MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి, ఆవర్తనం.. ఏపీ, తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావంతో రాగల 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు విపత్తు నిర్వహణ శాఖతో పాటు ఐఎండీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 05 2026, 08:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ద్రోణి ఎఫెక్ట్.. .. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
Image Credit : Gemini

ద్రోణి ఎఫెక్ట్.. .. ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!

వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో చోటుచేసుకున్న అనూహ్య వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడ్రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయి.

తమిళనాడు, కేరళ మీదుగా అరేబియా సముద్రం వరకు విస్తరించిన ద్రోణికి తోడు, కర్ణాటక పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనంతో కలవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఐఎండీ తాజా సమాచారం ప్రకారం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా తీరానికి అలర్ట్.. రాయలసీమలోనూ కుండపోత
Image Credit : Gemini

ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా తీరానికి అలర్ట్.. రాయలసీమలోనూ కుండపోత

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా తీరప్రాంత జిల్లాల్లో వాతావరణం ముబ్బులు పట్టి కూల్ అయింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

మరోవైపు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.

35
తెలంగాణలో ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో గంటకు 40 కిమీ వేగంతో గాలులు
Image Credit : Gemini

తెలంగాణలో ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో గంటకు 40 కిమీ వేగంతో గాలులు

తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో రాబోయే 24 నుండి 48 గంటల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• నేటి వర్ష సూచన: ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వానలు పడే సూచనలు ఉన్నాయి.

• రేపటి వాతావరణం: వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు పడనున్నాయి. అక్టోబర్ 7వ తేదీ ఉదయం వరకు ఈ పరిస్థితులు కొనసాగి, ఆ తర్వాత పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

45
హైదరాబాద్ లో సాయంత్రానికి జల్లులు
Image Credit : Google AI

హైదరాబాద్ లో సాయంత్రానికి జల్లులు

హైదరాబాద్ లో ఉదయం నుంచి స్వల్పంగా ఎండ, ఉక్కపోత ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాతి నుంచి సీన్ పూర్తిగా మారిపోనుంది. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై సాయంత్రానికి లేదా రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే ఛాన్స్ ఉంది.

ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో అకస్మాత్తుగా వర్షం పడితే రోడ్లన్నీ జలమయమై తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు అయ్యే ముప్పు ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 31°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 22°C వరకు నమోదు కావచ్చు. కాబట్టి ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

55
విపత్తు నిర్వహణ శాఖ కీలక సూచనలు
Image Credit : Gemini

విపత్తు నిర్వహణ శాఖ కీలక సూచనలు

వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

1. వర్షం పడుతున్నప్పుడు పాత భవనాలు, చెట్ల కింద లేదా కరెంట్ స్తంభాలు, హోర్డింగ్‌ల వద్ద నిలబడకూడదు.

2. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు పిడుగులు పడే సమయంలో చెట్ల కింద కాకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.

3. కోత దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి రైతులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
2nd TEST • SA vs AUS
Live
SASA
(127.1 ov)425/9
AUSAUS
(61.1 ov) 99 & 177/4
Day 5 - Session 1
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Live
NZNZ
(20.0 ov)225/4
INDIND
(13.0 ov)146/4
IND 80 runs in 42 balls
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
AP Localbody Elections 2026 : అధికార టిడిపిని వీడి వైసిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ లక్ష్మీదేవి?
Recommended image2
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. అసలు ఏం జరిగింది?
Recommended image3
Holidays : వచ్చే సోమవారం కూడా సెలవే... ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Andhra's Goa: గోవా దాకా ఎందుకు? మన దగ్గరే 'ఆంధ్రా గోవా'.. ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image2
Maruti Suzuki offers: మారుతి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. ఏకంగా ₹1.36 లక్షల తగ్గింపు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved