MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Stock Market Today: ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన గ్లోబల్ అప్‌డేట్స్ ఇవే !

Stock Market Today: ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన గ్లోబల్ అప్‌డేట్స్ ఇవే !

Stock Market Today: జూలై 16 ట్రేడింగ్‌లో భారత మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తుండగా, గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 16 2026, 08:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
యూఎస్ మార్కెట్లలో జోష్.. గిఫ్ట్ నిఫ్టీ గ్రీన్.. ఈరోజు దలాల్ స్ట్రీట్‌లో లాభాల పంట పండుతుందా?
Image Credit : ChatGPT

యూఎస్ మార్కెట్లలో జోష్.. గిఫ్ట్ నిఫ్టీ గ్రీన్.. ఈరోజు దలాల్ స్ట్రీట్‌లో లాభాల పంట పండుతుందా?

బుధవారం నాటి ట్రేడింగ్‌లో భారీ లాభాల నుంచి ప్రాఫిట్ బుకింగ్ వైపు వైపు సాగిన సెన్సెక్స్, నిఫ్టీలు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. అయితే, జూలై 16 (గురువారం) నాటి ట్రేడింగ్‌లో భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు సానుకూల ప్రారంభాన్ని చూసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో గిఫ్ట్ నిఫ్టీ సుమారు 24,112 మార్కు వద్ద ట్రేడవుతూ దేశీయ ఈక్విటీ మార్కెట్లకు పాజిటివ్ ఓపెనింగ్ సిగ్నల్స్ ఇచ్చింది.

అంతకుముందు సెషన్‌లో బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్‌లో కొనుగోళ్లు మార్కెట్‌ను ఆదుకోగా.. మెటల్, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో బలహీనత కనిపించింది. నిన్నటి ముగింపులో సెన్సెక్స్ 130.49 పాయింట్లు (0.17%) పెరిగి 77,185.43 వద్ద, నిఫ్టీ 26.45 పాయింట్లు (0.11%) లాభపడి 24,078.50 వద్ద సెటిల్ అయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్.. కానీ ఆసియా మార్కెట్లలో టెన్షన్
Image Credit : Asianet News

గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్.. కానీ ఆసియా మార్కెట్లలో టెన్షన్

గ్లోబల్ మార్కెట్ల విషయానికి వస్తే, ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్‌లో గిఫ్ట్ నిఫ్టీ 62 పాయింట్లు లేదా 0.26 శాతం పెరిగి 24,104 వద్ద కదలాడింది. ఇది దలాల్ స్ట్రీట్‌కు మంచి బూస్ట్ ఇచ్చే విషయమే. కానీ మరోవైపు, ఆసియా పసిఫిక్ రీజియన్‌లోని మార్కెట్లలో మాత్రం అమ్మకాల ఒత్తిడి క్లియర్ గా కనిపిస్తోంది. సెమీకండక్టర్ స్టాక్స్‌లో కొత్తగా వచ్చిన సెల్లింగ్ ప్రెజర్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రేడ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

జపాన్ టోపిక్స్ 0.8% తగ్గగా, జపాన్ నిక్కీ 225 ఏకంగా 3% పైగా, సౌత్ కొరియా కోస్పి 6% పైగా పతనమయ్యాయి. గ్లోబల్ క్యూస్ మిశ్రమంగా ఉన్నాయని నిపుణులు చెప్పారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలు పెరగడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోందని, ప్రోలాంగ్డ్ డిస్రప్షన్స్ వల్ల గ్లోబల్ ఎనర్జీ సప్లైస్, ఆర్థిక వృద్ధికి రిస్క్ పొంచి ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అయిన ఐఎంఎఫ్ హెచ్చరించింది.

Related Articles

Related image1
USA: అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండే టాప్ 5 నగరాలు ఇవే.. ఈ ప్రాంతాలే ఎందుకు? వాటి ప్రత్యేకత ఏంటి?
Related image2
FIFA World Cup Final: 5 ఏళ్ల క్రితమే ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ ఫలితం లీక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
36
వాల్ స్ట్రీట్‌లో జోష్.. యూఎస్ మార్కెట్ల రికవరీ
Image Credit : Asianet News

వాల్ స్ట్రీట్‌లో జోష్.. యూఎస్ మార్కెట్ల రికవరీ

ఆసియా మార్కెట్లలో గందరగోళం ఉన్నప్పటికీ, నిన్న రాత్రి యూఎస్ మార్కెట్లు (Wall Street) మాత్రం లాభాల్లో ముగిశాయి. యూఎస్‌లో ద్రవ్యోల్బణం డేటా కాస్త తగ్గడం, సెకండ్ క్వార్టర్ ఫలితాలు బలంగా ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. సెమీకండక్టర్ షేర్లు కాస్త వీక్‌గా ఉన్నా, కన్స్యూమర్ రీటైల్, ట్రావెల్ అండ్ లీజర్ స్టాక్స్ దుమ్మురేపాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 150.91 పాయింట్లు (0.29%) పెరిగి 52,659.18 వద్ద ముగిసింది.

ఎస్‌అండ్ పీ 500 సూచీ 28.83 పాయింట్లు (0.38%) లాభంతో 7,572.42 వద్ద, నాస్డాక్ కాంపోజిట్ 162.22 పాయింట్లు (0.62%) పెరిగి 26,269.23 వద్ద క్లోజ్ అయ్యాయి. కాగా, యూఎస్ డాలర్ ఇండెక్స్ ఒక నెల కనిష్ట స్థాయి వద్దే ఫ్లాట్‌గా కొనసాగుతోంది. 10-ఇయర్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 4.55% వద్ద, 2-ఇయర్ బాండ్ ఈల్డ్స్ 4.14% వద్ద ట్రేడవుతున్నాయి.

