Sun Moon Conjunction: 2026లో సూర్య చంద్ర సంయోగం, ఈ 3 రాశులకు కొత్త ఇంటి యోగం
Sun Moon Conjunction: కొత్త ఏడాదిలో అంటే 2026లో మొదటిసారిగా సూర్యుడు, చంద్రుడు కలవబోతున్నారు. జనవరి 18న మకరరాశిలో వీరిద్దరి కలయిక జరగబోతోంది. ఈ సూర్య చంద్ర సంయోగం కొన్ని రాశులకు బీభత్సంగా కలిసివస్తుంది.

సూర్య చంద్ర సంయోగం
పన్నెండు గ్రహాలలో సూర్యుడు, చంద్రుడు ముఖ్యమైన గ్రహాలు. ఈ రెండు గ్రహాల కలయిక, సంచారం వ్యక్తి జాతకంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. జనవరి 18, 2026న చంద్రుడు మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక సూర్యుడు జనవరి 14న అదే మకరరాశిలోకి వెళ్తాడు. దీనివల్ల సూర్య చంద్రుల సంయోగం జరుగుతుంది. ఈ కలయిక వల్ల మూడు రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది.
కర్కాటక రాశి
కొత్త ఏడాదిలో మకరరాశిలో సూర్య చంద్రుల సంయోగం కర్కాటక రాశి వారికి ఎన్నో ప్రయోజనాలను మోసుకొస్తుంది. ఈ రాశిలోని ఉద్యోగులు నిజాయితీగా కష్టపడి పనిచేస్తే వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ పై అధికారులు మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంటారు. ఈ రాశిలోని అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యసమస్యలు తగ్గి ఆనందంగా జీవిస్తారు.
ధనూ రాశి
సూర్య చంద్రుల సంయోగం అనేది ధనుస్సు రాశి వారికి ఎంతో సంతోషాన్ని అందిస్తుంది. పెద్ద సమస్యలతో బాధపడేవారు 2026లో ఆ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవిస్తారు. పనిపైనే దృష్టి పెట్టే నిజాయితీగా పనిచేస్తే ఉద్యోగులకు తిరుగుండదు. మీ శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితం కూడ చక్కగా సాగుతుంది.
మకర రాశి
సూర్య చంద్రుల కలయిక మకర రాశిలోనే జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగంలో మీకు మంచి పేరు వస్తుంది. వ్యాపారులకు ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న వైవాహిక బంధం బలపడుతుంది.

