MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • Holiday : ఈ సోమవారం కూడా తెలుగోళ్లకు సెలవే... ఎందుకో తెలుసా..?

Holiday : ఈ సోమవారం కూడా తెలుగోళ్లకు సెలవే... ఎందుకో తెలుసా..?

Maha Shivaratri Holiday 2026 : ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులు ఎగిరిగంతేసే సమాచారమిది. ఇప్పటికే మహా శివరాత్రికి రెండ్రోజుల సెలవులు కలిసిరాగా అదనంగా మరో సెలవు ప్రకటించింది ప్రభుత్వం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 14 2026, 09:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫిబ్రవరి 16న సెలవు డిక్లేర్...
Image Credit : stockPhoto

ఫిబ్రవరి 16న సెలవు డిక్లేర్...

Maha Shivaratri Holiday : ఇవాళ రెండో శనివారం విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు. రేపు ఆదివారం కాబట్టి సాధారణ సెలవే... అయితే ఫిబ్రవరి 15న మహా శివరాత్రి పండగ సందర్బంగా ప్రత్యేక సెలవు కూడా ఉంది. ఆదివారం పండగ రావడంతో ఓ సెలవు మిస్ అయ్యామని బాధపడుతున్న ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారమిది. మహా శివరాత్రి నేపథ్యంలో ఫిబ్రవరి 16న అంటే సోమవారం కూడా సెలవు ప్రకటించింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సోమవారం సెలవు...
Image Credit : stockPhoto

సోమవారం సెలవు...

మహా శివరాత్రి పండగను తెలుగు ప్రజలు చాలా భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. పండగరోజు ఉపవాసం ఉండి శివపూజ చేస్తారు... కొందరు శివాలయాలకు వెళుతుంటారు. ఆ పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈరోజు జాగరణ చేస్తే ఆయన ఆశిస్సులు లభిస్తుంటాయని నమ్ముతారు... అందుకే ఈరోజు రాత్రంతా మెలకువగా ఉంటారు. అలాంటప్పుడు ఉద్యోగులు తర్వాతరోజు విధులకు హాజరవడం కష్టం... దీన్ని దృష్టిలో ఉంచుకుని సోమవారం కూడా ఐచ్చిక సెలవు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అంటే కావాలనుకుంటే శివరాత్రి తర్వాతరోజు ప్రభుత్వ ఉద్యోగులు సెలవు తీసుకోవచ్చు... వేతనంతో కూడిన సెలవు లభిస్తుందన్నమాట.

34
వరుసగా మూడ్రోజులు సెలవులు...
Image Credit : stockPhoto

వరుసగా మూడ్రోజులు సెలవులు...

సోమవారం సెలవుతో ఈ శివరాత్రికి వరుసగా మూడ్రోజులు సెలవులు ఇచ్చినట్లు అయ్యింది. ఫిబ్రవరి 14 రెండో శనివారం... కాబట్టి ఉద్యోగులకు సెలవు వచ్చింది. శివరాత్రి పండక్కి ముందుగానే ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఈ సెలవుతో లభించింది. అంటే ఉపవాసానికి సంబంధించిన పండ్లు కొనుగోలు చేయడం, పండక్కి సంబంధించిన పూజ, ఇతర సరుకులు తెచ్చుకోవడం వంటివి తెచ్చుకునే వెసులుబాటు లభించింది.

ఇక రేపు (ఫిబ్రవరి 15, ఆదివారం) ఎలాగూ సాధారణ సెలవే. కాబట్టి మహా శివరాత్రి వేడుకలకు కుటుంబసభ్యులతో కలిసి ఘనంగా జరుపుకోవచ్చు. రాత్రికి జాగరణ చేసినా తర్వాతిరోజు (పిబ్రవరి 16, సోమవారం) ఆప్షనల్ హాలిడే తీసుకోవచ్చు. ఇలా మొత్తంగా మహా శివరాత్రి పండక్కి వరుసగా మూడ్రోజుల సెలవులు వచ్చాయి.

44
తెలంగాణ సోమవారం సెలవుందా..?
Image Credit : stockPhoto

తెలంగాణ సోమవారం సెలవుందా..?

కేవలం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఫిబ్రవరి 16న ఆప్షనల్ హాలిడే ప్రకటించింది... ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి సెలవు ప్రకటించలేదు. ఏపీ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే నేపథ్యంలో తమకు కూడా అలాంటి అవకాశం కల్పించాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే తెలంగాణ ఉద్యోగులకు ఎలాంటి సెలవు లేదు… రేపు (ఆదివారం0 ఏమైనా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Andhra Ooty: ఆంధ్ర ఊటీ.. అరకులో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 ప్రదేశాలు ఇవే
Recommended image2
Now Playing
NO విడాకులు.. NO డౌట్స్! | TDP - Janasena Alliance News | Asianet News Telugu
Recommended image3
Now Playing
లోకేష్ ని ఆటపట్టిస్తున్న పిల్లలు | Nara Lokesh | Asianet News Telugu
Related Stories
Recommended image1
Holiday: రెండో శ‌నివారం హాలీడే ఇవ్వ‌డానికి అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?
Recommended image2
Holiday Depression: సెలవుల్లో వచ్చే డిప్రెషన్ ఇది, దీని లక్షణాలు భరించడం నరకంతో సమానం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved