MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Success Story : తెలుగులోనే సివిల్ సర్వీస్ ఎగ్జామ్.. ఇది కదా మాతృభాషపై మమకారం, ఇతడిది కదా అసలైన సక్సెస్

Success Story : తెలుగులోనే సివిల్ సర్వీస్ ఎగ్జామ్.. ఇది కదా మాతృభాషపై మమకారం, ఇతడిది కదా అసలైన సక్సెస్

Success Story : తెలుగు యువతకు స్పూర్తినిచ్చే ఓ సివిల్స్ ర్యాంకర్ స్టోరీ ఇది. ఇంగ్లీష్ వస్తేతప్ప సివిల్స్ సాధించడం అసాధ్యమనే అపోహను పటాపంచలు చేస్తూ తెలుగులోనే ఎగ్జామ్ రాసి ఆలిండియా ర్యాంకు సాధించాడు మన తెలుగబ్బాయి. 

3 Min read
Author : Arun Kumar P
Published : Mar 14 2026, 10:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సివిల్స్ ర్యాంకర్ సక్సెెస్ స్టోరీ..
Image Credit : X/DrVishwaksenJSP

సివిల్స్ ర్యాంకర్ సక్సెెస్ స్టోరీ..

Success Story : ''కృషి ఉంటే మనుషులు రుషులవుతారు... మహా పురుషులవుతారు'', ''పట్టుదలతో ప్రయత్నిస్తే ఈ ప్రపంచమే కాళ్లకిందకు వచ్చేస్తుంది"... ఇలాంటి మాటలు మోటివేషన్ కోసమే... నిజజీవితంలో ఆచరణసాధ్యం కావు అనుకుంటుంటారు నేటితరం యువతీయువకులు. కానీ దృఢ సంకల్పం ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని... అనుకున్నది సాధించనవచ్చని నిరూపించాడు ఓ తెలుగు కుర్రాడు. దేశంలో అత్యంత కఠినమైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ర్యాంకు సాధించడమే గొప్ప విషయం... అలాంటిది మాతృభాష తెలుగులో రాసి ర్యాంకు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇలా తనకు మాతృభాషపై ఉన్న మమకారాన్ని చాటుకుంటూనే కలను సాకారం చేసుకున్న తెలుగు బిడ్డ సక్సెస్ స్టోరీ ఇక్కడ తెలుసుకుందాం.

25
సివిల్స్ లో 463 ర్యాంక్ సాధించిన తెలుగబ్బాయి..
Image Credit : X/warangal_nit

సివిల్స్ లో 463 ర్యాంక్ సాధించిన తెలుగబ్బాయి..

ఆంధ్ర ప్రదేశ్ లోని బాగా వెనకబడిన ప్రాంతం ఉత్తరాంధ్ర... అందులో ఇంకా వెనకబడిన ప్రాంతం శ్రీకాకుళం. అలాంటి జిల్లానుండి దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా ర్యాంకు సాధించాడు సారోతు రాము. ఇటీవల వెలువడిన UPSC 2025 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఫలితాల్లో రాము ఆలిండియా 463 ర్యాంకు సాధించాడు.

అయితే తెలుగు రాష్ట్రాల నుండి మరికొందరు యువతీయువకులు కూడా సివిల్స్ ర్యాంకు సాధించారు... తమ IAS, IPS కలను నెరవేర్చుకున్నారు. కొందరు రాము కంటే మెరుగైన ర్యాంకు సాధించారు. కానీ వీళ్ళలో ఎవ్వరూ చేయని సాయసం రాము చేశాడు... అందరూ ఇంగ్లీష్ లో ఈ పరీక్ష రాస్తే రాము ఒక్కడే తెలుగులో రాశాడు. అందుకే ఇతడు ప్రత్యేకంగా నిలిచాడు... తెలుగు మీడియం చదివే పేద విద్యార్థులకు స్పూర్తిగా నిలిచాడు.

Related Articles

Related image1
Success Story : పశువుల పేడతో లక్షల సంపాదన.. అద్భుతాలు చేస్తున్న ఆడబిడ్డ
Related image2
Success Story : మూడుసార్లు ఫెయిల్.. శత్రువుల వల్లే నాలుగోసారి సివిల్స్ ర్యాంక్ : ఓ తెలుగు ఐఏఎస్ సక్సెస్ స్టోరీ
35
 కష్టాలను దాటుకుని లక్ష్యం వైపు ప్రయాణం...
Image Credit : X/DrVishwaksenJSP

కష్టాలను దాటుకుని లక్ష్యం వైపు ప్రయాణం...

శ్రీకాకుళం సివిల్స్ ర్యాంకర్ రాముది చిన్నప్పటి నుండి కష్టాలతో నిండిన జీవితమే. అతడిది సాధారణ వ్యవసాయ కుటుంబం... చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు... తల్లి లక్ష్మి కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించింది. తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగిన రాము జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంతో చదివేవాడు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తెలుగు మీడియంలోనే... అదీ ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది.

