Ugadi 2026: ఉగాది తర్వాత ఈ రాశుల తలరాత మారిపోతుంది, పట్టిందల్లా బంగారమే..!
Ugadi 2026: ఈ ఏడాది మార్చి 19న ‘ పరాభవ’ నామ సంవత్సర ఉగాది ప్రారంభం కానుంది.ఉగాది తర్వాత గ్రహాల్లో చాలా మార్పులు జరగనున్నాయి. ఈ కింది రాశుల అదృష్టం రెట్టింపు కానుంది. ఆ రాశులేంటో చూద్దాం

మేష రాశి...
పరాభవ నామ సంవత్సర ఉగాది తర్వాత నుంచి మేష రాశివారికి స్వర్ణ యుగం ప్రారంభం కానుంది. గురు గ్రహం ఈ రాశివారికి అనుకూల స్థితిలో ఉంటుంది. దీని వల్ల.. ఈ రాశి వారికి ఆగిపోయిన పనులు చాలా వేగవంతంగా అవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంది. కోరుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఈ సమయం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి..
ఉగాది తర్వాత మిథున రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ ఉగాది తర్వాత.. మిథున రాశి వారికి శని ప్రభావం నుండి విముక్తి లభిస్తుంది. దీంతో.. కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ రాశివారు ఊహించని లాభాలు అందుకుంటారు. కెరీర్ లో ఊహించని మార్పులు వస్తాయి. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి ప్రయత్నాలు ఫలమిస్తాయి. కుటుంబ జీవితం కూడా ఆనందంగా మారుతుంది. గతంలో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
సింహ రాశి..
పరాభవ నామ సంవత్సర ఉగాది తర్వాత సింహ రాశివారికి రాజయోగం పట్టనుంది. ఉగాది తర్వాత ఈ రాశివారు ఏ పని చేసినా విజయం మీ సొంతమౌతుంది. అంతేకాదు.. ఈ సమయంలో ఈ రాశివారికి ఉద్యోగస్థులకు పదోన్నతి లభిస్తుంది. ప్రభుత్వ పరమైన పనులు సులభంగా పూర్తి అవుతాయి. ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. భూమి లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
తుల రాశి...
ఉగాది తర్వాత.. తుల రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. మరీ ముఖ్యంగా వ్యాపారస్తులకు అపారమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తారు. సంతాన భాగ్యం కోసం ఎదురు చూసేవారు శుభవార్తలు వింటారు. ఈ సమయంలో ఈ రాశివారు లాటరీ లేదా వారసత్వ ఆస్తి రూపంలో ధనం ఎక్కువగా పొందే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి...
ఉగాది తర్వాత ధనుస్సు రాశివారి జీవితం ఆనందంగా మారుతుంది. గురుడి అనుగ్రహం వల్ల ఈ రాశివారి అదృష్టం రెట్టింపు అవుతుంది. ఏ పని చేసినా అదృష్టం కలిసొస్తుంది. విద్యార్థులు చదువులో మంచి మార్కులు సాధిస్తారు. ఊహించని శుభవార్తలు వింటారు. అనుకోని మార్గాల్లో ధనలాభం పొందే అవకాశం ఉంది.

