- Home
- Business
- Women Business: మహిళలూ.. ఇంట్లోనే ఈ అద్భుతమైన వ్యాపారాలు ప్రారంభించండి, ప్రతినెలా ఆదాయం వచ్చే ఛాన్స్
Women Business: మహిళలూ.. ఇంట్లోనే ఈ అద్భుతమైన వ్యాపారాలు ప్రారంభించండి, ప్రతినెలా ఆదాయం వచ్చే ఛాన్స్
మహిళలు మగవారితో కలిసి పని చేసి డబ్బు సంపాదించేందుకే ఇష్టపడుతున్నారు. ఖాళీగా ఉండేందుకు సిద్ధంగా లేరు. ఇంట్లోనే ఉండే మహిళల కోసం ఇక్కడ మేము అద్భుతమైన వ్యాపార ఐడియాలు ఇచ్చాము. మీకు నచ్చిన దాన్ని ఫాలో అవ్వచ్చు.

ఇద్దరూ సంపాదిస్తేనే...
పెరుగుతున్న ఖర్చులు కారణంగా భార్యాభర్తా ఇద్దరు కష్టపడితే కానీ జీవితం ముందుకు సాగలేని పరిస్థితి. ధనవంతులు, పెద్దపెద్ద ప్రభుత్వ ఉద్యోగాలు, పెద్ద జీతాలు సంపాదించేవారికి ఎలాంటి సమస్య ఉండదు.. కానీ పేద మధ్యతరగతి వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. అలాంటి కుటుంబాలకు చెందిన మహిళలకు ఇంటి నుంచే వ్యాపారం చేసే అవకాశం ఉంది. ఇక్కడ మేము కొన్ని వ్యాపారాలు చల్లడం అందించాము.
కస్టమైజ్డ్ కేకులు
వ్యాపారం అనగానే ఎంతోమంది భయపడిపోతారు. నిజానికి తక్కువ బడ్జెట్లోనే ఇంట్లోనే ప్రారంభించే వ్యాపారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంట్లోనే కేకులు తయారుచేసి అమ్మడం. ప్రతి వేడుకలను కేకులు కట్ చేస్తున్నారు. కాబట్టి కస్టమైజ్డ్ కేకులను తయారు చేసి అమ్మేందుకు ప్రయత్నించండి. వీటిని మీరు కేక్ షాపులకు అమ్మవచ్చు. లేదా మీ చుట్టుపక్కల వారికి హోమ్ డెలివరీ చేయవచ్చు. కష్టమైస్డ్ కేక్ వ్యాపారం భారతదేశంలో ఇప్పుడు అధికంగా సాగుతోంది.
బొటిక్ పెట్టుకోవచ్చు
మహిళలు ఎక్కువగా కొనడానికి ఇష్టపడేది దుస్తులనే. కాబట్టి మీరు ఇంటి దగ్గరే బోటిక్ షాపు తెరవండి. ఇంటి నుంచే చీరలు, దుస్తులు అమ్మేందుకు ప్రయత్నించండి. కచ్చితంగా ఒకసారి మీ దగ్గర కొన్న చీర నచ్చితే మళ్ళీ మళ్ళీ కస్టమర్లు వస్తూనే ఉంటారు. అలాగే కస్టమైజ్డ్ చీరలు అందించేందుకు ప్రయత్నించండి. వారికి నచ్చిన విధంగా ఎంబ్రాయిడరీలు చేసేందుకు కూడా ప్రయత్నించండి.. అలా కస్టమర్లను పెంచుకుంటే మంచిది.
ఆన్లైన్ ట్యూషన్లు
ఎంతోమంది చదువుకున్న అమ్మాయిలు ఖాళీగా ఉండిపోతున్నారు. అలాంటివారు ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఆన్లైన్ స్టడీ ప్లాట్ ఫామ్ లు ఎన్నో ఉన్నాయి. వీటిల్లో లాగిన్ అయ్యి మీ సమర్థతను నిరూపించుకుంటే మీకు వారు పనిని ఇస్తారు. ఇంట్లో కూర్చునే ఆన్లైన్లో మీకు నచ్చిన సబ్జెక్టులను బోధిస్తూ డబ్బు సంపాదించవచ్చు.
టిఫిన్ సర్వీస్
ఉదయాన్నే లేచి టిఫిన్లు చేసుకునే ఓపిక తగ్గిపోయింది. అందుకే ఎక్కువమంది ఆర్డర్లు పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. మీరు ఇంట్లోనే టిఫిన్ సర్వీస్ ప్రయత్నించవచ్చు. విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు అధికంగా ఉండే ప్రదేశాలలో టిఫిన్ సర్వీస్ ఎంతో ఉపయోగపడుతుంది. జొమాటో, స్విగ్గీ వంటి వాటిలో మీరు భాగస్వామి అయితే మీరు చేసిన టిఫిన్లు తీసుకునేందుకు డెలివరీ బాయ్స్ కూడా వస్తారు. మీకు ఎలాంటి సమస్య ఉండదు.