Astrology: ఈ రాశుల వారికి అక్టోబర్ చాలా ప్రత్యేకం.. ఏ రోజున ఏం జరగనుందంటే.?
Astrology: అక్టోబర్ నెల ప్రారంభమైంది. ఈ నెల కొన్ని రాశుల వారికి మంచి చేస్తే మరికొంత మందికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి అక్టోబర్‌లో కుంభ రాశి వారికి ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాపారం, ఆర్థిక పరిస్థితి
అక్టోబర్ నెలలో కుంభ రాశి వారికి వ్యాపారంలో మంచి అవకాశాలు కనిపిస్తాయి. బుధుడు, శుక్రుడు ప్రభావంతో కిరాణా, ఎలక్ట్రానిక్స్ వ్యాపారులు లాభాలు పొందుతారు. అక్టోబర్ 9 నుంచి కొత్త పెట్టుబడులు, వాహన కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. కానీ శని ప్రభావం వల్ల భాగస్వామ్యాలలో జాగ్రత్త అవసరం. అక్టోబర్ 17 నుంచి ప్రభుత్వ రంగంలో లాభాలు కనిపిస్తాయి.
ఉద్యోగం, వృత్తి
ఉద్యోగస్తులకు అక్టోబర్ ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. కానీ 17 వరకు ఖర్చులు పెరగవచ్చు. ఫార్మా, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. అక్టోబర్ 18 తర్వాత బృహస్పతి అనుకూలంగా ఉండటం వల్ల కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. ఆర్థిక నిర్వహణపై శ్రద్ధ వహిస్తే లాభాలు కలుగుతాయి.
కుటుంబం, సంబంధాలు
అక్టోబర్ 8 వరకు మాటల్లో జాగ్రత్త అవసరం. 9 నుంచి 23 వరకు కుటుంబంలో ఆనందం, శాంతి వాతావరణం ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే సోదరుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అక్టోబర్ 17 తర్వాత తండ్రితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
విద్యార్థులకు అనుకూలం
ఈ నెలలో విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలు పొందవచ్చు. అక్టోబర్ 18 తర్వాత ఉన్నత విద్యలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అక్టోబర్ 27 నుంచి క్రీడాకారులు గాయాల కారణంగా కొన్ని అవకాశాలను కోల్పోవచ్చు.
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త
అక్టోబర్ 16 వరకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లలో నిర్లక్ష్యం చేయకండి. శనిగ్రహ ప్రభావం రోగనిరోధక శక్తిని తగ్గించవచ్చు. అక్టోబర్ 2న విజయదశమి, అక్టోబర్ 6న శరద్ పూర్ణిమ, అక్టోబర్ 10న కర్వా చౌత్, అక్టోబర్ 16న దానం వంటి పూజలు చేస్తే శుభఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద అక్టోబర్ నెల కుంభ రాశి వారికి వ్యాపారం, ఉద్యోగం, కుటుంబం, విద్యలో కొత్త అవకాశాలు తెస్తుంది. కానీ ఖర్చులు, ఆరోగ్యం, సంబంధాలలో జాగ్రత్త అవసరం.
గమనిక: పైన తెలిపిన వివరాలు పలువురు జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించనవి. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.