MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • Heavy Rain Alert: రెండు ద్రోణుల ఎఫెక్ట్.. రెండ్రోజులు భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్

Heavy Rain Alert: రెండు ద్రోణుల ఎఫెక్ట్.. రెండ్రోజులు భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 29 2026, 06:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ముంచెత్తబోతున్న వానలు.. ఈ జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు
Image Credit : Gemini

ముంచెత్తబోతున్న వానలు.. ఈ జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండల వేడి నుంచి ఉపశమనం లభించినా, ఇప్పుడు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ వాతావరణంపై ఉత్తరాంధ్ర తీరప్రాంతం నుండి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు విస్తరించి ఉన్న ఒక ద్రోణి తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

దీనికి తోడు, అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరొక ద్రోణి కూడా యాక్టివ్‌గా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ డబుల్ ద్రోణుల ఎఫెక్ట్‌తో రాబోయే రెండు రోజులు ఏపీ అంతటా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, చెదురుమదురుగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జిల్లాల వారీగా వానల అంచనా.. మంగళవారం వీళ్ళకే అలర్ట్
Image Credit : Gemini

జిల్లాల వారీగా వానల అంచనా.. మంగళవారం వీళ్ళకే అలర్ట్

సోమవారం (జూన్ 29) కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఇక అసలు సిసలైన అలర్ట్ మంగళవారం (జూన్ 30) నాడు ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఈ

జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ లైట్ వానలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఆదివారం సాయంత్రానికే మంగళగిరిలో 68.2 మిమీ, రాజంలో 52.5 మిమీ, కాకుమానులో 51.5 మిమీ, తాడేపల్లిలో 45.2 మిమీ చొప్పున భారీ వర్షపాతం రికార్డైంది.

Related Articles

Related image1
ATM PIN : ఏటీఎం పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీ ఇదే
Related image2
Naga Durga Song: ఆ ఊపు.. ఆ స్టెప్పులు వేరే లెవెల్ ! డీజేలను ఊపేస్తోన్న నాగదుర్గ పల్లె పాట !
35
చెట్ల కింద నిలబడొద్దు.. ఏపీ విపత్తుల సంస్థ సేఫ్టీ టిప్స్
Image Credit : Gemini AI

చెట్ల కింద నిలబడొద్దు.. ఏపీ విపత్తుల సంస్థ సేఫ్టీ టిప్స్

ఈదురుగాలులు, ఉరుములతో వానలు పడేటప్పుడు పబ్లిక్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. వర్షం వచ్చేటప్పుడు పొరపాటున కూడా పెద్ద పెద్ద చెట్ల కింద, రోడ్ల పక్కన ఉండే భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని హెచ్చరించారు. గాలి వేగానికి విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉంది కాబట్టి, రోడ్డుపై నడిచేటప్పుడు కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలి. ఇక ఆకాశం మబ్బు పట్టి ఉరుములు వినిపించగానే పొలాల్లో ఉండే రైతులు, కూలీలు, పశువుల కాపరులు అస్సలు రిస్క్ తీసుకోకుండా వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

45
తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వానలు
Image Credit : X/APSDMA

తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వానలు

తెలంగాణలోనూ వానలు పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు ఫుల్ యాక్టివ్‌గా కదులుతుండటంతో వాతావరణం కూల్ అయింది. సోమవారం (జూన్ 29) తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వానలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉండటంతో వాతావరణ కేంద్రం తెలంగాణవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

55
భాగ్యనగరంలోనూ వానలు
Image Credit : Getty

భాగ్యనగరంలోనూ వానలు

హైదరాబాద్ వాతావరణం కూడా కూల్ అయింది. సోమవారం ఆకాశం మబ్బులతో నిండిపోయి ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పగటిపూటతో పాటు సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం దాదాపు 65 శాతం వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ఏరియాల్లో హఠాత్తుగా ఉరుములతో కూడిన భారీ జల్లులు పడే ఛాన్స్ ఉంది కాబట్టి, వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవడం మంచిదని అధికారులు చెప్పారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మావి కుటుంబాలు కాదా చంద్రబాబు రెచ్చిపోయిన జోగి | Jogi Ramesh Family Issue
Recommended image2
Holidays : ఇంకా ఒక్కరోజే స్కూలు, కాలేజీ, ఆఫీసులకు వెళ్లండి.. తర్వాత వరుసగా ఐద్రోజుల సెలవులు పొందండి
Recommended image3
Now Playing
మేఘన కూతురు కంటే ఎక్కువ: జోగి రమేష్ | Jogi Ramesh Reacts On His Son Rajeev Issue
Related Stories
Recommended image1
ATM PIN : ఏటీఎం పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీ ఇదే
Recommended image2
Naga Durga Song: ఆ ఊపు.. ఆ స్టెప్పులు వేరే లెవెల్ ! డీజేలను ఊపేస్తోన్న నాగదుర్గ పల్లె పాట !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved