Rahu Transit:18 ఏళ్ల తర్వాత రాహు సంచారంతో ఈ మూడు రాశులకు ... స్వర్ణయుగం
Rahu Transit: వేద జోతిష్యం ప్రకారం, 18 సంవత్సరాల తర్వాత రాహువు తన మార్గాన్ని మార్చుకుంటుంది. కొత్త సంవత్సరంలో రాహువు తన సొంత నక్షత్రమైన శతభిష లోకి అడుగుపెడుతున్నాడు. దీని కారణంగా 3 రాశులవారు అపారమైన విజయాన్ని పొందనున్నారు.

Rahu Transit
జోతిష్యశాస్త్రంలో రాహువను అస్పష్టమైన, రహస్యమైన గ్రహంగా పరిగణిస్తారు. ఈ రాహు గ్రహం క్రమం తప్పకుండా రాశులు, నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాడు. ఈ మార్పు అన్ని గ్రహాలపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే.. ఈ కొత్త సంవత్సరంలో రాహువు.. తన సొంత నక్షత్రమైన శతభిష లో అడుగుపెట్టనున్నాడు. ఆగస్టు 2 వరకు అక్కడే ఉంటాడు. ఈ శతభిష రాహువు సొంత నక్షత్రం కాబట్టి.. ఈ రాహు సంచారం చాలా శక్తిమంతంగా మారనుంది. ముఖ్యంగా కొన్ని రాశుల జీవితాలు ఆకస్మికంగా మారనున్నాయి. ఆర్థికంగా విపరీతంగా కలిసొచ్చే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారమే కానుంది. ఆ రాశులేంటో చూద్దాం..
మీన రాశి...
రాహు సంచారం మీన రాశివారికి చాలా ప్రయోజనాలు చేకూర్చనుంది రాహువు ఈ రాశి పన్నెండో ఇంట్లో, శని లగ్నంలో ఉన్నారు. దీని కారణంగా.. ఈ రాశివారు గణమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తూ ఉంటే.. ఈ సమయంలో వీరికి అలాంటి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది.
ఈ సమయంలో మీరు ఆకస్మిక ఆర్థిక లాభాలు లేదా ఒక పెద్ద మార్పును అనుభవించవచ్చు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ సంచార సమయంలో అత్తమామలతో మంచి సంబంధాలను కొనసాగించడం చాలా ముఖ్యం.
మీరు మీ ఉద్యోగం, వ్యాపారం లేదా ఫ్రీలాన్స్ పనిలో విజయం సాధించవచ్చు. కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి కొత్త ఉద్యోగాల కోసం అనేక అవకాశాలు లభించవచ్చు. పదోన్నతులతో పాటు, బదిలీలకు కూడా అవకాశాలు ఉండవచ్చు. కొంత మానసిక ఒత్తిడి ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, మీ జీవితంలో యోగా, ధ్యానాన్ని చేర్చుకోండి. మీరు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపవచ్చు. రాహువు శుభ ప్రభావం కోసం 'ఓం రాం రహవే నమః' అనే మంత్రాన్ని జపించండి. ఇది కాకుండా, నిస్సహాయులకు, ఆసుపత్రులకు లేదా వృద్ధాశ్రమాలకు సేవ చేయండి. సహాయం చేయండి.
మకర రాశి...
రాహువు ధన స్థానంలో ఉన్నందున, మకర రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు కలగవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావచ్చు. పోగొట్టుకున్న డబ్బు తిరిగి లభించవచ్చు. అంతేకాకుండా, ఈ రాశి వారికి ఉద్యోగాలలో కూడా లాభాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారం గణనీయమైన లాభాలను అందించవచ్చు. కెరీర్‌లో గణనీయమైన లాభాలు సాధ్యమవుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఉన్నత విద్యలో గణనీయమైన విజయాలు సాధించవచ్చు. విదేశాలలో చదువుకోవాలనే కల నెరవేరవచ్చు. ఏడవ ఇంట్లో బృహస్పతి స్థానం వివాహానికి దారితీయవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. అంతేకాకుండా, భాగస్వామ్యంతో చేపట్టిన వ్యాపారం విజయవంతం కావచ్చు. అయితే, మీ మాటలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా వివాదాలకు దారితీయవచ్చు.
తుల రాశి..
రాహువు శతభిష నక్షత్రంలోకి సంచారం తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. ముఖ్యంగా కళ, మీడియా, సాహిత్యం, విద్య, ఐటీ, ఏఐ వంటి సాంకేతిక రంగాలలో ఉన్నవారు అసాధారణ విజయాన్ని పొందుతారు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఆదాయం రెట్టింపు అవతుంది. ఈ సమయంలో ఏ వ్యాపారం చేసినా మంచి లాభాలు పొందుతారు. అయితే, రిస్క్ లేని పనులు ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

