MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna: కాబోయే అత్తతో రష్మిక మందన్నా.. రహస్యంగా ఇంత కథ నడిపించారా? ఫోటోలు వైరల్‌

Rashmika Mandanna: కాబోయే అత్తతో రష్మిక మందన్నా.. రహస్యంగా ఇంత కథ నడిపించారా? ఫోటోలు వైరల్‌

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లికి మరో ఐదు రోజులే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు కాబోయే అత్తతో రష్మిక దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. వీరి రహస్యం బయటకు వచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 21 2026, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫిబ్రవరి 26న విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి
Image Credit : GA2 Pictures

ఫిబ్రవరి 26న విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి

రష్మిక మందన్నా త్వరలో పెళ్లిపీఠలెక్కబోతుంది. విజయ్‌ దేవరకొండని ఆమె మ్యారేజ్‌ చేసుకోబోతుంది. మరో ఐదు రోజుల్లో వీరి వివాహం జరగబోతుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో వివాహం జరుగుతుంది. అందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈనెల 26న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ ఉదయ్‌ పూర్‌కి చేరుకున్నట్టు సమాచారం. ఇటీవల వీరు ఎయిర్‌ పోర్ట్ లో మెరిసిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మార్చి 4న విజయ్‌, రష్మిక రిసెప్షన్‌
Image Credit : Asianet News

మార్చి 4న విజయ్‌, రష్మిక రిసెప్షన్‌

గురువారం మ్యారేజ్‌ జరుగుతుండగా, ఐదు రోజుల పెళ్లి తరహాలో తమ వివాహాన్ని ప్లాన్‌ చేసుకున్నారట. ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్, హల్దీ వేడుక, మ్యారేజ్‌ ఇలా వరుసగా ప్లాన్‌ చేసుకున్నారట. అయితే ఈ పెళ్లికి అతికొద్ది మంది బంధుమిత్రులను మాత్రమే ఆహ్వానించారు విజయ్‌, రష్మిక. ఇరు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు, మిత్రులు మాత్రమే హాజరు కాబోతున్నారు. ఇండస్ట్రీ నుంచి ఒకరిద్దరు మాత్రమే హాజరయ్యే ఛాన్స్ ఉంది. అయితే మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ప్లాన్‌ చేశారు. దానికి ఇండస్ట్రీ వర్గాలు, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు హాజరు కానున్నారు. తాజ్‌ కృష్ణలో ఈ రిసెప్షన్‌ ఫిక్స్ చేసినట్టు సమాచారం.

35
గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌లో కలిసి నటించిన రష్మిక, విజయ్‌ దేవరకొండ
Image Credit : GA2 Pictures

గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌లో కలిసి నటించిన రష్మిక, విజయ్‌ దేవరకొండ

ఇదిలా ఉంటే విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. `గీత గోవిందం` టైమ్‌లో స్నేహం ఏర్పడింది. `డియర్‌ కామ్రేడ్‌` టైమ్ లో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమని కంటిన్యూ చేశారు. దాదాపు ఏడేళ్ల ప్రేమ అనంతరం ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇదిలా ఉంటే తమ ప్రేమ విషయాన్ని వీరిద్దరు రహస్యంగానే ఉంచారు. కాకపోతే హింట్‌ ఇస్తూ వచ్చారు. విజయ్‌ దేవరకొండ ఇంటికి రష్మిక రావడం, వీరిద్దరు కలిసి వెకేషన్‌ కి వెళ్లడం అన్నీ నెటిజన్లు పట్టుకున్నారు.

45
కాబోయే అత్తతో రష్మిక ఫోటోలు లీక్‌
Image Credit : instagram/@celebritycouple

కాబోయే అత్తతో రష్మిక ఫోటోలు లీక్‌

అయితే ఇన్నాళ్లకు ఆ రహస్యం బయటకు వచ్చింది. ఇప్పుడు స్వయంగా రష్మిక మందన్నా తనకు కాబోయే అత్తతో దిగిన ఫోటోలు లీక్‌ అయ్యాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రష్మిక విజయ్‌ ఇంటికి వెళ్తుండేది అనే టాక్‌ నడిచింది. దాన్ని నిజం చేశారు. విజయ్‌ దేవరకొండ అమ్మతో రష్మిక దిగిన ఫోటోలు బయటకు రావడంతో రష్మిక రహస్యంగా చాలా కథ నడిపించిందని అర్థమవుతుంది. విజయ్‌ దేవరకొండ అమ్మ మాధవి, రష్మిక ఎంతో క్లోజ్‌గా ఉన్నారు. వీరిద్దరు సరదాగా నవ్వుకున్నారు. బాగా కలిసిపోయారు. వీరి మధ్య చాలా కాలంగా మంచి బాండింగ్‌ ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది.

55
కాబోయే అత్తతో రష్మిక మందన్నా రచ్చ
Image Credit : instagram/@celebritycouple

కాబోయే అత్తతో రష్మిక మందన్నా రచ్చ

ఈ ఫోటోలను బట్టి చూస్తే, వీరంతా కలిసి పార్టీలకు వెళ్లారు, ఇంట్లో సందడి చేశారు. వెకేషన్‌కి కూడా వెళ్లారు. ఇంట్లో సరదాగా టైమ్‌ స్పెండ్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఫోటోస్‌లో ఆనంద్‌ దేవరకొండ కూడా కనిపించడం విశేషం. మొత్తంగా చాలా రోజుల నుంచే అత్తా కోడళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారని చెప్పొచ్చు. అదే సమయంలో రష్మిక మందన్నా చాలా కాలం నుంచే విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీలో భాగమైపోయిందని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Actress Roja: రోజా నిద్రపోతుంటే రజనీకాంత్ చేసిన అల్లరి పనికి అంతా షాక్‌.. సెట్‌లో సూపర్‌స్టార్‌ ఎలా ఉంటారంటే?
Recommended image2
Varanasi Update: మహేష్‌ `వారణాసి` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌.. అప్పట్నుంచే అసలైన పండగ షురూ
Recommended image3
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Related Stories
Recommended image1
Prabhas Favorite Director: ప్రభాస్‌కి ఇష్టమైన సినిమా ఇదే, యాక్షన్‌ లవర్స్ కి షాక్‌.. పూరీని మించినోడు లేడు
Recommended image2
Top 10 Heroines: పడిపోయిన రష్మిక, దీపికా దుమ్ములేపిన నయనతార, త్రిష.. ఇండియాలో నెంబర్‌ 1 ఈమెనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved