MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Andhra Pradesh
  • Tirumala : మార్చిలో ఓ రోజంతా మూతపడనున్న తిరుమల ఆలయం... ఎందుకో తెలుసా?

Tirumala : మార్చిలో ఓ రోజంతా మూతపడనున్న తిరుమల ఆలయం... ఎందుకో తెలుసా?

వచ్చే నెల మార్చి 3న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి ఆరోజు తిరుమలకు వెళ్లకపోవడమే మంచిది. అసలు ఎందుకు ఆలయాన్ని మూసేస్తున్నారో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 17 2026, 07:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మార్చిలో మూతపడనున్న శ్రీవారి ఆలయం..
Image Credit : istock

మార్చిలో మూతపడనున్న శ్రీవారి ఆలయం..

Lunar Eclipse : కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది తిరుమల వెళుతుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాదు దేశ విదేశాల నుండి కూడా శ్రీవారి భక్తులు తరలి వెళుతుంటారు. ఇలా వచ్చే నెల మార్చిలో తిరుమలకు వెళ్లాలని భావిస్తున్న భక్తులకు ముఖ్య సూచన. మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేసి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ట్రస్ట్ ప్రకటించింది... కాబట్టి ఆరోజు భక్తులు తిరుమలకు వెళ్లకపోవడమే మంచిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎందుకు శ్రీవారి ఆలయం మూతపడనుంది..?
Image Credit : Getty

ఎందుకు శ్రీవారి ఆలయం మూతపడనుంది..?

మార్చి 3న పౌర్ణమి ఉంది... ఈ రోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం గ్రహణాల సమయంలో దేవాలయాలను మూసివేస్తారు... అందుకే తిరుమల శ్రీవారి ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. గ్రహణం అనంతరం ఆలయాన్ని తెరిచి సంపోక్షణ చేపడతారు అర్చకులు... ఆ తర్వాత భక్తులకు దర్శనం కల్పిస్తారు.

Related Articles

Related image1
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు
Related image2
Now Playing
Tirumala Temple Decoration: ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమల ఆలయం| Asianet News Telugu
35
మార్చి 3న శ్రీవారి ఆలయం తెరిచివుండే వేళలు..
Image Credit : TTD Website

మార్చి 3న శ్రీవారి ఆలయం తెరిచివుండే వేళలు..

మార్చి 3న అంటే గ్రహణం రోజు తెల్లవారుజామున యదావిధిగా 5 గంటలకే ఆలయాన్ని తెరుస్తారు. 9 లేదా 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు.. ఆ తర్వాత ఆలయ తలుపులు మూసివేస్తారు. తిరిగి రాత్రికి ఆలయాన్ని తెరుస్తారు.

చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.20 నుండి సాయంత్రం 6.47 వరకు కొనసాగుతోంది. అయితే గ్రహణానికి చాలా ముందుగానే తిరుమల ఆలయాన్ని మూసివేయనున్నారు. ఇక గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుద్దిచేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు... అందుకోసం కొంత సమయం పడుతుంది. రాత్రి 7.30 లేదా 8.30 గంటల నుండి తిరిగి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇలా మార్చి 3న ఉదయం 9-10 గంటల మధ్య తిరుమల ఆలయం మూతపడి తిరిగా 7.30-8.30 గంటల సమయంలో తెరుచుకుంటుంది.

45
మార్చి 3న అన్నిరకాల సేవలు బంద్...
Image Credit : X-@nitin_gadkari

మార్చి 3న అన్నిరకాల సేవలు బంద్...

చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారికి నిత్యం చేపట్టే కొన్ని పూజలు నిలిచిపోనున్నాయి. అన్నిరకాల ఆర్జిత సేవలు, వీఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి... ఈ మేరకు ముందస్తుగా టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులకు ఇప్పటికే సమాచారం అందించారు. ఈరోజు తిరుమల రావాలనుకునే భక్తులు తమ ప్రయాణ ఏర్పాట్లను మార్చుకోవాలని టీటీడీ సూచించింది.

55
మార్చి 3న తిరుమలలో ప్రత్యేక ఉత్సవం...
Image Credit : Getty

మార్చి 3న తిరుమలలో ప్రత్యేక ఉత్సవం...

ఇక ఇదే మార్చి 3న అంటే చంద్రగ్రహణం రోజున తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవం జరగనుంది. ఫల్గుణ పౌర్ణమి నాడు జరిగే ఈ ఉత్సవంలో తీర్థ స్నానం చేస్తే ఆరోగ్యం, దీర్ఘాయువు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. కాబట్టి భక్తులు ఎక్కువగా తరలివచ్చే అవకాశాలుంటాయి... అందుకే ముందుగా ఆలయ టైమింగ్స్ తెలుసుకుని దాని ప్రకారం దర్శనానికి రావాలని టిటిడి సూచిస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తిరుపతి
ఆంధ్ర ప్రదేశ్
ఆధ్యాత్మిక విషయాలు
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు పడేది ఎప్పుడంటే?
Recommended image2
Amaravati Real Estate: అమరావతిలో అప్పుడు రూ.16 లక్షలు పెడితే.. ఇప్పుడు రూ.1 కోటి! మైండ్ బ్లాకింగ్ రియల్ ఎస్టేట్ లెక్కలు
Recommended image3
Now Playing
APకి బ్రాండ్ అంబాసిడర్ CBN స్పీచ్ అదరగొట్టిన నిమ్మల| Nimmala Ramanaidu Speech | NTR Bharosa Pensions
Related Stories
Recommended image1
Tirupati: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుప‌తి ప‌రిస‌ర ప్రాంతాల సంద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు
Recommended image2
Now Playing
Tirumala Temple Decoration: ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమల ఆలయం| Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved