Lucky Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారంటే కుబేరుడుకి ఎంత ఇష్టమో
Lucky Birth Date: న్యూమరాలజీ.. పుట్టిన తేదీని బట్టి ఒక మనిషి జీవితం ఎలా ఉంటుందో అంచనా వేసి చెబుతుంది. దీని ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వారు ఏ దేవుని అనుగ్రహాన్ని కలిగి ఉంటారా కూడా అంచనా వేయవచ్చు. అలా కుబేరుని అనుగ్రహం కలిగిన తేదీలు కొన్ని ఉన్నాయి.

కుబేరుడి కరుణ దక్కే తేదీలు
న్యూమరాలజీని నమ్మే వారి సంఖ్య ఇప్పుడు అధికంగానే ఉంది. ఈ సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి అతని జీవితం, భవిష్యత్తు, ఇష్టాయిష్టాలు, స్వభావాలు, వ్యక్తిత్వాలు అంచనా వేయవచ్చు. అలాగే ఆ వ్యక్తి పుట్టిన తేదీని బట్టి అతనిపై ఏ దేవత అనుగ్రహం ఉంటుందో కూడా చెప్పవచ్చు. అలా ఇక్కడ మేము కుబేరుడి అనుగ్రహాన్ని పొందే తేదీల గురించి చెప్పాము. ఈ తేదీల్లో పుట్టిన వారు కుబేరుడి కరుణను, అనుగ్రహాన్ని కలిగి ఉంటారు. వీరికి జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక సమస్యలు రావు. ఉద్యోగంలో, వ్యాపారంలో విజయాన్ని అందుకుంటారు.
ఈ తేదీలలో పుట్టిన వారు
సంఖ్యా శాస్త్రం చెబుతున్న ప్రకారం ప్రతి నెలలో కూడా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 7 అవుతుంది. అంటే వీర మూల సంఖ్య 7. ఈ మూల సంఖ్య కలిగిన వారు ఎంతో అదృష్టవంతులు. ఏడు సంఖ్యకు అధిపతి కేతువు. కేతువు ఆధ్యాత్మికతకి, పదునైన ఆలోచనలకు, జ్ఞానానికి కారకుడిగా చెప్పుకుంటారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి కేతువు అనుగ్రహం ఉంటుంది. కాబట్టి అతని వల్ల వీరికి ఎలాంటి కీడు ఉండదు. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. అదృష్టం అన్నివేళలా కలిసి వస్తూ ఉంటుంది. వీరి జీవితంలో విలాసం అధికంగా ఉంటుంది.
కుబేరుడి వల్ల డబ్బు
మూల సంఖ్య 7 కలిగిన వారిపై కుబేరుడి అనుగ్రహం ఎక్కువ. అందుకే వీరికి జీవితంలో డబ్బు, విలాసాలు, ఆనందం నిండి ఉంటాయి. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా ఉన్నత స్థాయికి ఎదగగలరు. ఏ విషయాన్ని అయినా సరిగ్గా అంచనా వేసి విజయవంతం అవుతారు. ముందుచూపు కూడా ఎక్కువే. వీరంటే కుబేరుడికి ఎంతో ఇష్టం. అందుకే వీరికి ఏనాడు డబ్బు కష్టాలు రాకుండా చూసుకుంటాడు. మీరు కూడా ఈ ఏడు మూల సంఖ్యను కలిగి ఉంటే అదృష్టవంతులనే చెప్పుకోవాలి.
వీరి గుణం ఇలా
ఏడు మూల సంఖ్య కలిగిన వారు అదృష్టవంతులు. ధనానికి లోటుండదు. కానీ వీరు అంత సులువుగా ఎవ్వరికీ అర్థం కారు. వీరితో స్నేహం చేయడం కూడా కష్టం. వీరు మనసులోని భావాలు బయటికి చెప్పరు. అన్నీ రహస్యంగా దాస్తారు. దీనికి కేతువు ప్రభావమే కారణం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ తేదీలలో పుట్టిన వారికి మరొక మంచి లక్షణం కూడా ఉంది. వీరు ఎప్పుడైనా కష్టపడి పని చేసేందుకు ఇష్టపడతారు. ఏదీ కూడా అడ్డదారుల్లో పొందేందుకు ప్రయత్నించరు. వీరు కొంచెం ప్రయత్నిస్తే చాలు సులువుగా విజయాన్ని అందుకొని ముందుకెళ్తారు. హనుమంతుడి శక్తి.. హనుమంతుడికే తెలియదన్నట్టు వీరి శక్తి వీరికే తెలియదు. ప్రయత్నించారంటే కచ్చితంగా సక్సెస్ అందుకుంటారు.

