MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Andhra Pradesh
  • Bullet Train లో హైదరాబాద్ నుండి అమరావతి, బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై కి... ఎంతసేపట్లో చేరుకోవచ్చో తెలుసా..?

Bullet Train లో హైదరాబాద్ నుండి అమరావతి, బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై కి... ఎంతసేపట్లో చేరుకోవచ్చో తెలుసా..?

బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుండి అమరావతి ఎంతసేపట్లో చేరుకోవచ్చు..? అలాగే ఏఏ నగరాల మధ్య ప్రయాణ సమయం ఎంత నుండి ఎంతకు తగ్గుతుందో తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 28 2026, 02:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హైదరాాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్..
Image Credit : x

హైదరాాబాద్ టు అమరావతి బుల్లెట్ ట్రైన్..

Bullet Train : తెలుగు ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల రాజధానులు హైదరాబాద్- అమరావతి మధ్య రాబోయే రోజుల్లో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ రెండు రాజధానుల మధ్య బుల్లెట్ ట్రైన్ నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. దీంతో హైదరాబాద్ - అమరావతి మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది… కేవలం 70 నిమిషాలు అంటే గంటా పది నిమిషాల్లోనే ఓ రాజధాని నుండి మరో రాజధానికి చేరుకోవచ్చని కేంద్ర మంత్రి వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అమరావతికి మహర్దశ...
Image Credit : Getty

అమరావతికి మహర్దశ...

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ నగరం విశాఖపట్నంలో గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ భారీగా పెట్టుబడులు పెడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ (ఏప్రిల్ 28, మంగళవారం) విశాఖలోని తర్లువాడ వద్ద గూగుల్ ఎఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ రాజధాని అమరావతి డెవలప్మెంట్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఏ ప్రాంతమైనా రవాణా వ్యవస్థ బాగున్నపుడే వేగంగా డెవలప్ అవుతుంది... అందుకే ఏపీ రాజధాని అమరావతికి ముందుగా మెరుగైన రవాణా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమరావతి నుండి ఇటు హైదరాబాద్, అటు చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా వెల్లడించారు... అమరావతికి రైల్వే కనెక్టివిటీని మరింత మెరుగుపర్చనున్నట్లు తెలిపారు.

అమరావతి నుండి కేవలం గంటలో హైదరాబాద్ కు చేరుకునేలా బుల్లెట్ ట్రైన్ ఉపయోగపడుతుంది. అలాగే తమిళనాడు రాజధాని చెన్నైకి కూడా అమరావతి నుండి కేవలం 112 నిమిషాల్లో చేరుకోవచ్చని కేంద్ర మంత్రి వెల్లడించారు. దీంతో నిత్యం అమరావతి నుండి ఈ రెండు నగరాల మధ్య రాకపోకలు సాగించేవారు గంటలతరబడి ప్రయాణించే బాధ ఉండదు... గంట రెండుగంటల్లో గమ్యానికి చేరుకోవచ్చు.

Related Articles

Related image1
బుల్లెట్ ట్రైన్ హ‌బ్‌గా హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం.. ఇక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఖాయం
Related image2
హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు
34
హైదరాబాద్ నుండి ఈ నగరాలకూ బుల్లెట్ ట్రైన్స్..
Image Credit : Gemini AI

హైదరాబాద్ నుండి ఈ నగరాలకూ బుల్లెట్ ట్రైన్స్..

ఏపీ రాజధాని అమరావతి గురించే కాదు తెలంగాణ రాజధాని హైదరాబాద్ గురించి కూడా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఐటీ సిటీ నుండి దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రధాన నగరాలన్నింటికి బుల్లెట్ ట్రైన్స్ నడుపుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు బుల్లెట్ ట్రైన్ లో హైదరాబాద్ నుండి ఏఏ నగరాలకు ఎంత సమయంలో చేరుకోవచ్చో వివరించారు.

హైదరాబాద్ - అమరావతి : 70 నిమిషాలు

హైదరాబాద్ - పూణే : 155 నిమిషాలు

హైదరాబాద్ - బెంగళూరు : 2 గంటల 8 నిమిషాలు

హైదరాబాద్ - చెన్నై : హైదరాబాద్ నుండి అమరావతికి 70 నిమిషాలు... అక్కడినుండి చెన్నైకి 112 నిమిషాలు... అంటే హైదరాబాద్ నుండి చెన్నైకి ప్రయాణ సమయం 182 నిమిషాలు (దాదాపు 3 గంటలు) అన్నమాట.

పూణే - ముంబై : 48 నిమిషాలు. అంటే హైదరాబాద్ నుండి పూణేకు 155 నిమిషాలు... అక్కడినుండి ముంబైకి 48 నిమిషాలు... మొత్తంగా హైదరాబాద్ నుండి ముంబైకి 203 నిమిషాలు (దాదాపు మూడున్నర గంటలు) పడుతుంది.

ఇక చెన్నై నుండి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ లో 73 నిమిషాల సమయం పడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

44
''మోదీ, చంద్రబాబు సేమ్ టు సేమ్..''
Image Credit : Gemini AI

''మోదీ, చంద్రబాబు సేమ్ టు సేమ్..''

విశాఖపట్నం కార్యక్రమంలో బుల్లెట్ ట్రైన్ గురించి వివరిస్తూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. బుల్లెట్ ట్రైన్ ద్వారా హైదరాబాద్, అమరావతి మధ్య ప్రయాణ సమయం 70 నిమిషాలకు తగ్గుతుందంటే దాన్ని 35 నిమిషాలకు తగ్గించలేమా..? అని పీఎం, సీఎం అడుగుతారంటూ సరదా కామెంట్స్ చేశారు.

కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం చేయడంలేదని... గత పాలకుల కంటే మెరుగ్గా డెవలప్ చేస్తోందన్నారు అశ్విని వైష్ణవ్. ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ వంటివాటితో హైస్పీడ్ లో దక్షిణాది డెవలప్మెంట్ సాగుతుందన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే దక్షిణాదికి కేంద్రం అన్యాయం చేస్తోందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
అమరావతి
సాంకేతిక వార్తలు చిట్కాలు
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
నరేంద్ర మోదీ
రాజకీయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Recommended image2
Now Playing
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Recommended image3
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?
Related Stories
Recommended image1
బుల్లెట్ ట్రైన్ హ‌బ్‌గా హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం.. ఇక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఖాయం
Recommended image2
హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు గంట‌లో వెళ్లిపోవ‌చ్చు.. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌లో మ‌రో కీల‌క అడుగు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved