Birth stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు గవర్నమెంట్ జాబ్ ఛాన్స్ ఎక్కువ
Birth stars: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. కానీ, ఈ ఉద్యోగం సాధించడానికి టాలెంట్ ఎంత ముఖ్యమూ ఓర్పు కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి ఉన్నాయి

birth stars
జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలకు ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. వీరికి క్రమశిక్షణ, ఓర్పు,కఠిన పరిస్థితులను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. మరి ఆ నక్షత్రాలేంటో చూద్దాం....
ఉత్తరాషాడ నక్షత్రం...
ఈ నక్షత్రాల్లో పుట్టిన అబ్బాయిలు జీవితంలో లక్ష్యం పెట్టుకొని.. దానిని నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. పోటీ పరీక్షలకు అవసరం అయిన సహనం, నిరంతర ప్రయత్నం వీరిలో సహజంగా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నత పదవులు దక్కే యోగం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది.
మాఘ నక్షత్రం...
మాఘ నక్షత్రానికి చెందిన అబ్బాయిలకు కూడా అధికార భావన, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి స్థాయికి వెళ్లగలరు. అందరి గౌరవాన్ని పొందగలరు. ఇచ్చిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలరు. పరిపాలనా రంగాల్లో వీరికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.
శ్రవణా నక్షత్రం....
శ్రవణా నక్షత్రంలో పుట్టిన వారికి ఓర్పు చాలా ఎక్కువ. శక్తి కూడా ఎక్కువ. ఏదైనా నేర్చుకోవాలనే పట్టుదల కూడా చాలా ఎక్కువ. వీరు కాస్త క్రమశిక్షణతో చదవితే ఎలాంటి పరిక్షల్లో అయినా విజయం సాధిస్తారు. ప్రభుత్వ సేవా రంగాల్లో స్థిరమైన ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
4.పునర్వసు నక్షత్రం...
పునర్వసు నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలకు కాస్త అదృష్టం ఎక్కువగా ఉంటుంది. వీరి అదృష్టానికి కష్టం కూడా తోడు అయితే.. వీరు కోరుకున్న మంచి స్థాయికి చేరుకుంటారు. ఒకసారి జీవితంలో ఏదైనా విఫలం అయినా.... మళ్లీ ప్రయత్నించే మనస్తత్వం వీరిది. అందుకే.. పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగం సాధించే సత్తా వీరిలో ఉంటుంది.
ధనిష్ఠ నక్షత్రం...
ధనిష్ఠ నక్షత్రానికి చెందిన అబ్బాయిలు కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. వీరికి టైమ్ మేనేజ్మెంట్ కూడా బాగా తెలుసు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అని వీరు అనుకుంటే.... వీరికి గ్రహాలు కూడా అనుకూలిస్తాయి.
డిఫెన్స్, పోలీస్, ఇతర ప్రభుత్వ విభాగాల్లో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి.
గమనిక:
నక్షత్రం ఒక సహాయక సూచన మాత్రమే. నిజంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే కఠిన శ్రమ, సరైన ప్రణాళిక, ఓర్పు తప్పనిసరి. జ్యోతిష యోగాలకు తోడు ప్రయత్నం కలిసినప్పుడే ఫలితం వస్తుంది.

