MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. అసలు ఏం జరిగింది?

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. అసలు ఏం జరిగింది?

AP Municipal Elections: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిలిపివేసింది. నామినేషన్ల గడువు, అభ్యర్థుల జాబితా విడుదలపై త్వరలోనే స్పష్టత రానుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 22 2026, 02:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలతో షాక్‌లో అభ్యర్థులు
Image Credit : chatgpt

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్.. సుప్రీంకోర్టు ఆదేశాలతో షాక్‌లో అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన తదుపరి ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల నేపథ్యంలోనే ఎస్ఈసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా వెల్లడించింది. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనపై కూడా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిషేధం కొనసాగనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సుప్రీంకోర్టు ఆదేశాల వెనుక అసలు కారణం ఇదే
Image Credit : Getty

సుప్రీంకోర్టు ఆదేశాల వెనుక అసలు కారణం ఇదే

స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు సమయంలో పలు ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తాయని, కొందరిని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను అక్టోబర్ 25 వరకు వాయిదా వేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

బాధితులు సమర్పించిన ఎలక్ట్రానిక్ ఆధారాలు, ఫిర్యాదులను పరిశీలించి, అవసరమైన చోట్ల నామినేషన్ల గడువును పొడిగించే అంశంపై స్వయంగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అదనపు ఆంక్షలు పెట్టకూడదని కూడా న్యాయస్థానం గట్టిగా హెచ్చరించింది.

35
కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసి కీలక సమీక్ష
Image Credit : ChatGPT

కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసి కీలక సమీక్ష

ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర రిపోర్టులను తెప్పించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ లేదా మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు పూర్తి స్థాయి భద్రత కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎస్ఈసి స్పష్టం చేసింది.

45
ఎన్వోసీ, నో డ్యూస్ సర్టిఫికెట్లపై స్పష్టత
Image Credit : Asianet News

ఎన్వోసీ, నో డ్యూస్ సర్టిఫికెట్లపై స్పష్టత

నామినేషన్ల పర్వంలో కొందరు అధికారులు అభ్యర్థుల వద్ద నుంచి పోలీసుల ఎన్వోసీ, నో డ్యూస్ సర్టిఫికెట్లు అడుగుతున్నారనే ఫిర్యాదులపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. అసలు ఎన్నికల నిబంధనావళిలో ఎన్వోసీ లేదా బకాయిలు లేవని చెప్పే నో డ్యూస్ సర్టిఫికెట్ తప్పనిసరి అనే రూల్ లేనే లేదని స్పష్టం చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అదనపు షరతులు విధించవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు వేసేలా రిటర్నింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు.

55
కూటమి పార్టీల స్పందనతో రాజకీయ ఉత్కంఠ
Image Credit : X/Janasena Party

కూటమి పార్టీల స్పందనతో రాజకీయ ఉత్కంఠ

ఎన్నికల వాయిదా, ఎస్ఈసి నిర్ణయాలపై టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు సానుకూలంగా స్పందించాయి. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఎన్నికలు జరగాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని నేతలు తెలిపారు. వైకాపా హయాంలో నామినేషన్ల సమయంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలు, భయోత్పాత పరిస్థితులున్నాయంటూ పేర్కొన్నారు. ఎస్ఈసి తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము పూర్తిగా కట్టుబడి ఉంటామని, రాజ్యాంగబద్ధంగా మంచి నాయకులను ఎన్నుకునేలా ప్రజలకు స్వేచ్ఛ ఉండాలని అభిప్రాయపడ్డారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
తిరుపతి
నారా చంద్రబాబు నాయుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
2nd TEST • SA vs AUS
Rain Delay
SASA
(127.1 ov)425/9
AUSAUS
(54.0 ov) 99 & 156/4
Day 5 - Session 3
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Live
NZNZ
(20.0 ov)225/4
INDIND
(0.4 ov)4/0
IND 222 runs in 116 balls
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
01:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : వచ్చే సోమవారం కూడా సెలవే... ఎందుకో తెలుసా?
Recommended image2
Weather Update: బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాలకు భారీ వర్షాల అలర్ట్
Recommended image3
Now Playing
ఊహించని పని చేసిన బాబు | Vangaveeti Radha Meets CM Chandrababu | Asianet News Telugu
Related Stories
Recommended image1
Tata Motors Festive Sale: పండుగ ఆఫర్ల మోత.. టాటా కార్ల పై రూ. 3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు
Recommended image2
OPPO Find X10 Pro Max: ప్రపంచంలోనే తొలి ట్రిపుల్ 200MP కెమెరా ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved