- Home
- Andhra Pradesh
- Success Story : మూడుసార్లు ఫెయిల్.. శత్రువుల వల్లే నాలుగోసారి సివిల్స్ ర్యాంక్ : ఓ తెలుగు ఐఏఎస్ సక్సెస్ స్టోరీ
Success Story : మూడుసార్లు ఫెయిల్.. శత్రువుల వల్లే నాలుగోసారి సివిల్స్ ర్యాంక్ : ఓ తెలుగు ఐఏఎస్ సక్సెస్ స్టోరీ
Success Story : మన మిత్రులే కాదు శత్రువులు కూడా కొన్నిసార్లు మంచి చేస్తారని యువ తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సక్సెస్ స్టోరీ చెబుతోంది. ఆయన శత్రువుల వల్లే సివిల్స్ ర్యాంకు సాధించారట.. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

పవన్ కల్యాణ్ ఓఎస్డి కృష్ణతేజ IAS సక్సెస్ జర్నీ
Success Story : సాధారణంగా ఎవరైనా జీవితంలో సక్సెస్ అయ్యారంటే అందుకు తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులే కారణమని చెబుతారు. కానీ శత్రువులు కూడా ఒక్కోసారి మన విజయానికి కారణం అవుతారని ఓ తెలుగు యువ ఐఏఎస్ నిరూపించారు. ఓ యువకుడు చదువులో టాపర్ అయినా, 24 గంటలు కష్టపడినా సివిల్స్ ర్యాంకు సాధించకపోయాడు... వరుస ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. దీంతో ఐఏఎస్ ఆశయాన్ని వదిలేసిన సమయంలో శత్రువులు తనకు మేలు చేశారని... మరోసారి సివిల్స్ ఎగ్జామ్ రాసి ర్యాంకు సాధించేలా చేశారని స్వయంగా ఆ ఐఏఎస్ తెలిపారు. ఇప్పుడతడు తెలుగు ప్రజలకు ఎంతో ఇష్టమైన హీరో, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓఎస్డి (ఆఫిసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) గా పనిచేస్తున్నారు. అతడే కృష్ణతేజ ఐఏఎస్.
కృష్ణతేజ సక్సెస్ లో శత్రువుల పాత్ర...
ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ చిన్నప్పటి నుండి చదువులో చాలా చురుకు. అతడు టెన్త్, ఇంటర్, ఇంజనీరింగ్ అన్నింట్లోనూ టాపర్... దీంతో తాను ఈజీగా సివిల్స్ ర్యాంక్ సాధించగలనని భావించాడు. ఇలా దేశంలోనే అత్యున్నత సర్వీస్ ఐఏఎస్ సాధించి కలెక్టర్ కావాలని కలగనే కృష్ణతేజకు ఆరంభంలో వరుస ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. ఓ దశలో ఇక సివిల్స్ ప్రిపరేషన్ ఆపేసి ఐటీ ఉద్యోగానికి సిద్దమయ్యారు... ఈ సమయంలోనే తన శత్రువుల వల్ల తన ఆలోచన మారిందని... తిరిగి సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ అయ్యానని అతడు తెలిపారు.
తనకు చిన్నప్పటి నుండి చదువులో అనేక సక్సెలు ఇచ్చిన దేవుడు సివిల్స్ లో మాత్రం మూడు ఫెయిల్యూర్స్ ఇచ్చారని కృష్ణతేజ తెలిపారు. ఐఏఎస్ కావాలని కలగానే తాను ఎంతో కసితో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేవాడినని... 24 గంటలు చదివినా 3 సార్లు ఫెయిల్ అయ్యానని తెలిపారు. దీంతో కాన్ఫిడెంట్ పూర్తిగా తగ్గి తన తప్పులేంటో తెలుసుకునేందుకు నెల రోజులు తనలో తానే చెక్ చేసుకున్నాడట... కానీ ఏ తప్పులూ దొరకలేవు. మరో నెలరోజులు సివిల్స్ ఎందుకు సాధించలేకపోతున్నానో తెలపాలని ఫ్రెండ్స్ ని ఆరాతీశానని... వాళ్లు కూడా తన ఫెయిల్యూర్ కారణం చెప్పలేకపోయారని కృష్ణతేజ వెల్లడించారు.
చివరకు తాను సివిల్స్ సాధించడం అసాధ్యమని భావించి ఓ ప్రైవేట్ కంపెనీలో ఐటీ ఉద్యోగం కోసం సిద్దమయ్యానని... ఇదే సమయంలో కొందరు శత్రువులు తనకు చాలా మేలు చేశారని కృష్ణతేజ తెలిపారు. సివిల్స్ ప్రిపరేషన్ వదిలేశానని తెలిసి వెక్కిరించడానికి వచ్చిన ముగ్గురు శత్రువులు తనలోని నెగెటివ్స్ తెలిపారని... వాటిని సరిచేసుకుని మరోసారి ప్రయత్నించి ఐఏఎస్ సాధించానని ఆసక్తికరమైన తన సక్సెస్ స్టోరీని వివరించారు కృష్ణతేజ ఐఏఎస్.
శత్రువుల నుండి పాఠాలు నేర్చుకున్న ఐఏఎస్ కృష్ణతేజ
సివిల్స్ వదిలి ఐటీ జాబ్ కు సిద్దమైన కృష్ణతేజకు ముగ్గురు శత్రువులు కళ్ళు తెరిపించారు. అతడిని వెక్కిరించడానికి వచ్చినవాళ్లు మంచి చేశారు... వాళ్ల వల్లే తన నెగెటివ్స్ ఏంటో తెలిశాయని కృష్ణతేజ పేర్కొన్నారు. వాళ్ళు చెప్పిన మూడు నెగెటివ్స్ ఇవే.
1. సివిల్ సర్వీసెస్ లో మొత్తం 2000 మార్కులు రాతపరీక్ష ఉంటుంది. వ్యాసరూప ప్రశ్నలకు చక్కగా జవాబు రాయడమే కాదు పేపర్ చూడగానే అట్రాక్ట్ కావాలంటే చక్కటి హ్యాండ్ రైటింగ్ అవసరం. అయితే చేతిరాత బాగుండకపోవడంవల్లే మార్కులు తగ్గుతున్నాయని.... అందువల్లే సివిల్స్ సాధించడం అసాధ్యమని ఓ శత్రువు కృష్ణతేజకు తెలిపాడు.
2. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో వ్యాసరూపకంగానే జవాబులు రాయాల్సి ఉంటుంది. కానీ ఇంజనీరింగ్ లో అలవాటైన విధంగా పాయింట్ల రూపంలో జవాబులు రాస్తే మార్కులు తక్కువగా వస్తాయి. ఇదే తప్పు కృష్ణతేజ చేసేవాడట... అందువల్లే మార్కులు తగ్గుతున్నాయని... ఒక విషయాన్ని మంచి కథలాగా వివరిస్తే మంచిమార్కులు వస్తాయని మరో శత్రువు చెప్పాడు.
3. మరో శత్రువు ఇంటర్వ్యూలో ఎందుకు మార్కులు తగ్గుతున్నాడో తెలిపాడట. 'ఏం మాట్లాడినా సూటిగా మాట్లాడతావు... కానీ సివిల్స్ ఇంటర్వ్యూలో డిప్లమాటిక్ గా మాట్లాడితేనే మార్కులు వస్తాయి' అని చెప్పాడట. అందుకే సివిల్స్ ఇంటర్వ్యూలో మార్కులు తగ్గి ర్యాంకు రావడం లేదని చెప్పాడు.
నెగెటివ్స్ ను పాజిటివ్ గా మార్చుకున్న కృష్ణతేజ
తనను ద్వేషించే శత్రువులు వెక్కింరించడానికి వచ్చి చాలా మేలు చేశారని కృష్ణతేజ చెబుతున్నారు. అందుకే ఎప్పుడైన మన పాజిటివ్స్ గురించి తెలుసుకోవాలంటే కుటుంబసభ్యులు. స్నేహితులను సంప్రదించాలని... నెగెటివ్స్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం శత్రువులను అడగాలని చెబుతున్నారు. తన శత్రువులు సూచించిన నెగెటివ్స్ ను అధిగమించడంవల్లే ఐఏఎస్ కాగలిగానని కృష్ణతేజ తెలిపారు.
పవన్ కల్యాణ్ దృష్టిలో ఎలా పడ్డారు..?
2009 నుండి సివిల్స్ కు ప్రిపేర్ అవుతూ మూడుసార్లు ఫెయిల్ అయ్యాడు కృష్ణతేజ... 2014 లో నాలుగో ప్రయత్నంలో ఆల్ ఇండియా 66వ ర్యాంకు సాధించాడు. 2015 లో శిక్షణ పూర్తిచేసుకున్న ఇతడికి కేరళ క్యాడర్ లభించింది... ఈ రాష్ట్రంల్లో వివిధ హోదాల్లో పనిచేసిన కృష్ణతేజ గతేడాది 2023 లో త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే అతడు మానవత్వంలో చేసిన ఓ గొప్పపని అతడికి దేశస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది.
కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన దాదాపు 609 మంది చిన్నారులను అక్కున చేర్చుకున్న కృష్ణతేజ దాతల సాయంతో చదువుకునే ఏర్పాటుచేశారు. ఇలా కలెక్టర్ కృష్ణతేజ సహకారంతో అనాధ పిల్లలు హాయిగా చదువుకుంటున్నారు. నిస్వార్థంతో చేసిన సేవలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. వందలాదిమంది అనాధ పిల్లలు చదువుకునే ఏర్పాటుచేసిన కృష్ణతేజ జాతీయ బాలల రక్షణ కమీషన్ పురస్కారానికి ఎంపికయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా కృష్ణతేజ పేరు మారుమోగింది... దీంతో అతడు పవన్ కల్యాణ్ దృష్టిలో పడ్డారు... అతడిని తన ఓఎస్డిగా నియమించుకున్నారు.

