- Home
- Astrology
- Rare Yogam in 100 Years: వందేళ్ల తర్వాత శని రాశిలో 4 గ్రహాల కలయిక, ఈ 3 రాశుల వారు వెరీ లక్కీ
Rare Yogam in 100 Years: వందేళ్ల తర్వాత శని రాశిలో 4 గ్రహాల కలయిక, ఈ 3 రాశుల వారు వెరీ లక్కీ
Rare Yogam in 100 Years: వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 2026లో కుంభరాశిలో నాలుగు గ్రహాలు కలవబోతున్నాయి. దీనివల్ల చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది. ఇది చాలా అరుదైన యోగం. వందేళ్ల తరువాత ఏర్పడుతుంది. కొన్ని రాశుల వారికి ఇది ఎంతో కలిసొచ్చే కాలం.

మరొక్క నెలలో అరుదైన యోగం
జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు ఏర్పరచే యోగాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 2026లో కుంభరాశిలో 4 గ్రహాలు కలవబోతున్నాయి. కుంభరాశికి అధిపతి శని. ఈ ఇంట్లో జరిగే కలయిక నాలుగు గ్రహాలతో కలిసి చతుర్గ్రహ యోగాన్ని సృష్టిస్తుంది. ఈ యోగం కొన్ని రాశులకు భారీగా కలిసొచ్చేలా చేస్తుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం దక్కుతుంది.
మిథున రాశి
మిథున రాశి వారికి చతుర్గ్రహ యోగం బాగా శుభప్రదమైన యోగం. వీరికి ఈ నెలలో బాగా కలిసివస్తుంది. మిథునరాశి వారు ఈ గ్రహాల కలయిక వల్ల ఎన్నో లాభాలను పొందుతారు. ఈ రాశిలో తొమ్మిదో ఇంట 'భాగ్య స్థానం'లో ఈ యోగం ఏర్పడబోతోంది. ఈ సమయంలో అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది. ఉద్యోగం చేస్తున్నవారికి, వ్యాపారంలో ఉన్నవారికి కూడా విపరీతమైన వృద్ధి కనిపిస్తుంది. ఆర్ధికంగా వీరు మంచి స్థాయికి చేరుకుంటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి చతుర్గ్రహ యోగం ఎంతో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ యోగం ఈ రాశిలో నాలుగో ఇంట సుఖ స్థానంలో ఏర్పడబోతోంది. కాబట్టి వీరికి సకల సంపదలు కలుగుతాయి. ఈ సమయంలో సౌకర్యాలు, విలాసాలు అనుభవిస్తారు. అలాగే ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్, జీతాల పెంపు వంటివి కలుగుతాయి. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు ఎన్నో లాభాలు పొందుతారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి చతుర్గ్రహి యోగం ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకోవాలి. ఈ సంచారం కుంభరాశి వారి లగ్న స్థానంలో జరుగుతుంది. కాబట్టి వీరికి ఆత్మవిశ్వాసం, గౌరవం పెరుగుతాయి. ఇక పెళ్లికాని వారికి మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. అలాగే మీకు పూర్వీకుల ఆస్తులు మీ చేతికి వస్తాయి. ఈ యోగం ఏర్పడే కాలం కుంభ రాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది.

