MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • Rain Alert: బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో అకాల వ‌ర్షాలు. ఇండియా, పాక్ మ్యాచ్‌పై ప్ర‌భావం.?

Rain Alert: బంగాళ‌ఖాతంలో అల్ప‌పీడ‌నం.. ఈ ప్రాంతాల్లో అకాల వ‌ర్షాలు. ఇండియా, పాక్ మ్యాచ్‌పై ప్ర‌భావం.?

Rain Alert: పలు చోట్ల అకాల వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్ర‌స్తుతం కొన‌సాగుతోన్న ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నంతో కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 15 2026, 07:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావం
Image Credit : Getty, Gemini AI

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావం

ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్ర‌భావం ప్ర‌ధానంగా తమిళనాడు, శ్రీలంక వైపు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. అయితే ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యక్ష ప్రభావం తక్కువగానే ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం ఆదివారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో విజిబిలిటీ తగ్గే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆదివారం అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం
Image Credit : Getty

ఆదివారం అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం

హిందూ మహాసముద్రం సమీప ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో గాలుల అస్థిరత పెరిగింది. దీని ఫలితంగా ఫిబ్రవరి 15 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వ్యవస్థ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపడంతో పాటు శ్రీలంకలో విస్తారమైన వర్షాలకు దారితీయొచ్చు. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. తీర ప్రాంతాల్లో సముద్రం ఉగ్ర‌రూపం దాల్చే అవకాశమున్నందున మత్స్యకారులు సముద్ర యాత్రలు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు.

35
కొలంబో మ్యాచ్‌కు వర్ష ముప్పు
Image Credit : Getty

కొలంబో మ్యాచ్‌కు వర్ష ముప్పు

శ్రీలంకలోని కొలంబో నగరంలో ఫిబ్రవరి 15న జ‌రిగే ఇండియా–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌పై వర్ష ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. అక్కడి వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్ ప్రకారం, అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు నల్లటి మేఘాలు కమ్ముకొని వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం సమయంలో వర్షం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. భారీ వర్షం పడితే మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పులు రావచ్చని భావిస్తున్నారు. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

45
ఫిబ్రవరి 19 తర్వాత మ‌రో అల్ప‌పీడ‌నం
Image Credit : Pexels

ఫిబ్రవరి 19 తర్వాత మ‌రో అల్ప‌పీడ‌నం

ఇదే నెలలో మరోసారి బంగాళాఖాతంలో వాతావరణలో మార్పులు చోటు చేసుకోనున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ చెబుతోంది. మొదట ఉపరితల ఆవర్తనం ఏర్పడి, ఆ తర్వాత అల్పపీడనంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపించవచ్చని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాల ప్రభావం కొంత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

55
తెలుగు రాష్ట్రాలకు అకాల వర్షాల హెచ్చరిక
Image Credit : Istock

తెలుగు రాష్ట్రాలకు అకాల వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడే వాతావరణ వ్యవస్థల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణపై కూడా పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో ప్రభావం మరింతగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్య వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ విశ్లేషకులు తెలిపారు. తూర్పు, ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉంద‌ని చెబుతున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
క్రికెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
NO విడాకులు.. NO డౌట్స్! | TDP - Janasena Alliance News | Asianet News Telugu
Recommended image2
Now Playing
లోకేష్ ని ఆటపట్టిస్తున్న పిల్లలు | Nara Lokesh | Asianet News Telugu
Recommended image3
Now Playing
😂 Student Hilarious Reply To Nara Lokesh |లోకేష్ కే పంచు వేసిన బుడ్డోడు | Asianet News Telugu
Related Stories
Recommended image1
Richest cities: దేశంలో టాప్ 10 ధ‌నిక‌ న‌గ‌రాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు సిటీలు
Recommended image2
ఈ ప్రాంతాల్లో భూములున్న వారి పంట పండిన‌ట్లే.. రూ. 34 వేల కోట్లతో ఊహ‌కంద‌ని అభివృద్ధి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved