MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • మొంథా తుపాన్ బీభత్సం.. దంచికొడుతున్న భారీ వర్షాలు, తీవ్ర గాలులు

మొంథా తుపాన్ బీభత్సం.. దంచికొడుతున్న భారీ వర్షాలు, తీవ్ర గాలులు

Cyclone Motha: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. కృష్ణా జిల్లాతో సహా తీరప్రాంతాల్లో అత్యవసర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 27 2025, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తీవ్రరూపం దాల్చిన మొంథా తుపాను
Image Credit : social media

తీవ్రరూపం దాల్చిన మొంథా తుపాను

మొంథా తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. పలు ప్రాంతాల్లో అంచనాల కంటే ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. మొంథా తుఫాన్ ప్రభావాన్ని నిరంతరంగా పర్యవేక్షించి, ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం ప్రజలకు చేరాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఉదయం నుంచి ప్రతీ గంటకూ తుఫాన్ బులిటెన్‌లు విడుదల చేస్తూ అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమీక్ష జరిపిన సీఎం, కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎలాంటి అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

శాటిలైట్ ఫోన్లు వినియోగించడంతో పాటు, తాత్కాలిక మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తుపాను ప్రభావం అధికంగా ఉండే 2,707 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. 110 మండలాల్లో పవర్ బ్యాకప్ కోసం 3,211 జెనరేటర్లు వినియోగించాలని చెప్పారు.

25
ప్రాణ–ఆస్తి రక్షణ ప్రభుత్వం చర్యలు
Image Credit : X/APSDMA

ప్రాణ–ఆస్తి రక్షణ ప్రభుత్వం చర్యలు

మొంథా తుపాను కారణంగా ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకుండా చూడటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కావాలని సీఎం పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసరాలు అందించాలని ఆదేశించారు. తుపాను అనంతరం అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా పారిశుధ్యాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని చెప్పారు.

గర్భిణీలు, బాలింతలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 108, 104 వాహనాలను సిద్ధం చేయాలని, యాంటీ స్నేక్ వెనోమ్, యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్లు పీహెచ్‌సీల్లో సిద్ధంగా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Related Articles

Related image1
దూసుకొస్తున్న మోంథా తుపాను.. అంతటా హై అలర్ట్
Related image2
మొంథా తుపాను ఎఫెక్ట్.. స్కూళ్లకు మూడు రోజులు సెలవులు
35
కృష్ణా జిల్లాలో అతిభారీ వర్షాల హెచ్చరిక
Image Credit : Asianet News

కృష్ణా జిల్లాలో అతిభారీ వర్షాల హెచ్చరిక

అధికారులు ముఖ్యమంత్రికి ఇచ్చిన వివరాల ప్రకారం, మొంథా తుఫాన్ ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ దూరంలో 16 కి.మీ వేగంతో కొనసాగుతోంది. ఉత్తర, దక్షిణ కోస్తాల్లో వర్షాలు కురుస్తున్నాయని, మంగళవారం కృష్ణా జిల్లాలో అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించామని చెప్పారు.

గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెనక్కి రప్పించామని తెలిపారు.

45
పద్ధతిగా రక్షణ చర్యలు తీసుకోవాలి
Image Credit : X/APSDMA

పద్ధతిగా రక్షణ చర్యలు తీసుకోవాలి

రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు అవాంతరాలు తలెత్తిన వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సీఎం చెప్పారు. కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి, రియల్ టైమ్ పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 851 జేసీబీలు, 757 పవర్ సాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటి వినియోగంపై మ్యాపింగ్ చేయాలని, ఆడిటింగ్ కూడా నిర్వహిస్తామని సీఎం తెలియజేశారు.

వరద నీరు వెళ్లేందుకు డ్రెయిన్లను శుభ్రపరచాలని సూచించారు. వ్యవసాయ పంటలు, పశుసంపద నష్టం జరగకుండా టార్పాలిన్లు నిల్వలో ఉంచాలని ఆదేశించారు.

55
తుపాను ప్రభావం పై ప్రధాని మోదీ ఆరా
Image Credit : Perplexity AI

తుపాను ప్రభావం పై ప్రధాని మోదీ ఆరా

తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం వివరించారు. కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని తెలిపారు.

ప్రధాని కార్యాలయంతో సమన్వయం బాధ్యతను మంత్రి నారా లోకేష్‌కు అప్పగించారు. సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్
వాతావరణం
అమరావతి
విజయవాడ
విశాఖపట్నం
హైదరాబాద్
తెలంగాణ
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu
Recommended image2
Now Playing
Rajamahendravaram Milk adulterated: కల్తీ పాల బాధితులను పరామర్శించిన అధికారులు| Asianet News Telugu
Recommended image3
Now Playing
Rajamahendravaram Milk: తూర్పు గోదావరి జిల్లాలో పాల కల్తీ జిల్లా ఎస్పీ కీలక సూచన | Asianet Telugu
Related Stories
Recommended image1
దూసుకొస్తున్న మోంథా తుపాను.. అంతటా హై అలర్ట్
Recommended image2
మొంథా తుపాను ఎఫెక్ట్.. స్కూళ్లకు మూడు రోజులు సెలవులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved