MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • AP Localbody Elections 2026 : అధికార టిడిపిని వీడి వైసిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ లక్ష్మీదేవి?

AP Localbody Elections 2026 : అధికార టిడిపిని వీడి వైసిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే... ఎవరీ లక్ష్మీదేవి?

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా అధికార టిడిపిని వీడి వైసిపిలోకి జంప్ అయ్యారో మాజీ ఎమ్మెల్యే. ఎవరో తెలుసా?

3 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 22 2026, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టిడిపికి షాక్... వైసిపిలో జాయినింగ్స్
Image Credit : X/YSRCP

టిడిపికి షాక్... వైసిపిలో జాయినింగ్స్

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నామినేషన్లు కూడా ముగిశాయి... ఎంపిటిజి, జడ్పిటిసి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే పంచాయితీ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభంకానుంది. ఇలా రాష్ట్ర రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్న సమయంలో అధికార తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీ సినియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి టిడిపికి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎవరీ గుండ లక్ష్మీదేవి?
Image Credit : X/YSRCP

ఎవరీ గుండ లక్ష్మీదేవి?

గుండ లక్ష్మీదేవి శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఈమె 2014 నుండి 2019 వరకు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈమె గతంలో శ్రీకాకుళం మున్సిపాలిటీ కౌన్సిలర్, వైస్ ఛైర్ పర్సన్ గా కూడా పనిచేశారు. మొదటిసారిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మరణం తర్వాత లక్ష్మీదేవీ రాజకీయాల్లో మరింత యాక్టివ్ గా మారారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి తరపున మరోసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆమె మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెకు టిడిపి మళ్లీ అవకాశం ఇవ్వలేదు... 2024 ఎన్నికల్లో టికెట్ దక్కలేదు.

తాడేపల్లి

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ గారి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గారు, ముఖ్య అనుచరులు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ గారు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు, పలువురు పార్టీ నాయకులు.

— YSR Congress Party (@YSRCParty) October 22, 2026

34
మాజీ ఎమ్మెల్యే రాజీనామా వెనకున్న రీజన్ ఇదే..
Image Credit : X/ysrcp

మాజీ ఎమ్మెల్యే రాజీనామా వెనకున్న రీజన్ ఇదే..

మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి ఎమ్మెల్యేగా అవకాశం దక్కకున్నా మేయర్ గా అయినా అవకాశం వస్తుందని భావించారు. అయితే కూటమి పార్టీల మధ్య పొత్తులో భాగంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్ జనసేన పార్టీకి దక్కింది… టిడిపి పోటీనుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న లక్ష్మీదేవి మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ ల ఆహ్వానం మేరకు వైసిపి కండువా కప్పుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గుండ లక్ష్మీదేవి వైసిపిలో చేరారు. ఆమెతో పాటు మరికొందరు నాయకులు, కార్యకర్తలు కూడా వైసిపి కండువా కప్పుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. వైసిపి తరపున శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా ఈమె పోటీలో నిలిచే అవకాశాలున్నాయి.

44
వైసిపిలోకి చేరికలు..
Image Credit : X/YS Jaganmohan Reddy

వైసిపిలోకి చేరికలు..

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాఠంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేవి కూడా వైసిపిలో చేరారు. ముఖ్య అనుచరులతో కలిసి ఈ దంపతులు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ వారికి సాదరంగా ఆహ్వానించారు.

జగ్గంపేట నియోజకవర్గ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాఠంశెట్టి సూర్యచంద్ర మూడుసార్లు బూరుగుపూడి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా, 2024 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పాఠంశెట్టి దంపతులు ఎన్నికల వేళ వైసిపిలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది.

తాడేపల్లి

వైఎస్సార్‌సీపీలో చేరిన జగ్గంపేట నేత పాఠంశెట్టి సూర్యచంద్ర దంపతులు

శ్రీ వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన సూర్యచంద్ర, శ్రీదేవి, ముఖ్య అనుచరులు

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ సమక్షంలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన పాఠంశెట్టి సూర్యచంద్ర, ఆయన సతీమణి శ్రీదేవి, ముఖ్య అనుచరులు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

జగ్గంపేట నియోజకవర్గ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాఠంశెట్టి సూర్యచంద్ర మూడుసార్లు బూరుగుపూడి గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా, 2024 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తోట నరసింహంతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

— YSR Congress Party (@YSRCParty) October 22, 2026

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 
2nd TEST • SA vs AUS
Live
SASA
(127.1 ov)425/9
AUSAUS
(71.5 ov) 99 & 203/4
Day 5 - Session 1
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Live
NZNZ
(20.0 ov)225/4
INDIND
(19.3 ov)224/6
IND 2 runs in 3 balls
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. అసలు ఏం జరిగింది?
Recommended image2
Holidays : వచ్చే సోమవారం కూడా సెలవే... ఎందుకో తెలుసా?
Recommended image3
Weather Update: బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షాల అలర్ట్
Related Stories
Recommended image1
AP Localbody Elections 2026 : ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నామినేషన్లు షురూ... పూర్తి షెడ్యూల్ ఇదే
Recommended image2
AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. అసలు ఏం జరిగింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved