని చెబుతున్నారు.

66
కన్య రాశి
Image Credit : Getty

కన్య రాశి

కన్య రాశి వారికి కూడా బుధుడే అధిపతి. ఈ రాశివారు చాలా ప్రాక్టికల్‌గా, విశ్లేషణాత్మకంగా ఉంటారు. అయితే వీరు గాఢమైన ఎరుపు లేదా చాలా ప్రకాశవంతమైన రంగులను అధికంగా ధరించడం వల్ల మానసిక అస్థిరత, ఆందోళన పెరిగే అవకాశముందని పండితులు చెబుతున్నారు. వీరు లేత ఆకుపచ్చ, బేజ్, పసుపు వంటి సాఫ్ట్ రంగులను ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Relief: ఈ రత్నం ధరిస్తే శని మీకు దాసోహం అవ్వాల్సిందే..!
Recommended image2
Wealth Yogam: చంద్రదశ యోగం ఉంటే ఈ 3 రాశుల వారు చిన్న వయసులోనే కోటీశ్వరులవుతారు
Recommended image3
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు!
Related Stories
Recommended image1
Weekly Horoscope: ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసా..?
Recommended image2
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు కెరీర్‌లో టాప్.. వీళ్లను ఎవరూ ఆపలేరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved