Dussehra Holidays : తెలుగు స్టూడెంట్స్ కి దసరా సెలవులు పెరుగుతాయా..?
Dussehra Holidays 2025: తెలంగాణలో మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా దసరాకి ఎక్కువరోజులు రానున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరి కూటమి ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదైనా తీసుకుంటుందా..?

దసరా సెలవులు పెరుగుతాయా?
Dussehra Holidays 2025 : ఆంధ్ర ప్రదేశ్ లో దసరా సెలవులు ముందుగానే ప్రారంభం కానున్నాయా? సెలవులు పెంచాలని ఒత్తిడి పెరుగడంతో చంద్రబాబు సర్కార్ పునరాలోచనలో పడిందా? అందుకే శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యే రోజునుండే సెలవులు ఇవ్వాలని భావిస్తోందా? ఏపీ విద్యార్థులు త్వరలోనే సెలవులకు సంబంధించి గుడ్ న్యూస్ ఏమైనా వింటారా?... ఇలా దసరా సెలవులపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మాత్రమే సమాధానం చెబుతుంది.
ఏపీలో దసరా సెలవులు పెంచాలని ఎమ్మెల్సీ డిమాండ్
అయితే ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు, వారి పేరెంట్స్, ఉపాధ్యాయులే కాదు చివరకు ఎమ్మెల్సీలు సైతం దసరా సెలవులను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపీ మూర్తి దసరా సెలవులను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా విద్యార్థులకు దసరా సెలవులు ఇవ్వాలని ఆయన కోరారు. ఇలా స్వయంగా ఓ ఎమ్మెల్సీ సెలవులు పెంచాలని డిమాండ్ చేస్తుండటంపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఏపీలో కూడా సెప్టెంబర్ 22 నుండే సెలవులా?
ఆంధ్ర ప్రదేశ్ లో సెప్టెంబర్ 24 నుండి దసరా సెలవులు ప్రారంభం అవుతాయి... అయితే సెప్టెంబర్ 22 నుండి సెలవులు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. దసరా శరన్నవరాత్రి వేడుకలు ఈరోజు నుండే ప్రారంభం అవుతాయి... అందుకోసమే ఓ రెండ్రోజుల ముందునుండే సెలవులు ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతుంది. ఇందకు ప్రభుత్వం అంగీకరిస్తే తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా సెప్టెంబర్ 20 వరకే స్కూళ్లు నడుస్తాయి... 21 ఆదివారం నుండి సెలవులు స్టార్ట్ అవుతాయి.
దసరాకి సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ
ఇప్పటికే దసరాకు సొంతూళ్లకు వెళ్లేందుకు విద్యార్థులు సిద్దమవుతున్నారు. ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుండి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు బస్సులు, రైళ్లలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇక ప్రైవేట్ బస్సుల్లో కూడా వేగంగా సీట్ల బుకింగ్ జరుగుతోంది. ఇవన్నీ కాకుండా సొంత వాహనాల్లో వెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు. ఇలా దసరా పండక్కి హైదరాబాద్ ఖాళీ అవుతుంది. తెలంగాణలో ఎలాగూ సెప్టెంబర్ 21 నుండే సెలవులు ప్రారంభం అవుతాయి కాబట్టి సెప్టెంబర్ 20నుండి ప్రయాణాలు ప్రారంభంకానున్నాయి.
తెలంగాణలో దసరా సెలవులు ఎప్పట్నుంచి?
తెలంగాణలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్స్ అన్నింటికి దసరాకి 13 రోజులు సెలవులు ఇచ్చారు. సెప్టెంబర్ 21న మూతపడే స్కూల్ తలుపులు తిరిగి అక్టోబర్ 4న తెరుచుకోనున్నాయి... ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే అక్టోబర్ 4 శనివారం... ఆ ఒక్కరోజు మేనేజ్ చేసుకుంటే దసరా సెలవులు 13 కాదు 15 రోజులు. ఇక ప్రతి శని, ఆదివారం సెలవులుండే స్కూళ్లకు 16 రోజులు (సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 5 వరకు) సెలవులే.