MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • TDP Net Worth : అమ్మో.. టీడీపీ అకౌంట్లో అన్ని వందల కోట్లా? చంద్రబాబు పార్టీ ఖర్చు, ఆదాయం లెక్కలు ఇవే..

TDP Net Worth : అమ్మో.. టీడీపీ అకౌంట్లో అన్ని వందల కోట్లా? చంద్రబాబు పార్టీ ఖర్చు, ఆదాయం లెక్కలు ఇవే..

TDP Net Worth: తెలుగు దేశం పార్టీ మహానాడు 2026 లో టీడీపీ ఆస్తులు, ఆదాయం, ఖర్చుల చిట్టాను బయటపెట్టింది. పార్టీ కోట్ల రూపాయల జనరల్ ఫండ్‌తో పాటు నారా లోకేష్ చేసిన సంచలన ప్రకటన హైలైట్‌గా నిలిచింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 28 2026, 08:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీడీపీ ఆదాయం ఎంతో తెలిస్తే అమ్మో అంటారు.. అసలు లెక్కలు ఇవే
Image Credit : X/Telugu Desam Party

టీడీపీ ఆదాయం ఎంతో తెలిస్తే అమ్మో అంటారు.. అసలు లెక్కలు ఇవే

తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే 'మహానాడు 2026' గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. అయితే ఈసారి ఖర్చులు తగ్గించుకుంటూ, పొదుపు మంత్రం పాటిస్తూ సరికొత్తగా హైబ్రిడ్ మోడ్‌లో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మెయిన్ ప్రోగ్రామ్ రన్ అవ్వగా, స్టేట్ వైడ్‌గా దాదాపు 1,875 క్లస్టర్ల నుంచి ఏకంగా 7.28 లక్షల మంది కార్యకర్తలు, లీడర్లు ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ స్క్రీన్స్‌పై మెరిశారు.

నూజివీడు లాంటి కొన్ని ఏరియాల్లో అయితే 100% అటెండెన్స్‌తో క్యాడర్ రికార్డ్ క్రియేట్ చేసింది. చంద్రబాబు నాయుడు జెండా ఎగరేసి, జ్యోతి వెలిగించి ఈ పండుగను అఫీషియల్‌గా ఓపెన్ చేశారు. ఇటీవల చనిపోయిన పార్టీ శ్రేణులకు సంతాపం తెలిపాక, సరికొత్త పొలిటికల్ జోష్‌తో తీర్మానాలు ప్రవేశపెట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలుగుదేశం పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా?
Image Credit : X/Telugu Desam Party

తెలుగుదేశం పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా?

ప్రతి ఏటా లాగే ఈసారి కూడా మహానాడులో పార్టీ సీనియర్ లీడర్ కొనకళ్ల నారాయణ టీడీపీకి సంబంధించిన పక్కా లెక్కలను, జమాఖర్చుల చిట్టాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం, 2026 మార్చి నాటికి తెలుగుదేశం పార్టీ 'జనరల్ ఫండ్' అకౌంట్‌లో ఏకంగా రూ.485.81 కోట్లు బాలెన్స్ ఉన్నట్లు లీక్ చేశారు.

ఇక 2025-26 ఫైనాన్షియల్ ఇయర్‌కు గాను పార్టీకి వచ్చిన ఆదాయం చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. కేవలం మెంబర్‌షిప్ ద్వారా రూ.1.62 కోట్లు రాగా, భారీగా విరాళాల రూపంలో రూ.58.32 కోట్లు కలెక్ట్ అయ్యాయి. బ్యాంక్ ఇంట్రెస్ట్ ద్వారా రూ.29.10 కోట్లు, ఇతర మార్గాల ద్వారా రూ.1.52 కోట్లతో కలిపి టోటల్‌గా ఈ ఒక్క ఏడాదిలోనే రూ.90.64 కోట్ల రాబడి వచ్చింది.

35
ఖర్చులు ఎక్కడెక్కడ అంటే.. కార్యకర్తలకు భారీ ఇన్సూరెన్స్
Image Credit : X/Telugu Desam Party

ఖర్చులు ఎక్కడెక్కడ అంటే.. కార్యకర్తలకు భారీ ఇన్సూరెన్స్

రాబడి మాత్రమే కాదు, పార్టీ కోసం చేసిన ఖర్చుల డీటెయిల్స్ కూడా అంతే ట్రాన్స్‌పారెంట్‌గా బయటపెట్టారు. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే.. గ్రౌండ్ లెవల్‌లో కష్టపడే కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీ భారీగా ఖర్చు చేస్తోంది. ప్రమాదాల్లో చనిపోయిన లేదా గాయపడిన కార్యకర్తల ఫ్యామిలీస్ కోసం ఏకంగా రూ.46.52 కోట్లు ఇన్సూరెన్స్ రూపంలో చెల్లించారు. 

ఇక పార్టీ పబ్లిసిటీ, ప్రచార కార్యక్రమాల కోసం రూ.16.52 కోట్లకు పైగా ఖర్చు చేశారు. టోటల్‌గా అన్ని రకాల ఖర్చులు కలిపి ఈ ఇయర్‌లో రూ.74.25 కోట్లు అవ్వగా.. ఇంకా రూ.16.39 కోట్లు మిగిలాయని లెక్కలు చెప్పారు.

45
నెల్లూరు ఎంపీ భారీ విరాళం.. వెల్లువెత్తిన కోట్లు
Image Credit : Chandrababu Twitter

నెల్లూరు ఎంపీ భారీ విరాళం.. వెల్లువెత్తిన కోట్లు

మహానాడు ఫస్ట్ రోజే పార్టీ ఫండ్‌కు విరాళాలు వెల్లువలా కురిశాయి. కేవలం ఒకే రోజులో దాదాపు రూ.11.70 కోట్ల డొనేషన్స్ వచ్చాయి. ఇందులో టాప్ హైలైట్ ఏంటంటే.. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి దంపతులు ఏకంగా రూ.5 కోట్లు పార్టీ ఫండ్‌గా ఇచ్చారు. 

వీరితో పాటు రాజ్యసభ ఎంపీ సానా సతీష్ రూ.1.5 కోట్లు ఇవ్వగా.. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి, పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తలా రూ.1 కోటి చొప్పున విరాళం ఇచ్చారు.

55
టీడీపీ తరపున మహిళలకు కచ్చితంగా 33 శాతం సీట్లు: లోకేష్
Image Credit : Naralokesh/X

టీడీపీ తరపున మహిళలకు కచ్చితంగా 33 శాతం సీట్లు: లోకేష్

మహానాడు లో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఒక బిగ్ సంచలన ప్రకటన చేశారు. ఎక్స్ లో ఉదయాన్నే హైప్ క్రియేట్ చేసిన లోకేష్.. మధ్యాహ్నం 12 గంటలకి 'స్త్రీశక్తి' థీమ్‌కు తగ్గట్టుగా ఒక మాస్ అప్‌డేట్ ఇచ్చారు. 

పార్లమెంట్‌లో ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో సంబంధం లేకుండానే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున మహిళలకు కచ్చితంగా 33 శాతం సీట్లు ఇస్తామని అఫీషియల్‌గా అనౌన్స్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇక సీఎం చంద్రబాబు తన 43 నిమిషాల స్పీచ్‌లో వైసీపీపై ప్రాసలతో, అదిరిపోయే పంచ్‌లతో అటాక్ చేస్తూనే.. కార్యకర్తలకు క్లాస్ తీసుకుంటూ ఫుల్ జోష్ నింపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Related Stories
Recommended image1
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
Recommended image2
Jio New OTT Pass: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.200 కే 15 ఓటీటీలు ఫ్రీ.. ఇక నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లొల్లి లేదు బాస్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved