Kubera Yoga: గ్రహాల మార్పులతో కుబేర యోగం....ఈ రాశుల జీవితంలో కనక వర్షం కురవడం ఖాయం
Kubera Yoga: కర్కాటక రాశిలో గురు, శుక్ర గ్రహాల కలయిక వల్ల కుబేర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల తలరాత మారిపోనుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. సంపద పెరుగుతుంది.

కుబేర యోగం
జోతిష్యశాస్త్రంలో గురు, శుక్ర గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు గ్రహాలను అత్యంత శుభప్రదమైన గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గజలక్ష్మీ రాజయోగం లేదా సరస్వతీ యోగం, కుబేర యోగం ఏర్పడుతుంది. ఈ కలయిక ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ, వివాహ విషయంలో శుభ ఫలితాలను ఇస్తుంది. గురు గ్రహం జూన్ 2న కర్కాటక రాశిలోకి అడుగుపెడుతుంది. శుక్ర గ్రహం కూడా జూన్ 8న కర్కాటక రాశిలోకి అడుగుపెడుతుంది. ఒకే రాశిలో రెండు గ్రహాల కలయిక కుబేర యోగాన్ని ఏర్పరుస్తుంది. దీని కారణంగా కొన్ని రాశుల జీవితాలు అద్భుతంగా మారనున్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం.....
మేష రాశి.....
మేష రాశి వారికి గురు, శుక్ర గ్రహాల అనుగ్రహం లభిస్తుంది. దీని వల్ల ఈ రాశి వారి కెరీర్ ఊహించని మార్పులు జరుగుతాయి. మంచి పురోగతి సాధించగలరు. ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి పెద్ద కంపెనీల్లో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి లేదా వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఇది సవర్ణ అవకాశం. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
2.కర్కాటక రాశి....
కర్కాటక రాశి వారికి గురు, శుక్ర గ్రహాల కలయిక శుభ ఫలితాలను ఇస్తుంది. శుక్రుడు విలాసాలకు, సంపదకు అధిపతి. కాగా, గరు శ్రేయస్సుకు అధిపతి. ఈ రెండు గ్రహాలు జాతకంలో బలంగా ఉండటం వల్ల ఈ రాశివారికి ధన ప్రవాహం పెరుగుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. భూమి, ఇల్లు లేదా వాహనం కొనడానికి ఇది మంచి సమయం. బంగారం, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లు, వ్యాపారాల నుంచి మంచి ఆర్థిక లాభాలు పొందుతారు.
3.కన్య రాశి...
కన్య రాశి వారికి గురు-శుక్ర కలయిక శుభప్రదం. గురువు కుటుంబ కారకుడు కాబట్టి, కుటుంబ జీవితంలో శాంతి నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో నామకరణం, గృహప్రవేశం లేదా మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు శుభవార్తలు వింటారు. పిల్లల విద్యలో పురోగతి ఉంటుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
4.వృశ్చిక రాశి...
వృశ్చిక రాశి వారు అదృష్టవంతులు. శుక్రుడు ప్రేమ, వివాహానికి అధిపతి. ఈ సమయంలో, వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి తగిన భాగస్వామి లభిస్తారు. వివాహానికి ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగిపోయి, పరస్పర ప్రేమ, నమ్మకం పెరుగుతాయి.
ధనుస్సు రాశి..
ధనుస్సు రాశి వారికి ఇది శుభ సమయం. ప్రేమలో ఉన్న జంటలకు కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది. వివాహం జరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. లాటరీ ద్వారా మీకు లాభం కలగవచ్చు. వ్యాపారంలో ఆకస్మిక ధన లాభాలకు అవకాశం ఉంది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవకాశాలు లభిస్తాయి.

