MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • School Holidays : మురసు తుపాను తీరందాటినా ముంతపోత వర్షాలు కంటిన్యూ.. ఈ జిల్లాల్లో స్కూల్ సెలవుల సంగతేంటి?

School Holidays : మురసు తుపాను తీరందాటినా ముంతపోత వర్షాలు కంటిన్యూ.. ఈ జిల్లాల్లో స్కూల్ సెలవుల సంగతేంటి?

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. అయితే దీని ప్రభావంతో మరో రెండుమూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులేమైనా పొడిగిస్తారా?

3 Min read
Author : Arun Kumar P
Published : Nov 03 2026, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
స్కూళ్లకి సెలవులు పొడిగిస్తారా?
Image Credit : Gemini AI

స్కూళ్లకి సెలవులు పొడిగిస్తారా?

Cyclone Murasu : తెలుగు విద్యార్థులకు దసరా సెలవులు ఇలా ముగిశాయో లేదా అలా తుపాను సెలవులు ప్రారంభమయ్యాయి. ఇటీవల అర్నబ్ తుపాను కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలకు వరుస సెలవులు వచ్చాయి... ఇప్పుడు మురసు తుపాను కారణంగా సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే మురసు తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో రెండ్రోజులుగా సెలవులు కొనసాగుతున్నాయి. అయితే మరో రెండుమూడు రోజులు మురసు తుపాను ఎఫెక్ట్ ఏపీపై ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది... పలు జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు మరిన్ని సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు... సెలవులు పొడిగిస్తారా?
Image Credit : Gemini AI

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు... సెలవులు పొడిగిస్తారా?

బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ఇవాళ (నవంబర్ 3, మంగళవారం) తెల్లవారుజామున తీరం దాటింది. నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో 3.30 నుంచి 5.30 మధ్య తుపాను తీరాన్ని తాకినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. ఇది తీరందాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచాయి... దీంతో తీరప్రాంతంలోని చెట్లు, కరెంట్ స్తంబాలు విరిగిపడ్డాయి... పలుచోట్లు సముద్ర అలల దాటికి రోడ్లు ధ్వంసం అయ్యాయి.

అయితే ప్రస్తుతం మురసు తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి... మరో రెండుమూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలపై తుపాను ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందని హెచ్చరిస్తోంది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటోంది. తూర్పుగోదావరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

ఇలా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్న జిల్లాల్లో ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతున్నాయి. ఈదురుగాలులు, వర్షాలు ఇలాగే కొనసాగితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఈ జిల్లాల్లో సెలవులను పొడిగించనున్నారు. అంటే వర్షాలు కురిసే ఈ రెండుమూడు రోజులు కూడా కొన్ని జిల్లాల విద్యార్థులకు సెలవులు రానున్నాయన్నమాట. అయితే స్థానిక పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లు సెలవులపై నిర్ణయం తీసుకుంటారు.

34
అత్యధిక వర్షపాతం ఇక్కడే...
Image Credit : Gemini AI

అత్యధిక వర్షపాతం ఇక్కడే...

తుపాను ప్రభావంతో నిన్నటి (నవంబర్ 2, సోమవారం) నుండి ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురుస్తున్నాయి. ఇలా నిన్న ఉదయం 8.30 నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు అత్యధికంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో 198.01 మిల్లిమీటర్లు, కొత్తపట్నంలో 182.25 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. ఇదే జిల్లాలోని త్రోవగుంటలో 116.93 మి.మీ, ఒంగోలు అర్బన్ లో 106.97 మి.మీ వర్షం కురిసింది. ఇక బాపట్లలో 128.53 మి.మీ, చీరాలలో 124.10 మి.మీ, చిలకపాడులో 104.50 మి.మీ, సంతనూతలపాడు 98.7మి.మీ, మొగల్తూరులో 96మి.మీ, మలికిపురం 93.7మి.మీ వర్షపాతం నమోదయినట్లు APSDMA ప్రకటించింది.

జిల్లాలవారిగా చూసుకుంటే... బాపట్ల జిల్లాలో అత్యధికంగా 40.02 మి.మీ. వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రకాశం జిల్లాలో 26.56 మి.మీ, పశ్చిమగోదావరి జిల్లాలో 23.36 మి.మీ, కృష్ణా జిల్లాలో 23.15 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. ఇక గుంటూరు జిల్లాలో 19.09 మి.మీ, శ్రీకాకుళం జిల్లాలో 18.30 మి.మీ, కోనసీమ జిల్లాలో 14.47 మి.మీ, తిరుపతి జిల్లాలో 12.37 మి.మీ, కాకినాడ జిల్లాలో 11.72 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం వెల్లడించింది.

44
తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ చర్యలు
Image Credit : Gemini ai

తుపానును ఎదుర్కొనేందుకు ప్రభుత్వ చర్యలు

మురసు తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ ప్రభావిత 13 జిల్లాల్లో 724 వైద్య బృందాలు, 4,628 అత్యవసర పడకలు, 205 సహాయ శిబిరాలను సిద్ధం చేసింది. 359 అంబులెన్సులు (108), 128 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు (102), 320 సంచార వైద్య వాహనాలు (104) అందుబాటులో ఉంచారు. అంబులెన్స్‌ సేవలను ఆర్టీజీఎస్‌ పోర్టల్‌తో అనుసంధానించారు.

తుపాను కారణంగా ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే నవంబర్‌ 1 నుంచి 10వ తేదీ మధ్య ప్రసవ గడువు ఉన్న 3,066 మంది గర్భిణులను గుర్తించి వారిలో 1,103 మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు. మిగిలిన వారిని అవసరాన్ని బట్టి ముందుగానే తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారి నివాస ప్రాంతాలను బట్టి ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో ప్రసవ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇలా తల్లిబిడ్డ ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
AP Municipal Elections Results: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ హడావుడి.. తుపాను వానల్లో ఓట్ల లెక్కింపు రచ్చ
Recommended image2
Cyclone Murasu: తీరం దాటిన మురసు తుపాను.. డేంజర్ జోన్‌లో ఏపీ, తెలంగాణ.. కుండపోత వర్షాలపై హైఅలర్ట్
Recommended image3
School Holidays : ఇక మురసు తుపాను బీభత్సమే.. మంగళవారం ఈ ఏడు జిల్లాల్లో స్కూళ్లకి సెలవు
Related Stories
Recommended image1
Cyclone Murasu : దూసుకొస్తున్న మురసు తుపాను.. శాటిలైట్స్ తీసిన భయంకరమైన ఫోటోలివే..!
Recommended image2
Cyclone Murasu: తీరం దాటిన మురసు తుపాను.. డేంజర్ జోన్‌లో ఏపీ, తెలంగాణ.. కుండపోత వర్షాలపై హైఅలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved