MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Meghana Raj: రెండో పెళ్లిపై తొలిసారిగా ఓపెన్‌ అయిన మేఘన.. జీవితంలో ఒక తోడు కావాలంటూ ఎమోషనల్

Meghana Raj: రెండో పెళ్లిపై తొలిసారిగా ఓపెన్‌ అయిన మేఘన.. జీవితంలో ఒక తోడు కావాలంటూ ఎమోషనల్

Meghana Raj: కన్నడ నటుడు చిరంజీవి సర్జా భార్య, నటి మేఘనా రాజ్‌ తన రెండో పెళ్లిపై స్పందించారు. ప్రతి ఒక్కరి తోడు అవసరం అని తెలిపారు. ఈ సందర్భంగా రెండో పెళ్లిపై క్రేజీగా రియాక్ట్ అయ్యారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 21 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తోడు కావాలని ప్రకటించిన మేఘనా రాజ్‌
Image Credit : youtube/@Rayane_Mithun

తోడు కావాలని ప్రకటించిన మేఘనా రాజ్‌

'ప్రతి ఒక్కరికీ ఒక తోడు కావాలి. అది భర్త రూపంలోనే కానక్కర్లేదు, కానీ ఒక కంపానియన్ ఉండాలి. కష్టసుఖాలు పంచుకోవడానికైనా ఒకరు కావాలి' అంటూ మేఘనా రాజ్ తొలిసారి తన మనసులోని మాట బయటపెట్టారు. 'రయానే మిథున్' అనే ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రెండో పెళ్లిపై మేఘనా రాజ్‌ కామెంట్‌
Image Credit : youtube/@Rayane_Mithun

రెండో పెళ్లిపై మేఘనా రాజ్‌ కామెంట్‌

'చాలా మంది నాతో రెండో పెళ్లి గురించి మాట్లాడతారు. కానీ ప్రస్తుతానికి నేను మానసికంగా సిద్ధంగా లేను. అలాగని చేసుకోనని చెప్పడం లేదు. భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే, ఆ క్షణంలో ఏం చేయాలో ఆలోచిస్తాను' అని గతంలో మేఘన చెప్పి, రెండో పెళ్లికి సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు దానిపై ఓపెన్‌గా మాట్లాడారు.

36
మేఘనా రాజ్‌కి పెళ్లిపై ప్రశ్నలు
Image Credit : youtube/@Rayane_Mithun

మేఘనా రాజ్‌కి పెళ్లిపై ప్రశ్నలు

భర్త చిరంజీవి సర్జా చనిపోయి ఆరేళ్లు కావొస్తున్నా, మేఘనా రాజ్‌కు రెండో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. గతంలో ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించడం లేదని, కానీ భవిష్యత్తులో జరగొచ్చేమోనని అన్నారు.

46
మేఘనా రాజ్‌ తండ్రి కోరిక కూడా అదే
Image Credit : instagram/@megsraj

మేఘనా రాజ్‌ తండ్రి కోరిక కూడా అదే

కొన్ని రోజుల క్రితం మేఘన తండ్రి, సీనియర్ నటుడు సుందర్ రాజ్ కూడా కూతురి పెళ్లిపై మాట్లాడారు. 'ఎంపిక ఆమెదే. జీవితం ఆమెది. కాబట్టి ఆమె నిర్ణయమే మా నిర్ణయం. సమాజానికి ఆదర్శంగా బతకాలి. ఎవరూ మన గురించి తప్పుగా మాట్లాడుకోకూడదు. ఈ క్రమంలోనే ఓ మంచి జీవితాన్ని ఎంచుకోవాలి' అని ఆయన అన్నారు.

56
తోడు అవసరం చెప్పిన మేఘనా రాజ్‌ తండ్రి
Image Credit : instagram/@megsraj

తోడు అవసరం చెప్పిన మేఘనా రాజ్‌ తండ్రి

'ప్రతి మగాడికి ఒక ఆడది, ఆడదానికి ఒక మగాడు కావాలి. ఇది కేవలం శారీరక సంబంధం కోసం కాదు. అదొక మానసిక బంధం. ఒకరి చేయి పట్టుకుని నడవాలి. ఇది ప్రకృతి నియమం. ఒకరి మనసు నొప్పించకుండా బతకాలి' అని సుందర్ రాజ్ తన కూతురి జీవితంలోకి మరొకరు రావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు మేఘన కూడా అదే దారిలో ఆలోచిస్తుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

66
గర్భంతో ఉన్నప్పుడే చిరంజీవి సర్జా మరణం
Image Credit : instagram/@megsraj

గర్భంతో ఉన్నప్పుడే చిరంజీవి సర్జా మరణం

ప్రస్తుతం మేఘనా రాజ్ తన కొడుకు రయాన్ రాజ్ సర్జా ఆలనాపాలనతో పాటు సినిమాల్లోనూ యాక్టివ్‌గా ఉన్నారు. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడే భర్త చిరంజీవి సర్జాను కోల్పోయిన విషయం తెలిసిందే. చిరు మరణం తర్వాత ఆ కుటుంబానికి రయాన్ రూపంలో వెలుగు వచ్చింది. 2020 జూన్‌లో చిరు మరణించారు. అప్పటి నుంచి మేఘన రెండో పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. చిరంజీవి సర్జా.. అర్జున్‌ సర్జా మేనల్లుడు కావడం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RC17: ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ తో డీల్ కుదర్లేదా ? సుకుమార్, రామ్ చరణ్‌ మూవీ కోసం అనిరుధ్
Recommended image2
Rashmi Gautam: రష్మి గౌతమ్‌ నవరాత్రి స్పెషల్ ఫొటోషూట్..ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజ్ చేస్తోందిగా
Recommended image3
Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Related Stories
Recommended image1
Prabhas Favorite Director: ప్రభాస్‌కి ఇష్టమైన సినిమా ఇదే, యాక్షన్‌ లవర్స్ కి షాక్‌.. పూరీని మించినోడు లేడు
Recommended image2
Rashmika Mandanna: కాబోయే అత్తతో రష్మిక మందన్నా.. రహస్యంగా ఇంత కథ నడిపించారా? ఫోటోలు వైరల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved