భావోద్వేగాలను కంట్రోల్ లో పెట్టుకోలేకపోతున్నారా? అయితే మీది ఈ రాశే కావచ్చు...
కొంతమంది చాలా సౌమ్యంగా ఉంటారు. ప్రతీ చిన్న విషయానికి భావోద్వేగానికి గురవుతారు. ఎదుటివారి నుంచి అలాంటి మద్ధతు కోసం ఆశిస్తారు. వీరివల్ల కొన్నిసార్లు చాలా చిరాకు కూడా కలుగుతుంది. అయితే ఇదంతా రాశిచక్రం ప్రకారమే ఉంటుందట.. అలా బలహీనమైన రాశిచక్రాలేవే చూడండి..
- FB
- TW
- Linkdin
Follow Us

Aries Zodiac
మేషం : ఒక్కోసారి ఎమోషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో వీరికి తెలియదు. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. అప్పటికప్పుడు రియాక్ట్ అవుతుంటారు. దీనివల్ల క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో, ఆయా సమయాల్లో ఎలా వ్యవహరించాలో వీరికి తెలియదు. వీరు తీసుకునే నిర్ణయాలు, వీరిని చాలా బలహీనులుగా నిరూపిస్తాయి.
Cancer Zodiac
కర్కాటకం : ప్రేమ, అలాంటి ఇతర బలమైన భావోద్వేగాల విషయానికి వస్తే వీరు చాలా సున్నితంగా, సౌమ్యంగా ఉంటారు. వారు ఇష్టపడే వారితో తమ భావాలను వ్యక్తపరిచేటప్పుడు కాస్త అటాకింగ్ మోడ్ లో ఉంటారు. కర్కాటక రాశివారు తమతో కాస్త కఠినంగా మాట్లాడితే చాలు బ్రేకప్ చేసుకుంటారు.
Virgo Zodiac
కన్య : బలహీనులుగా ఉండటానికి చాలా తక్కువ అవకాశం ఉన్న రాశివారిలా కనిపిస్తారు.. కానీ వాస్తవానికి వీరు చాలా ఎమోషనల్ గా బలహీనులు. అది బైటికి కనిపించనివ్వరంతే. తమ కోసం తాము విజయవంతమైన జీవితాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా తమ గురించి అసహ్యకరంగా మాట్లాడితే చాలా బాధపడతారు. కానీ బైటికి తెలీకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు.
Scorpio Zodiac
వృశ్చిక రాశి : తమ మాటలు విని ఇతరులు చేసే తీర్పుకు భయపడి, తమ భావోద్వేగాలను బహిరంగంగా బయట పెట్టడానికి చాలా భయపడతారు. వృశ్చిక రాశి వారు తమని తాము చాలా బలవంతులుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. కానీ రహస్యంగా, వారు తీవ్రమైన భావోద్వేగాలను ఎదుర్కొనేందుకు చాలా భయపడతారు.
Pisces Zodiac
మీనరాశి : మిగతా అన్ని రాశులకంటే బలహీనంగా ఉండే రాశిగా పరిగణించబడుతుంది. వారి భావోద్వేగాలను అంగీకరించే విషయంలో వారు చాలా దురుసుగానే ఉంటారు. వారు తమ భావోద్వేగాలు, దుర్బలత్వాలను మచ్చిక చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కానీ అది వారికి చాలా సవాలుగా ఉంటుంది.
ఇక వృషభం, మిథునం, సింహం, తులారాశి, ధనుస్సు, మకరం, కుంభరాశులు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. బయటి వ్యక్తులకు తమ సున్నితమైన, దృఢమైన భావోద్వేగాలను చెప్పకుండా సందర్భాన్ని బట్టి కు ఎలా స్పందించాలో వారికి తెలుసు.