- Home
- Andhra Pradesh
- TTD: రూ. 300 టికెట్ దొరక్కపోయినా తిరుమల వెంకన్నను త్వరగా దర్శించుకునే అవకాశం.. ఈ హోమం గురించి మీకు తెలుసా?
TTD: రూ. 300 టికెట్ దొరక్కపోయినా తిరుమల వెంకన్నను త్వరగా దర్శించుకునే అవకాశం.. ఈ హోమం గురించి మీకు తెలుసా?
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. చాలా మంది రూ. 300 టికెట్ బుక్ చేసుకొని అందుకు అనుగుణంగా టూర్ ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈ టికెల్ లేకపోయినా వేగంగా దర్శనం పూర్తి చేసుకునే మరో అవకాశం ఉంది
- FB
- TW
- Linkdin
Follow Us

రూ. 300 టికెట్ లేకున్నా పర్లేదు
ఆగస్టు నెలలో కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లాలని అనుకుంటున్నారా.? అయితే రూ. 300 టికెట్ లేదన్న కారణంతో ట్రిప్ వాయిదా వేస్తున్నారా.? అయితే ఇకపై ఆ అసరం లేదు. స్వామి వారిని త్వరగా దర్శించుకోవడంతో పాటు హోమం నిర్వహించుకునేలా టీటీడీ ఒక ప్రత్యేక పద్ధతితిని ప్రవేశపెట్టింది. ఇంతకీ ఈ సేవ ఏంటి.? టికెట్లు ఎలా పొందాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.1600 టికెట్లతో ప్రత్యేక దర్శనం అవకాశం
ఆగస్టులో దర్శనానికి మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని టీటీడీ అందిస్తోంది. ఈ నెల జూలై 25వ తేదీ ఉదయం 10 గంటలకు, ‘శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం’ పేరిట ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్క టికెట్ ధర రూ. 1600 కాగా, ఒక్క టికెట్‌తో ఇద్దరు భక్తులు హాజరవవచ్చు. ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారు, దర్శనానికి ముందే అలిపిరిలోని సప్తగృహ వద్ద రిపోర్ట్ చేయాలి.
హోమం అనంతరం స్వామివారి దర్శనం
ఆ రోజు ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలి అనంతరం అక్కడ నిర్వహించే హోమం 11 గంటల లోపు పూర్తి అవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు రూ. 300 ప్రత్యేక దర్శన క్యూ ద్వారా స్వామివారి దర్శనం చేయవచ్చు.
పుష్కరిణి తాత్కాలికంగా మూసివేత
ఇదిలా ఉంటే తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి జూలై 20 నుంచి ఆగస్టు 19 వరకు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల ముందు పుష్కరిణిలో శుద్ధి పనులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కావడం వల్ల ముందుగానే పనులు చేపడుతున్నారు. ఈ సమయంలో పుష్కరిణి హారతి ఉండదు, అలాగే భక్తులకు కోనేరు ప్రవేశం ఉండదు.
భక్తులకు టీటీడీ కీలక సూచనలు
భక్తులు ఈ సమయాల్లో పుష్కరిణిలోకి వెళ్లకూడదని, హారతిని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు, మరమ్మతుల అనంతరం మాత్రమే రావాలని తెలిపారు. అదే సమయంలో టికెట్ల లభ్యతపై నిరాశ చెందకుండా శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ద్వారా దర్శనం చేసుకోవచ్చని సూచించారు.