MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ రాశులవారి నోట్లో నువ్వు గింజ కూడా నానదు.. ఒక్క సీక్రెట్ కూడా దాచుకోలేరు..!

ఈ రాశులవారి నోట్లో నువ్వు గింజ కూడా నానదు.. ఒక్క సీక్రెట్ కూడా దాచుకోలేరు..!

కొన్ని రాశులవారి దగ్గర ఎలాంటి సీక్రెట్స్ కూడా దాగవు. వీరికి ఎవరైనా సీక్రెట్స్ చెబితే.. వెంటనే అందరికీ చెప్పేస్తారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 21 2025, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
zodiac signs
Image Credit : AI Generated

zodiac signs

మన చుట్టూ ఉండే చాలా రకాల మనుషులు ఉంటారు. కొందరు మనతో చాలా నమ్మకంగా ఉంటారు. కానీ కొందరిని మాత్రం పూర్తిగా నమ్మలేం. ఎందుకంటే, ఇతరుల నుంచి రహస్యాలు కూడా దాచలేరు.జోతిష్యశాస్త్రంలో కూడా అలాంటి రాశులవారు ఉన్నారు. ముఖ్యంగా కొన్ని రాశులవారి దగ్గర ఎలాంటి సీక్రెట్స్ కూడా దాగవు. వీరికి ఎవరైనా సీక్రెట్స్ చెబితే.. వెంటనే అందరికీ చెప్పేస్తారు. మరి, ఆ రాశులేంటో చూద్దామా....

26
1.మిథున రాశి...
Image Credit : Asianet News

1.మిథున రాశి...

మిథున రాశివారు చాలా సహజంగా ఉంటారు.వీరు ఎవరితోనైనా వీరు మాట్లాడగలరు. కొత్త, పాత అనే భావన వీరిలో ఉండదు. తెలియని వాళ్లతో కూడా మాట్లాడే శక్తి వీరిలో ఉంటుంది. చిన్న పిల్లలకు చాక్లెట్స్ కి ఎలా ఆకర్షితులు అవుతారో.. ఈ మిథున రాశివారు.. సీక్రెట్స్ కి అలా ఆకర్షితులు అవుతారు. వీరికి ఒక రహస్యం తెలిసింది అంటే చాలు అందరికీ చెప్పేదాక నిద్రపోరు. మిథున రాశిపాలక గ్రహం బుధుడు కాబట్టి.. వారు ప్రతి విషయాన్ని ఇతరులకు చెప్పేసే లక్షణం కలిగి ఉంటారు. వీరు ఉద్దేశపూర్వకంగా ఇతరుల సీక్రెట్స్ ని బయటపెట్టరు. కానీ.. వీరికి తెలిసిన విషయాన్ని మనసులో దాచుకోలేరు.

Related Articles

Related image1
Zodiac signs: ఇతరులను బాధపెట్టి సంతోషించడంలో ఈ రాశులవారు ముందుంటారు..!
Related image2
Zodiac signs: ఈ రాశులవారు నిజాయితీకి మారుపేరు, ఒక్క అబద్ధం కూడా చెప్పరు
36
2.ధనస్సు రాశి...
Image Credit : our own

2.ధనస్సు రాశి...

ధనస్సు రాశివారు కూడా అంతే.. ఏదైనా విషయం తెలిస్తే.. దానిని ఇతరులతో చెప్పకుండా ఉండలేరు. ఈ రాశివారు నిజాయితీ, సత్యాన్ని చెప్పడానికి ఇష్టపడతారు. ఇతరులను సంతోషపెట్టాలని కోరుకుంటారు. కానీ, ఒకరి సీక్రెట్ ని మరొకరు దగ్గర చెప్పేస్తూ ఉంటారు. ఎవరికీ చెప్పకూడదు అనే అనుకుంటారు కానీ.. అది వారి బలహీనత. ఈ విషయంలో వారిని వారే కంట్రోల్ చేసుకోలేరు.

46
 3.మేష రాశి..
Image Credit : Asianet News

3.మేష రాశి..

మేష రాశివారు చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరు సహజంగానే శక్తివంతులు. కానీ.. వీరికి ఓపిక చాలా తక్కువ. ఎవరైనా ఏదైనా విషయం వీరితో పంచుకుంటే.. దానిని ఇతరులకు చెప్పేదాక మేష రాశివారికి నిద్రపట్టదు. ఏదైనా విషయాన్ని సీక్రెట్ గా ఉంచడం అనేది వీరికి పెద్ద సవాలుతో కూడిన విషయం. ఎంత కంట్రోల్ లో ఉండాలన్నా.. వీరు ఉండలేరు.

56
4.కుంభ రాశి..
Image Credit : Asianet News

4.కుంభ రాశి..

కుంభ రాశి వారు వినూత్న ఆలోచనలను , ప్రత్యేకమైన విధానాలను ఇష్టపడతారు. వీరి దగ్గర కూడా ఎలాంటి సీక్రెట్స్ ఉండవు. ఇతరుల విషయాలను మరొకరికి చెప్పడం మాత్రమే కాదు.. తమకు సంబంధించిన విషయాలను కూడా ఇతరులతో చెప్పుకునేదాకా వీరికి నిద్ర పట్టదు. ఏదో ఒక సందర్భంలో ఈ విషయాలను బయటపెట్టేస్తారు. ప్రతిదీ ఇతరులతో పంచుకునే అలవాటు వీరిలో ఉంటుంది. ఇది ఈ రాశివారి సహజ స్వభావం.

66
 5.తుల రాశి..
Image Credit : Asianet News

5.తుల రాశి..

తులారాశి ని శుక్ర గ్రహం పాలిస్తూ ఉంటుంది. వారు ఇతరులను సంతోషంగా ఉంచడానికి ఇష్టపడతారు. తులారాశి వారు ఇతరులతో ఏదైనా విషయాన్ని చర్చించడానికి కూడా ఇష్టపడతారు. దీని వలన వారు అనుకోకుండా రహస్యాలను బహిర్గతం చేసే అవకాశం ఉంది. కావాలని చెప్పరు కానీ... తొందరలో సీక్రెట్స్ అన్నీ బయటపెట్టేస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saturn Venus Conjunction: 30 ఏళ్ల తర్వాత అద్భుతం.. శని, శుక్రుల దయతో ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు!
Recommended image2
Ugadi 2026: ఉగాది తర్వాత ఈ రాశుల తలరాత మారిపోతుంది, పట్టిందల్లా బంగారమే..!
Recommended image3
Numerology: ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు కోడ‌లిగా వ‌స్తే.. ఆ ఇంటి అదృష్టం మారిన‌ట్లే
Related Stories
Recommended image1
Zodiac signs: ఇతరులను బాధపెట్టి సంతోషించడంలో ఈ రాశులవారు ముందుంటారు..!
Recommended image2
Zodiac signs: ఈ రాశులవారు నిజాయితీకి మారుపేరు, ఒక్క అబద్ధం కూడా చెప్పరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved