Zodiac signs: శని, గురు సంచారం.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు.!
ఏప్రిల్ నెలలో శని, గురు నక్షత్రాలు మారనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పులు 12 రాశులపై ప్రభావం చూపిస్తాయి. కర్మ ప్రదాత శని, సంతోషానికి, అభివృద్ధికి కారకుడైన గురు గ్రహాల నక్షత్ర సంచారం కొన్ని రాశుల జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకురానుంది. ఆ రాశులెంటో.. వారికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు సమయానుసారం రాశులు, నక్షత్రాలు మారుస్తుంటాయి. గ్రహాల మార్పుల వల్ల 12 రాశి చక్రాలపై మంచి, చెడు ప్రభావాలు ఉంటాయి. ఏప్రిల్ నెలలో గురు, శని గ్రహాలు మృగశిర, ఉత్తర భాద్రపద నక్షత్రాల్లో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి శుభం కలుగుతుంది. ఇది వారికి చాలా మంచి సమయం. మరి ఏ రాశులవారికి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి
గురు, శని గ్రహాల మార్పులు కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు ఇవ్వనున్నాయి. కర్కాటక రాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు. గురు నక్షత్రం మారిన తర్వాత ఈ రాశి వారికి చాలా అవకాశాలు వస్తాయి. ఇది వారికి కలిసి వచ్చే కాలం. పట్టిందల్లా బంగారం అవుతుంది.
సింహ రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహ రాశి వారికి గురుడు అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఈ సమయంలో సింహ రాశి వారు ఏ పని చేపట్టినా మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
మకర రాశి
మకర రాశి వారికి ఇది మంచి సమయం. మీ వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఇంటి వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.