Zodiac signs: ఇతరులను బాధపెట్టి సంతోషించడంలో ఈ రాశులవారు ముందుంటారు..!
ఇతరులను బాధపెట్టడంలో కొందరు ఎప్పుడూ ముందుంటారు. సంతోషంగా ఉన్నవారిని ఏడిపించి.. అందులో తమ సంతోషాన్ని వెతుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. జోతిష్య శాస్త్రంలో కూడా అలాంటి రాశులు కొన్ని ఉన్నాయి. మరి, ఆ రాశులేంటో చూద్దామా....

Zodiac signs
శరీరానికి అయ్యే గాయాలు కొంతకాలానికి నయం అవుతాయి. కానీ, మనసుకు తగిలిన గాయం తగ్గడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కొందరికి అయితే.. ఆ మనసుకు తగిలిన గాయం జీవితాంతం గుర్తుంటుంది. కానీ.. కొందరు ఉంటారు ఇతరుల గురించి ఏ మాత్రం పట్టించుకోరు. తమ మాటలు, చేష్టలతో అందరినీ బాధపెడుతూ ఉంటారు. తమ మాటలకు ఇతరులు బాధపడుతుంటే.. చూసి ఎక్కువగా ఆనందిస్తారు. జోతిష్య శాస్త్రంలో కూడా అలాంటి రాశులు కొన్ని ఉన్నాయి. వారు తమ మాటలు, ప్రవర్తనతో అందరినీ బాధపెడుతూ ఉంటారు. ఆ రాశుల జాబితా ఇక్కడ ఉంది.
1.మేష రాశి...
మేష రాశివారిని అంగారక గ్రహం పాలిస్తూ ఉంటుంది. మేష రాశివారు తమ జీవితంలో అనుభవించిన కష్టాలను ఇతరులు కూడా అనుభవించాలని కోరుకుంటారు. అందుకే.. ఎవరైనా ప్రశాంతంగా, సంతోషంగా కనపడితే చూసి తట్టుకోలేరు. మాటలో, చేతలతో వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంతేకాదు.. ఈ రాశివారు తమ కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. ఆ కోపంతో ఏవేవో పనులు చేసేస్తూ ఉంటారు. వీరు ఒక్కసారి వీరు ఎవరినైనా బాధపెట్టాలి అని ఫిక్స్ అయితే.. ఆ పని చేసే వరకు వదిలిపెట్టరు. గుండె పగిలే వరకు వారు ఇబ్బంది పెడతారు.
2.వృషభ రాశి...
వృషభ రాశి వారిని శుక్ర గ్రహం పాలిస్తూ ఉంటుంది. ఈ రాశివారు సహజంగా చాలా మొండిగా ఉంటారు. వీరు ఎవరినైనా ఆటపట్టించాలన్నా, బాధపెట్టాలి నిర్ణయించుకోవాలని అనుకుంటే కచ్చితంగా చేసి తీరతారు. కొంచెం కూడా జాలి చూపించరు. వీరు ఇతరులను బాధ పెట్టే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గరు. కచ్చితంగా ఏడిపించే వరకు వదలరు.
3.మిథున రాశి..
మిథున రాశిని బుధ గ్రహం పాలిస్తూ ఉంటుంది. వీరికి రెండు రకాల భిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది. వీరి మనసు అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ఒకసారి స్నేహపూర్వకంగా ఉంటారు. మరోసారి.. ఇతరులను భయపెట్టేలా వీరి వ్యక్తిత్వం ఉంటుంది. వీరికి ఇతరులను ఏడిపించాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్లే ఏడిపిస్తారు.. తర్వాత వాళ్లే ఓదారుస్తారు. చాలా వింతగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు.
4.ధనస్సు రాశి..
ధనస్సు రాశివారు ఇతరులను హేళన చేయడంలోనూ, ఎగతాళి చేయడంలో ముందుంటారు. వీరికి ప్రతిదీ సరదాగా తీసుకునే అలవాటు ఉంటుంది. ఇతరుల భావాలను కొంచెం కూడా అర్థం చేసుకోరు. గౌరవించరు కూడా. తమ మాటలతో, చేష్టలతో ఇతరులను బాధపెట్టి.. చివరికి వీరు సంతోషిస్తారు. శారీరకంగా హాని చేయాలని అనుకోరు కానీ.. మానసికంగా మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటారు.
5.కుంభ రాశి..
వారి ఆనందం విషయానికి వస్తే, కుంభ రాశి వారు దేని గురించి ఆలోచించరు. ఇతరులు ఏమనుకుంటున్నారో వారు పట్టించుకోరు. వారు ఎవరితోనైనా చాలా క్రూరంగా ప్రవర్తించగలరు.ఎల్లప్పుడూ ఎవరినైనా బాధపెట్టడానికి కారణాల కోసం వెతుకుతారు. కుంభ రాశి వారు ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధపెట్టాలని కోరుకోరు. కానీ, తమకు తెలీకుండానే ఆ పనులు చేసేస్తూ ఉంటారు. ఇతరులను కూడా తామే కంట్రోల్ చేయాలి అని అనుకుంటారు.