46
క్రూడ్ ఆయిల్ సెగ.. పడిపోయిన రూపాయి విలువ
Image Credit : Getty

క్రూడ్ ఆయిల్ సెగ.. పడిపోయిన రూపాయి విలువ

మిడిల్ ఈస్ట్‌లో ఇరానియన్ సైనిక స్థావరాలపై యూఎస్ మరోసారి దాడులు చేయడంతో టెన్షన్స్ పీక్స్‌కు చేరాయి. హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయాలతో క్రూడ్ ఆయిల్ ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగాయి.

చమురు ధరల పెరుగుదలు, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల బుధవారం రూపాయి విలువ యూఎస్ డాలర్‌తో పోలిస్తే 16 పైసలు క్షీణించి 96.32 వద్ద ముగిసింది. రూపాయి బలహీనపడటం భారత మార్కెట్ సెంటిమెంట్‌ను కాస్త దెబ్బతీసే అంశం. ఇక గోల్డ్ రేట్లు విషయానికి వస్తే, తగ్గుతున్న ద్రవ్యోల్బణం, మిడిల్ ఈస్ట్ దాడుల మధ్య ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని అంచనా వేస్తూ పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

56
నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్.. ఎనలిస్టులు ఏమంటున్నారు?
Image Credit : Asianet News

నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్.. ఎనలిస్టులు ఏమంటున్నారు?

మార్కెట్ ఎనలిస్టుల ప్రకారం, నిఫ్టీ ప్రస్తుత కన్సాలిడేషన్ మోడ్‌ను కొనసాగించే అవకాశం ఉంది. నిఫ్టీ 23,800 నుండి 24,350 రేంజ్‌లో ట్రేడ్ కావచ్చని భావిస్తున్నారు. గత శుక్రవారం నాటి గ్యాప్ ఏరియా, సోమవారం నాటి లో లెవెల్ అయిన 24,000-23,950 నిఫ్టీకి తక్షణ సపోర్ట్‌గా పనిచేస్తాయి. శామ్కో సెక్యూరిటీస్ డెరివేటివ్స్ రీసెర్చ్ అనలిస్ట్ ధూపేష్ ధమేజా ప్రకారం, ఆప్షన్ చైన్ డేటా 24,000 స్ట్రైక్ వద్ద గరిష్ఠ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్‌ను చూపిస్తోంది, ఇది బలమైన సపోర్ట్ బేస్‌ను సూచిస్తుంది.

అదే సమయంలో 24,200 అండ్ 24,500 స్ట్రైక్స్ వద్ద గరిష్ఠ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇది ఓవర్ లోడ్ సప్లై ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. షార్ట్ టర్మ్ సపోర్ట్ 23,800-23,900 వద్ద ఉండగా, మార్కెట్ 24,350 దాటితేనే 24,600 లెవెల్స్ వైపు దూసుకెళ్లే బలం వస్తుందని టెక్నికల్ వ్యూ చెబుతోంది. మార్కెట్ భయాన్ని కొలిచే ఇండియా విక్స్ 3.5% తగ్గి 13.27 స్థాయికి చేరింది, ఇది వోలటాలిటీ తగ్గుతుందనడానికి సంకేతం.

66
ఎఫ్ఐఐ, డీఐఐ ఫండ్ ఫ్లూ, ఎఫ్ అండ్ ఓ బ్యాన్ లిస్ట్
Image Credit : AI Picture

ఎఫ్ఐఐ, డీఐఐ ఫండ్ ఫ్లూ, ఎఫ్ అండ్ ఓ బ్యాన్ లిస్ట్

ఫండ్ ఫ్లో యాక్షన్ విషయానికి వస్తే, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు జూలై 15న వరుసగా మూడో సెషన్‌లోనూ నికర విక్రయదారులుగా ఉండి, రూ. 735 కోట్ల విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించారు. దీనికి భిన్నంగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు వరుసగా ఆరో సెషన్‌లోనూ కొనుగోళ్లను కొనసాగిస్తూ రూ. 704 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ 95% దాటడం వల్ల ఈరోజు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బ్యాన్ పీరియడ్‌లో కేయిన్స్ (Kaynes) స్టాక్ మాత్రమే ఉంది.

గమనిక: మార్కెట్ నిపుణులు చెప్పే ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు సర్టిఫైడ్ ఎక్స్‌పర్ట్స్‌ను సంప్రదించడం మంచిది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
స్టాక్ మార్కెట్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Home: ఇల్లు కొనేకంటే ఈ ప‌ని చేయ‌డం బిందాస్‌.. మారుతోన్న యువ‌త ఆలోచ‌న
Recommended image2
మూడేళ్ల క్రితం ల‌క్ష పెట్టుబ‌డి పెడితే ఈరోజు రూ. 87 ల‌క్ష‌లు అయ్యింది.. ఈ కండోమ్ కంపెనీ మ్యాజిక్ చేసింది
Recommended image3
Today Gold Price: బంగారం మళ్లీ భగ్గుమంది...మళ్లీ ఎగబాకిన పసిడి ధరలు
Related Stories
Recommended image1
USA: అమెరికాలో భారతీయులు ఎక్కువగా ఉండే టాప్ 5 నగరాలు ఇవే.. ఈ ప్రాంతాలే ఎందుకు? వాటి ప్రత్యేకత ఏంటి?
Recommended image2
FIFA World Cup Final: 5 ఏళ్ల క్రితమే ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ ఫలితం లీక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved