MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు

Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో వర్షాలు

Weather Update : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతారణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు, తీవ్ర ఉక్కపోత కొనసాగనుంది. అక్కడక్కడ చిరుజల్లులు పడే ఛాన్సుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 16 2026, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగాళాఖాతంలో అల్పపీడనం
Image Credit : Gemini AI

బంగాళాఖాతంలో అల్పపీడనం

భారత వాతావరణ శాఖ (IMD) పలు ప్రాంతాలకు కూల్ న్యూస్ చెప్పింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ప్రస్తుతం ఇది ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలపై గట్టిగా కేంద్రీకృతమై ఉంది. విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం.. సముద్ర మట్టానికి సుమారు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది.

రాబోయే 2 రోజులలో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి, వాయువ్య దిశగా దూసుకెళ్లనుంది. నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఏర్పడిన ఈ రెండో అల్పపీడనం వల్ల రుతుపవనాల కదలికల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉత్తర కోస్తాకు కూల్ న్యూస్.. నేడు, రేపు మోస్తరు వానలు
Image Credit : Gemini

ఉత్తర కోస్తాకు కూల్ న్యూస్.. నేడు, రేపు మోస్తరు వానలు

వర్షాలు లేక అటు రైతులు, ఇటు ప్రజలు అల్లాడిపోతున్న టైంలో వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ అల్పపీడనం బెంగాల్ మీదుగా తూర్పు భారతం వైపు దూసుకుపోతూ, ఆ తర్వాత జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వైపు పయనించనుంది. దీనివల్ల దేశంలోని తూర్పు, మధ్య, ఉత్తర ప్రాంతాల్లో వర్షాలు భారీగా పుంజుకోనున్నాయి.

Related Articles

Related image1
FIFA World Cup Final: 5 ఏళ్ల క్రితమే ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ ఫలితం లీక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
Related image2
Stock Market Today: ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన గ్లోబల్ అప్‌డేట్స్ ఇవే !
35
రాయలసీమ, దక్షిణ కోస్తాలో నో ఛేంజ్.. భానుడి భగభగలు
Image Credit : Gemini

రాయలసీమ, దక్షిణ కోస్తాలో నో ఛేంజ్.. భానుడి భగభగలు

దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రజలకు మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి గుడ్ న్యూస్ లేదు. ఈ ప్రాంతాలపై అల్పపీడన ప్రభావం అస్సలు లేదు. రానున్న ఆరేడు రోజుల పాటు ఇక్కడ పొడి వాతావరణం ఉంటుందని ఐఎండీ స్పష్టం చేసింది. వేడి గాలులు, ఎండ తీవ్రత యథావిధిగా కంటిన్యూ అవుతాయి. బుధవారం బాపట్లలో 41.1°C, జంగమహేశ్వరపురంలో 41°C, తిరుపతిలో 40.6°C రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

45
ఖరీఫ్ సాగుపై ఎండల దెబ్బ.. టెన్షన్‌లో అన్నదాతలు
Image Credit : our own

ఖరీఫ్ సాగుపై ఎండల దెబ్బ.. టెన్షన్‌లో అన్నదాతలు

గత రెండు వారాలుగా వానలు ముఖం చాటేయడంతో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో పడింది. ఖరీఫ్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయినా కూడా సకాలంలో వర్షాలు పడకపోవడంతో విత్తనాలు నాటే ప్రాసెస్ చాలా స్లో అయిపోయింది. మొలకెత్తిన పంటలు కూడా ఎండల తీవ్రతకు మాడిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరుణ దేవుడు కరుణించాలని నిత్యం పూజలు చేస్తున్నారు. ఇలాంటి టైంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరో వారం రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడంతో అన్నదాతల్లో టెన్షన్ మరింత పెరిగింది.

55
తెలంగాణకు ఉక్కపోత గండం.. రాబోయే 7 రోజులు ఎలా ఉండబోతోందంటే?
Image Credit : Getty

తెలంగాణకు ఉక్కపోత గండం.. రాబోయే 7 రోజులు ఎలా ఉండబోతోందంటే?

ఇక తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లోని బేగంపేట వాతావరణ కేంద్రం జూలై 15 నుంచి జూలై 22 వరకు 7 రోజుల వెదర్ బులెటిన్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ లేదు. అక్కడక్కడా లైట్‌గా లేదా మోస్తరు వర్షాలు పడొచ్చు.

అలాగే, కొన్ని జిల్లాల్లో వేడి, తేమ వల్ల ఉక్కపోత మరింత ఎక్కువ అవుతుంది. జూలై 15, 16 తేదీల్లో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెంలో ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
Recommended image2
Now Playing
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami
Recommended image3
Andhra pradesh: ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం.. రాష్ట్ర‌వ్యాప్తంగా సంజీవ‌ని ప్రాజెక్టు
Related Stories
Recommended image1
FIFA World Cup Final: 5 ఏళ్ల క్రితమే ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ ఫలితం లీక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
Recommended image2
Stock Market Today: ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన గ్లోబల్ అప్‌డేట్స్ ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved