MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • Wheebox Report 2025 : మహిళలు ఉద్యోగం చేయడానికి ఇష్టపడే 10 రాష్ట్రాలివే.. దేశంలోనే ఏపీ టాప్

Wheebox Report 2025 : మహిళలు ఉద్యోగం చేయడానికి ఇష్టపడే 10 రాష్ట్రాలివే.. దేశంలోనే ఏపీ టాప్

Wheebox Report 2025 : మహిళా సాధికరతకు ఆంధ్ర ప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ రాష్ట్రంలో మహిళా ఉద్యోగుల పరిస్థితి అద్భుతమని ప్రముఖ సంస్థ వీల్ బాక్స్ నివేదిక వెల్లడించింది.  

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 13 2025, 06:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వీబాక్స్ నివేదిక 2025
Image Credit : Getty

వీబాక్స్ నివేదిక 2025

Wheebox Report 2025 : రాజకీయ, వ్యాపార, సినీ రంగాల్లో మహిళలు భాగస్వామ్యం పెరుగుతోంది... కొన్ని రంగాల్లో అయితే మహిళలు మగవారిని ఏనాడో దాటిపోయారు... మరికొన్ని రంగాల్లో గట్టి పోటీ ఇస్తున్నారు. ఇలా ఉద్యోగాలు చేసి తమ కాళ్లపై తాము నిలబడి ఆత్మాభిమానంతో బ్రతకాలనుకునే మహిళ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అందుకే ఇంటివద్దే ఉండే సాధారణ గృహిణుల సంఖ్యతగ్గి మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ వీబాక్స్ (Wheebox) వెల్లడించింది.

గ్లోబల్ కంపెనీ వీబాక్స్ విడుదల చేసిన ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 భారతదేశంలో మహిళల ఉద్యోగ సామర్థ్యం, పని వాతావరణంపై వచ్చిన మార్పులను వివరిస్తోంది. ఈ నివేదిక ప్రకారం దేశంలో ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న మహిళల శాతం 47.53%గా ఉంది. గత ఏడేళ్లలో మహిళల ఉద్యోగ సామర్థ్యం హెచ్చుతగ్గులకు లోనైన ప్రస్తుతం సానుకూల ధోరణి కనిపిస్తోందని ఈ నివేదిక తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహిళా ఉద్యోగులకు ఉత్తమ రాష్ట్రం ఏపీ
Image Credit : Getty

మహిళా ఉద్యోగులకు ఉత్తమ రాష్ట్రం ఏపీ

వృత్తిపరంగా పని చేయడానికి ఇష్టపడే ప్రదేశాల విషయంలో మహిళలకు స్పష్టమైన ప్రాధాన్యతలు ఉన్నాయని వీబాక్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 చెబుతోంది. సురక్షితమైన వాతావరణం, మంచి మౌలిక సదుపాయాలు, కెరీర్ వృద్ధికి అవకాశాలు వంటి ప్రాధాన్యతలను మహిళా ఉద్యోగులు కలిగివుంటున్నారని ఈ నివేదిక చెబుతోంది. దీని ప్రకారం మహిళా నిపుణులు ఎక్కువగా ఆసక్తి చూపే మొదటి పది రాష్ట్రాల జాబితాను వీబాక్స్ ప్రకటించింది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో ఉంది.

35
వీబాక్స్ నివేదిక ప్రకారం మహిళలు పనిచేయడానికి ఇష్టపడే టాప్ 10 రాష్ట్రాలు
Image Credit : Getty

వీబాక్స్ నివేదిక ప్రకారం మహిళలు పనిచేయడానికి ఇష్టపడే టాప్ 10 రాష్ట్రాలు

1. ఆంధ్రప్రదేశ్

2. కేరళ

3. గుజరాత్

4. తమిళనాడు

5. మహారాష్ట్ర

6. ఢిల్లీ

7. ఉత్తర ప్రదేశ్

8. కర్ణాటక

9. మధ్య ప్రదేశ్

10. హర్యానా

45
మహిళలకు మంచి సదుపాయాలు కల్పించే రాష్ట్రాలే టాప్
Image Credit : gemini ai

మహిళలకు మంచి సదుపాయాలు కల్పించే రాష్ట్రాలే టాప్

మహిళలను ఎక్కువగా ఆకర్షించే రాష్ట్రాలు సాధారణంగా మెరుగైన భద్రత, మౌలిక సదుపాయాలు, కెరీర్ పురోగతికి అవకాశాలను అందిస్తున్నాయి… లింగ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యాపార సంస్థలకు ఈ సమాచారం చాలా ముఖ్యం. నియామక పద్ధతులను మెరుగుపరచడానికి, మహిళలకు మద్దతు ఇచ్చే, సాధికారత కల్పించే పని వాతావరణ విధానాలను రూపొందించడానికి వీబాక్స్ నివేదిక మార్గనిర్దేశం చేస్తుంది. దీని ద్వారా కంపెనీలు అందరినీ కలుపుకొనిపోయే, స్వాగతించే కార్యస్థలాన్ని సృష్టించగలవు.

55
మహిళల కేరీర్ ప్లానింగ్
Image Credit : AI meta

మహిళల కేరీర్ ప్లానింగ్

వీబాక్స్ నివేదిక కేవలం మహిళల ఉద్యోగ సామర్థ్యం గురించి తెలియజేయడమేకాదు... ఇది విద్య, అవకాశాలు, సహాయక పని వాతావరణం లభ్యతను ప్రతిబింబిస్తుంది. తమ కెరీర్‌ను ప్లాన్ చేసుకునే మహిళలకు, ఏ ప్రాంతాలు కెరీర్ వృద్ధికి అత్యంత అనుకూలమైనవో తెలుసుకోవడం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అవసరం. సురక్షితమైన, మంచి పని వాతావరణాన్ని అందించే ప్రాంతాలు, మహిళా ఉద్యోగుల భాగస్వామ్య రేటులో అధిక వృద్ధిని చూస్తాయని ఈ వీబాక్స్ నివేదిక నొక్కి చెబుతోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ
ఏషియానెట్ న్యూస్
మహిళలు
విద్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan : వైసిపి బిగ్ షాకిచ్చి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ వరుపుల సుబ్బారావు?
Recommended image2
Now Playing
పవన్ రాకతో ఉప్పొంగిన పిఠాపురం | Deputy CM Pawan Kalyan Craze In Pithapuram | Asianet News Telugu
Recommended image3
Biochar : ఎల్ నినో కు చెక్ పెట్టేందుకు చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఏమిటీ 'బయోచార్'?
Related Stories
Recommended image1
Women Business: మహిళలూ.. ఇంట్లోనే ఈ అద్భుతమైన వ్యాపారాలు ప్రారంభించండి, ప్రతినెలా ఆదాయం వచ్చే ఛాన్స్
Recommended image2
Women Leave: మ‌హిళ‌ల‌కు 12 రోజులు జీతంతో కూడిన సెల‌వులు.. రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved