- Home
- Andhra Pradesh
- Andhra Pradesh : AI కి హార్ట్ గా మన వైజాగ్ .. ఇక్కడినుండే ప్రపంచానికి Google Gemini సేవలు
Andhra Pradesh : AI కి హార్ట్ గా మన వైజాగ్ .. ఇక్కడినుండే ప్రపంచానికి Google Gemini సేవలు
Google Data Center : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై టెక్ సీఎంగా గుర్తింపుపొందిన నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే ప్రపంచానికే ఏఐ హబ్ గా విశాఖపట్నంను తిర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నారు.

వైజాగ్ లో ఏఐ విప్లవం
Google : టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుంటారు. ఆయన దూరదృష్టితో తీసుకునే నిర్ణయాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి అనడానికి నిలువెత్తు నిదర్శనమే నేటి సైబరాబాద్. గతంలో హైదరాబాద్ లో చేసిన ప్రయత్నమే ఇప్పుడు వైజాగ్ తో చేస్తున్నారు చంద్రబాబు... ఈ నగరాన్ని టెక్ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు సిద్దమయ్యారు. ఇందులో భాగంగానే అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ తో వైజాగ్ లో పెట్టుబడులు పెట్టిస్తూ బీచ్ సిటీని కాస్త ఏఐ సిటీగా తీర్చిదిద్దేందుకు వ్యూహాలను అమలుచేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు.
గూగుల్ తో ఏపీ సర్కార్ ఒప్పందం
గూగుల్ సంస్థ వైజాగ్ లో పెట్టుబడులకు సిద్దమయ్యింది... ఇందులో కీలకఘట్టం ఇవాళ (అక్టోబర్ 14, మంగళవారం) పూర్తయ్యింది. దేశ రాజధాని డిల్లీలో గూగుల్ ప్రతినిధులు, ఏపీ ప్రభుత్వం మద్య ఏపీలో భారీ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందం జరిగింది... విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు మొదటి అడుగు పడింది. ఈ కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ సిఈఓ థామస్ కురియన్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీమంత్రి నారా లోకేష్, కేంద్రం మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విన్ వైష్ణవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వైజాగ్ నుండే Google Gemini సేవలు
ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం గూగుల్ సంస్థ వచ్చే పదేళ్ళలో వైజాగ్ లో రూ. 87520 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో అత్యంత కీలకమైనది ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సెంటర్... ఒక గిగావాట్ సామర్థ్యంతో దీన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ డేటా సెంటర్ పూర్తయితే దేశానికే కాదు ప్రపంచానికి ఏఐ బాస్ గా వైజాగ్ మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
స్వయంగా గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటుచేసే డేటా సెంటర్ ను సబ్-సీ కేబుల్ ద్వారా 12 దేశాలకు అనుసంధానం చేస్తామని... జెమిని ఏఐతో పాటు గూగుల్ అందించే ఇతర సేవలను భారతదేశానికే కాదు కనెక్టివిటీ కలిగిన దేశాలకు అందిస్తామని కురియన్ తెలిపారు.
ఇక వైజాగ్ లో ప్రపంచస్థాయి ఏఐ నిపుణులు
గూగుల్ క్లౌడ్ సీఈవో కురియన్ మాట్లాడుతూ... అమెరికా బయట గూగుల్ ఇంతపెద్ద స్థాయిలో (15 బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారని అన్నారు. వైజాగ్ లో ఏర్పాటుచేసే గూగుల్ డేటా ప్రపంచానికి ఏఐ సేవలు అందించడమే కాదు ఏఐ నిపుణులను కూడా తయారుచేస్తుందని పేర్కొన్నారు. ఇలా ఏఐ అంటే వైజాగ్ అనేలా భవిష్యత్ ఉండనుందని... కేవలం భారతదేశమే కాదు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని అనేలా గూగుల్ క్లౌడ్ సీఈవో కురియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ రంగాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ సేవలు
వైజాగ్ లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు దశలవారిగా సాగుతుంది. పదేళ్ళలో అంటే 2035 లేదా 2036 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈలోపు విశాఖలో పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశాలున్నాయని ప్రభుత్వం భావిస్తోంది... ఇప్పటికే పారిశ్రామిక వేత్తలు విశాఖ వైపు ఆసక్తిగా చూస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. ఈ డేటా సెంటర్ ద్వారా వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో ఏఐ సేవలు మరింతగా అందుబాటులోకి రానున్నాయని... టెక్నాలజీలో సరికొత్త మార్పులకు ఇది నాంది పలుకుతుందని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
వైజాగ్ నుండి ఈ దేశాలకు ఏఐ సేవలు
వైజాగ్ లో ఏర్పాటుచేసే గూగుల్ డేటా సెంటర్ నుండి సీ-కేబుల్ ద్వారా కనెక్టివిటీ కల్పించనున్నట్లు గూగుల్ తెలిపింది. ఇలా సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఈ వైజాగ్ డేటా సెంటర్ నుండే Gemini తో పాటు ఇతర ఏఐ సేవలు అందనున్నాయి.
ఇప్పటికే విశాఖలో ఐటీ, ఇతర టెక్నాలజీ కంపెనీలు పెట్టుబడులకు సిద్దమయ్యాయి... ప్రభుత్వం భారీగా ప్రోత్సహకాలు అందిస్తుండటంతో ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే టిసిఎస్, యాక్సెంచర్ వంటి కంపెనీలు క్యూ కడుతున్నాయి. గూగుల్ తో ఒప్పందం తర్వాత మరిన్ని కంపెనీలు వైజాగ్ బాట పట్టే అవకాశాలున్నాయి.