- Home
- Andhra Pradesh
- AP Municipal Elections Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ హడావుడి.. తుపాను వానల్లో ఓట్ల లెక్కింపు రచ్చ
AP Municipal Elections Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ హడావుడి.. తుపాను వానల్లో ఓట్ల లెక్కింపు రచ్చ
AP Municipal Elections 2026 Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల లెక్కింపు మొదలైంది. పులివెందులకు హైకోర్టు ఓకే అనగా వర్షంతో పలుచోట్ల ఆలస్యమైంది. చిత్తూరులో టీడీపీ లీడ్ లో కొనసాగుతోంది.. పార్వతీపురంలో తాళం మిస్ కావడంతో లెక్కింపు ఆలస్యం అయింది.

ఏపీ మున్సిపల్ ఫలితాల్లో ట్విస్టులే ట్విస్టులు
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పోరులో గెలుపు కింగ్ ఎవరో తేల్చే కౌంటింగ్ డే వచ్చేసింది.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ఊపందుకుంది. మొత్తం 60 లక్షల మంది ఓటర్లు వేసిన తీర్పు బ్యాలెట్ బాక్సుల నుంచి బయటకు రాబోతోంది. మేయర్, ఛైర్‌పర్సన్ పీఠాల కోసం పోటీ పడుతున్న 520 మంది, కౌన్సిలర్లు, కార్పొరేటర్ పదవుల కోసం తలపడుతున్న 10,105 మంది అభ్యర్థుల జాతకాలు నేటితో తేలిపోనున్నాయి. రాష్ట్రంలో ఉన్న 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ లెక్కింపు హడావుడి నడుస్తోంది.
పులివెందులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
కౌంటింగ్ మొదలవ్వడానికి కొన్ని నిమిషాల ముందే కీలకమైన అప్డేట్ వచ్చింది. పులివెందుల మున్సిపల్ కౌంటింగ్‌పై సస్పెన్స్ కంటిన్యూ అవుతుందనుకున్న టైమ్‌లో హైకోర్టు మైండ్ బ్లాకింగ్ తీర్పు ఇచ్చింది. కౌంటింగ్ ఆపాలంటూ వైసీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీల, ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. కేవలం ఎస్ఈసీ రీపోలింగ్ పెట్టిన 4 వార్డులే కాకుండా మున్సిపాలిటీ మొత్తంలో మళ్లీ పోలింగ్ పెట్టాలని వారు కోరారు. అయితే సోమవారం వాదనలు విన్న హైకోర్టు, మంగళవారం ఉదయం 7.30 గంటలకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పులివెందులలో కూడా లైన్ క్లియర్ అయిపోయింది.
మురసు తుపాను వర్షాల ఎఫెక్ట్: కౌంటింగ్ కేంద్రాల్లో ఆలస్యం
ఒకవైపు పాలిటిక్స్ హీట్ ఉంటే, మరోవైపు మురసు తుపాను ముంచెత్తుతోంది. తెల్లవారుజాము నుంచే వర్షం దంచికొడుతోంది. దీంతో పలు చోట్ల కౌంటింగ్ ఆలస్యమైంది.
• విజయవాడ, చిలకలూరిపేట: నిరంతరం కురుస్తున్న వాన వల్ల సిబ్బంది సెంటర్లకు రావడం ఆలస్యమైంది.
• ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో: ఈ పరిణామాలతో ఎస్ఈసీ స్పందించి కౌంటింగ్ సమయాన్ని ఉదయం 8 నుంచి 11:30 గంటలకు మార్చింది.
• రేపల్లె: ఇక్కడ స్ట్రాంగ్ రూమ్‌ను ఉదయం 10 గంటలకు తెరిచి, 11 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు.
• నిడదవోలు, గుంటూరు: వానల కారణంగా కౌంటింగ్ ఆలస్యంగా షురూ అవుతోంది.
నందిగామలో వర్షంలోనే డ్యూటీ, ఆదోనిలో టిఫిన్ రచ్చ
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ వర్షం పడుతున్నా సరే అభ్యర్థులు, ఏజెంట్లు, ఆఫీసర్లు వానలోనే కౌంటింగ్ సెంటర్‌కు చేరుకుని పక్కాగా కౌంటింగ్ స్టార్ట్ చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కపెడుతున్నారు. కానీ కర్నూలు జిల్లా ఆదోనిలో మాత్రం ఓ చిత్రమైన సీన్ కనిపించింది. సిబ్బందికి సమయానికి టిఫిన్ అందకపోవడంతో తిండి వచ్చేదాకా కౌంటింగ్ ఆపేసి వెయిట్ చేయడం గమనార్హం.
పార్వతీపురంలో తాళం మిస్సింగ్ సస్పెన్స్
విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో మాత్రం ఒక చిన్న సినిమా సీన్ రిపీట్ అయింది. కౌంటింగ్ స్టార్ట్ చేద్దామని వెళ్లేసరికి స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి కనిపించకపోవడంతో అధికారులు షాక్ తిన్నారు. దాంతో అక్కడ లెక్కింపు ఆలస్యంగా మొదలుకానుంది.
కూటమి వర్సెస్ వైసీపీ: ఓట్ల లెక్కలు
ఈ ఎన్నికల్లో అధికార కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) తమ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉంటే, వైసీపీ కూడా తాము గట్టి పోటీ ఇస్తామని లెక్కలేస్తోంది.
• మేయర్ స్థానాలు (13): టీడీపీ 10, జనసేన 2, బీజేపీ 1 స్థానంలో పోటీ పడగా, వైసీపీ అన్ని 13 చోట్లా బరిలో నిలిచింది.
• ఛైర్‌పర్సన్ స్థానాలు (87): 17 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 70 స్థానాల్లో టీడీపీ 49, జనసేన 17, బీజేపీ 4 స్థానాల్లో పోటీ చేశాయి. వైసీపీ 70 చోట్లా బరిలో ఉంది.
ప్రస్తుతం మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ప్రాథమిక ట్రెండ్స్‌లో చిత్తూరు మేయర్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ లీడ్‌లో ఉంది. బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కట్టడానికి గంట నుంచి గంటన్నర పడుతుంది కాబట్టి, మధ్యాహ్నానికి మెల్లగా ఒరిజినల్ ట్రెండ్స్ బయటపడనున్నాయి. మొత్తం 138 కౌంటింగ్ కేంద్రాల్లో 47,817 మంది సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. రాత్రి 8 గంటల కల్లా స్టేట్ వ్యాప్తంగా కంప్లీట్ రిజల్ట్స్ రానున్నాయి.