ఇంటర్మీడియట్ కూడా మంచి మార్కులతో పూర్తిచేసుకున్న రాము వరంగల్ ఎన్ఐటీ (NIT) లో సీటు సాధించాడు. ఇక్కడే అతడి జీవితం మలుపు తిరిగింది... సివిల్స్ వైపు అడుగులు పడ్డాయి. ఇంజనీరింగ్ చేస్తూనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ పై దృష్టి పెట్టాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతో ఏడాదిపాటు ఫోర్డ్ కంపెనీలో పనిచేయాల్సి వచ్చింది. ఉద్యోగం చేస్తూనే ప్రిపరేషన్ కూడా సాగించాలని భావించాడు... కానీ అని సాధ్యం కాలేదు. దీంతో 2021 లో మంచి శాలరీతో కూడిన ఉద్యోగాన్ని మానేసి పూర్తిగా యూపిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించాడు.

45
అనుకున్నది సాధించాడు...
Image Credit : X/DrVishwaksenJSP

అనుకున్నది సాధించాడు...

రాము చిన్నప్పటినుండి చదువుకున్నది తెలుగు మీడియం... కానీ సివిల్ సర్వీసెస్ పరీక్ష అందరూ ఇంగ్లీష్ లో రాస్తారు. అందరిలా తానెందుకు రాయాలి... తనకు పట్టున్న తెలుగులో రాస్తే ఏమవుతుంది...? అనే ఆలోచన తట్టింది. అందుకే బాగా కష్టమైనా తెలుగులోని సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు... ఎక్కువగా స్టడీ మెటీరియల్స్ అందుబాటులో లేకున్నా సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడు. ఈ క్రమంలో ఫెయిల్యూర్స్ ఎదురైనా వెనకడుగు వేయలేదు.

రాము 2021 లో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించి 3 సార్లు పరీక్ష రాసి విఫలమయ్యాడు. మొదటిసారి ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయాడు... కానీ రెండు, మూడోసారి మెయిన్స్ వరకు వెళ్లాడు. ఇక తాజాగా నాలుగో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్ తెలుగులోనే రాసి క్లియర్ చేశాడు... ఇంటర్వ్యూలో కూడా ప్రతిభ చాటి సక్సెస్ అయ్యాడు. ఇటీవల వెలువడిన యూపిఎస్సి సివిల్ సర్వీస్ రిజల్ట్స్ లో ఆలిండియా ర్యాంకు సాధించి ఎట్టకేలకు కలను సాకారం చేసుకున్నాడు.

55
తెలుగు యువతకు స్పూర్తి...
Image Credit : gemini

తెలుగు యువతకు స్పూర్తి...

కష్టపడితే ఎంతటి లక్ష్యాన్ని అయినా చేధించవచ్చని రాము నిరూపించాడు. చాలామంది తెలుగు మీడియంలో చదివి ఏం సాధించలేమని నిరుత్సాహపడుతుంటారు... అలాంటివారికి రాము విజయమే స్పూర్తి. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇంగ్లీష్ లో రాయడమే అనుకూలంగా ఉంటుంది... తెలుగులో ఇబ్బందులు ఉంటాయి... కానీ గట్టిగా అనుకుంటే ర్యాంకు సాధించడం అసాధ్యమేమీ కాదంటున్నాడు రాము. తెలగు సాహిత్యం (Telugu Literature) ఆప్షనల్ గా ఎంచుకున్నానని... ఇతర సబ్జెక్ట్స్ పై కూడా తెలుగులోనే పట్టుసాధించి విజయం అందుకున్నానని రాము సగర్వంగా చెబుతున్నాడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఫీల్ గుడ్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
తెలంగాణ
భారత దేశం
విద్య
ఏషియానెట్ న్యూస్
ఉద్యోగాలు, కెరీర్
వైరల్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Naidu Annadata Sukhibhava PM KISAN: రైతులకు స్పాట్ లోనే డబ్బులు | Asianet News Telugu
Recommended image2
Now Playing
AP Food Commission Chairman: కచ్చితంగా ఫాలో అవ్వండి తప్పు చేయడానికి వీల్లేదు | Asianet News Telugu
Recommended image3
PM Kisan : మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడలేవా..? అయితే వెంటనే ఈ పని చేయండి
Related Stories
Recommended image1
Success Story : పశువుల పేడతో లక్షల సంపాదన.. అద్భుతాలు చేస్తున్న ఆడబిడ్డ
Recommended image2
Success Story : మూడుసార్లు ఫెయిల్.. శత్రువుల వల్లే నాలుగోసారి సివిల్స్ ర్యాంక్ : ఓ తెలుగు ఐఏఎస్ సక్సెస్ స్టోరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved