- Home
- Astrology
- Zodiac sign: ఈ 6 రాశుల వారు ఇక ఊపిరి పీల్చుకోండి.. 62 ఏళ్ల తర్వాత అరుదైన నవపంచమి రాజయోగం.
Zodiac sign: ఈ 6 రాశుల వారు ఇక ఊపిరి పీల్చుకోండి.. 62 ఏళ్ల తర్వాత అరుదైన నవపంచమి రాజయోగం.
Zodiac sign: అక్టోబర్ 2వ తేదీ అంటే దసరా రోజు తెల్లవారు జామున 3.32 గంటలకు అరుదైన నవంపంచమి రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల 6 రాశుల వారికి కలిసిరానుందని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏవంటే.?

62 ఏళ్ల తరువాత అరుదైన యోగం
జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈసారి దసరా పండుగ రోజు, అంటే అక్టోబర్ 2న తెల్లవారు జామున 3.32 గంటలకు బుధుడు, గురుడు, శుక్రుడు ఒకే సమయంలో కలిసిపోవడంతో అరుదైన నవపంచమి రాజయోగం ఏర్పడనుంది. 62 ఏళ్ల తరువాత ఏర్పడుతున్న ఈ యోగం ఆరు రాశివారికి ప్రత్యేకంగా శుభఫలితాలు అందిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గతంలో ఎదుర్కొన్న కష్టాలు తగ్గి, కొత్త అవకాశాలు దక్కే సమయం రానుందని వారు సూచిస్తున్నారు.
సింహ రాశి – పెట్టుబడుల లాభం, ఉద్యోగంలో గుర్తింపు
ఈ రాశివారికి ఈ యోగం అదృష్టాన్ని అందిస్తుంది. గతంలో చేసిన పెట్టుబడులపై అనూహ్య లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సీనియర్ల సహకారం ఉండటంతో పనులు సులభంగా పూర్తవుతాయి. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.
కన్యా రాశి – కొత్త బాధ్యతలు, ఆర్థిక బలం
కన్య రాశివారికి ఈ యోగం సానుకూల ఫలితాలను అందిస్తుంది. ఉన్నతాధికారులు మీ పనిని గుర్తించి కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. అనుకోని ఆర్థిక లాభాలు రావడంతో పరిస్థితి బలపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది, పెద్ద సమస్యలు ఎదురుకావు.
వృశ్చిక రాశి – ఆటంకాలు తొలగిపోతాయి, ప్రమోషన్ అవకాశాలు
ఈ రాశివారు గతంలో ఆగిపోయిన పనులను తిరిగి విజయవంతంగా పూర్తి చేస్తారు. పూర్వీకుల ఆస్తి దక్కే అవకాశం ఉండటంతో రుణబాధలు తగ్గుతాయి. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకోని ప్రమోషన్లు, వేతన పెరుగుదల దక్కుతుంది. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూసిన వారికి మంచి వార్తలు వస్తాయి.
ధనుస్సు – సంపద పెరుగుదల
ధనుస్సు రాశివారు ఏ పని చేసినా అడ్డంకులు లేకుండా విజయవంతం అవుతారు. శత్రువులు స్నేహితులుగా మారుతారు. విదేశీ ప్రయాణాల కోరిక నెరవేరుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మీన రాశి – ఆరోగ్యం, వృత్తిలో పురోగతి
మీన రాశివారికి ఆర్థికంగా అనుకూల సమయం వస్తుంది. వృత్తిపరంగా గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులు అనుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి.
మకర రాశి వారికి సమస్యల నుంచి పరిష్కారం
ఇక మకర రాశివారికి సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులు కొత్త బ్రాంచులు ప్రారంభించే అవకాశం ఉంది. ఆదాయ వనరులు పెరుగుతాయి.
గమనిక: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.